.
Murali Buddha …… పౌర సమాజం అంటే ? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్నా హజారే నాయకత్వంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది గుర్తుందా ?
ఎందుకు గుర్తు లేదు … హజారేకు భారత రత్న ఇవ్వాలని అసలైన మహాత్ముడు అతనే అని …. హజారేకన్నా రెండింతల ఎత్తున్న జాతీయ జెండాలతో శ్రీమాన్ బాబు గారు కూడా ఎన్టీఆర్ భవన్ నుంచి పంజాగుట్ట వరకు పాదయాత్ర చేశారు …
Ads
అవినీతికి వ్యతిరేకంగా అదేదో పార్లమెంట్ సభ్యులతో కమిటీ వేస్తే … ససేమిరా ఒప్పుకోము, పౌర సమాజంతో కమిటీ వేయాలి అని హజారే డిమాండ్ చేశాడు … బీజేపీ అధికారంలోకి వచ్చింది … అవినీతి వ్యతిరేకకమిటీ పేరు వినబడడం లేదు, హజారే పేరు వినిపించడం లేదు …
దీన్ని బట్టి యేమర్థం అయింది ? అన్నా హజారే కోరుకున్న అవినీతి రహిత , అత్యాచార రహిత భారత దేశం ఏర్పడినట్టు …
అలానే తెలంగాణలో brs అధికారంలో ఉన్నప్పుడు పౌర సమాజం చురుగ్గా ఉండేది … ఎంత చురుగ్గా అంటే కాంగ్రెస్ వార్ రూమ్ లోనే రోజుల తరబడి, గంటల తరబడి, ఏళ్ళ తరబడి ఉండేంత … వార్ రూంలో రేవంత్ రెడ్డి అక్కా అక్కా అని పిలిచే వాడు, ఇప్పుడు గిరిజన బాధితులను కలవడానికి వెళితే అడ్డుకుంటారా అని సంధ్య గారే మీడియా ముందు వార్ రూమ్ సంగతి బయట పెట్టారు …
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది … ఇప్పుడు పౌర సమాజాన్ని పట్టించుకునే వాడు లేడు … పౌర సమాజం కూడా దేన్నీ పట్టించుకోవడం లేదు … (అసలు పౌరసమాజం అనేదే ఓ భ్రమ పదార్థం, బ్రహ్మపదార్థం…)
ఢిల్లీలో కాంగ్రెస్ ను దించి బీజేపీ అధికారంలోకి వచ్చేంత వరకు నిద్రపోని పౌర సమాజాన్ని బీజేపీ అనుకూల పౌర సమాజం అని ముద్ర వేద్దామా ?
తెలంగాణలో brs ను దించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకు నిద్ర పోని పౌర సమాజాన్ని కాంగ్రెస్ అనుకూల పౌర సమాజం అందామా ?
అర్థం కావడం లేదు కన్ఫ్యూజ్ గా ఉంది … నీ సంగతి నువ్వు చూసుకో …. అధికారపక్షం , ప్రతిపక్షం , మీడియా , పౌర సమాజం ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు … నీ ఇంటి అద్దె నువ్వే కట్టాలి … పౌర సమాజం కట్టదు … పార్టీలు కట్టవు …
ఒక సీఎం చట్టాలు రూపొందించే శాసనసభలో బట్టలూడదీసి కొడతాను అని తిట్ల దండకం చదవడం అంటే పౌర సమాజం కోరుకున్న పాలన వచ్చినట్టే కదా ?
ఇంతకీ పౌరసమాజం అనగానేమి..? ఇదే గ్రోక్‌ను గోకితే ఏం చెప్పిందంటే..?
పౌరసమాజం (Civil Society) అనేది ఒక సమాజంలో ప్రభుత్వం మరియు వ్యాపార సంస్థల నుండి స్వతంత్రంగా పనిచేసే సామాజిక సంస్థలు, సమూహాలు మరియు వ్యక్తుల సముదాయాన్ని సూచిస్తుంది. ఇది ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పడిన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు (NGOs), సామాజిక ఉద్యమాలు, మత సంస్థలు, వృత్తి సంఘాలు వంటి వాటిని కలిగి ఉంటుంది.
పౌరసమాజం యొక్క ప్రధాన లక్ష్యం సామాజిక న్యాయం, మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, విద్య, ఆరోగ్యం వంటి విషయాలలో ప్రజల గొంతుకను వినిపించడం మరియు ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపడం. ఇది ప్రజాస్వామ్య సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది ప్రభుత్వ అధికారాన్ని సమతుల్యం చేస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది…
Share this Article