.
ఇప్పుడు తెలుగు సోషల్ మీడియాలో సబ్జెక్టు గ్రోక్, సునీతా విలియమ్స్… ప్లస్ బెట్టింగ్ యాప్స్… గ్రోక్ అత్యంతాధునిక ఎఐ టెక్నాలజీ, సునీత స్పూర్తి… బెట్టింగ్ యాప్స్ దోపిడీ…
ఓ సాదాసీదా ఐపీఎస్ అధికారిలా గాకుండా… సొసైటీ కన్సర్న్ కనిపించే సజ్జనార్ కారణంగా ఈ యాప్స్ దుర్మార్గాలు, వీటిని ప్రమోట్ చేసే సెలబ్రిటీల బాగోతాలు బయటికొచ్చాయి… తన పని ఏదో తాను చేసుకున్నామా, పోయామా అని గాకుండా సొసైటీ పట్ల తన బాధ్యతను ఫీలయ్యే సజ్జనార్‌కు అభినందనలు…
Ads
పోలీసులు కేసులు పెడుతున్నారు… టూరిజం యూట్యూబ్ చానెల్ అన్వేష్ కృషి, చొరవను కూడా మెచ్చుకోవాలి… చాన్నాళ్లుగా ఈ యాప్స్ ప్రమోట్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాడు… సరే, విష్ణుప్రియ, సుప్రీత, టేస్టీ తేజ పరారీ… విచారణ స్థలానికి ఆర్జే శేఖర్ బాషా (బిగ్‌బాస్ ఫేమ్ ప్లస్ ఆమధ్య ఇంకేదో వివాదంలో ఇరుక్కున్నాడు) ఎందుకొచ్చాడో తెలియదు…
ఇవన్నీ వోకే.,. అసలు ఈ యాప్స్ బ్యాన్ చేస్తే బెటర్ కదానే సూచనకు ఓ మిత్రుడి జవాబు ‘‘అవి ప్లేస్టోర్‌లో దొరకవు, వాటిని ఎలా, ఎక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలో కూడా ఇన్‌ఫ్లుయెన్సర్లే చెబుతారు… సో, అబ్రకదబ్ర అనేసి బ్యాన్ పెట్టేసి, తీసిపారేయలేం…’’
నిజమే… కానీ ప్రభుత్వం ఒక్కసారి సీరియస్ డెసిషన్ తీసుకుని బ్యాన్ పెట్టేస్తే… ఏ ఎథికల్ హాకింగ్ వంటి ఏవో మార్గాల్లో ఆ యాప్స్‌ను కంట్రోల్ చేయవచ్చు… అఫ్‌కోర్స్, ఈ సెలబ్రిటీలు గాకపోతే ఆ బెట్టింగ్ యాప్స్ ప్రబుద్ధులు ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలకు డబ్బులు కట్టి మరీ స్పాన్సర్డ్ యాడ్స్ రన్ చేసి బెట్టింగ్ రాయుళ్లను వలలోకి లాగుతారు…
కేరళ లాటరీ యాప్ ఒకదానికి నాగార్జున బొమ్మ వాడేస్తున్నారు… తనకు తెలుసో తెలియదో… అసలే గ్రహచారం బాగాలేదు, జాగ్రత్త బాసూ..! గతంలో ఆన్‌లైన్ రమ్మీకి రానానాయుడు, తెల్లారిలేస్తే లక్ష నీతులు వల్లించే ప్రకాష్ రాజ్ కూడా ప్రచారం చేశారట…
ఇప్పుడు తాజాగా మంచు లక్ష్మి పేరు ప్రచారంలోకి వస్తోంది… ఆమె కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిందనే వీడియోల్ని పలువురు బయటికి వదులుతున్నారట… నిధి అగర్వాల్ కూడా… తవ్వుతూ పోతే ఇంకెన్ని మొహాలు బయటికొస్తాయో… ఇప్పుడు మంచు లక్ష్మి మీద కూడా కేసు పెడతారా అనేది ప్రశ్న…
మొత్తానికి మంచు కుటుంబంలో ఏదీ సజావుగా ఉండదా..? ఇప్పటికే కుటుంబసభ్యులు ఏవో వివాదాలతో ఘర్షణ పడుతూ, కేసులు పెట్టుకుంటూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు… ఇప్పుడు ఈమె కూడానా..?!
సరే, సొసైటీకి బెట్టింగ్ యాప్స్‌తోపాటు లాటరీలు, ఆన్‌లైన్ లోన్ యాప్స్, రమ్మీలు… ప్లస్ మద్యం, గుట్కా బ్రాండ్ల ప్రమోషన్స్… ఇవన్నీ నష్టదాయకాలే… ఇన్‌ఫ్లుయెన్సర్లుగా చెప్పబడే కొందరు ప్రబుద్ధుల వీడియోలపై, సెలబ్రిటీల ప్రచారాలపై నిఘా వ్యవస్థ అవసరం…
బాధ్యత ఫీలయ్యే సోషల్ మీడియా యాక్టివిస్టులు బయటపెడతారు, వెంటనే ఆయా సెలబ్రిటీలపై యాక్షన్ తీసుకునేందుకు అధికార యంత్రాంగం రెడీగా ఉందా..? అనేక కేసుల నడుమ వీటిపై కాన్సంట్రేట్ చేయగలదా..? పెద్ద సబ్జెక్టు..!!
Share this Article