Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈమె 9 నెలలే… ఆయన ఏకంగా 15 నెలలపాటు స్పేస్‌లోనే…!!

March 21, 2025 by M S R

.

సునీతా విలియమ్స్… క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది… అందరూ ఆనందించారు… ప్రత్యేకించి భారతీయలు అధికంగా… కొద్దిరోజులుగా ఇండియన్ మీడియా కూడా సునీత వార్తలతో హోరెత్తించింది…

ఇంకా పలు కోణాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి… 9 రోజులు అనుకున్నది కాస్తా 9 నెలలుగా చిక్కుపడిపోయింది… నడక మరిచిపోతుంది ఇక… కండరాలు క్షీణిస్తాయి… నెలల తరబడీ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి వంటి వార్తల దగ్గర నుంచి చివరకు ఆమెకు ఓవర్ టైమ్ జీతం ఎంత వస్తుందనే అంశాల దాకా…

Ads

ఆమెవి ఇండియన్ రూట్స్ కాబట్టి మనం ఇంతగా ఎమోషనల్‌గా కనెక్టయ్యాం… కానీ నిజానికి ఆమెకన్నా చాలా ఎక్కువ రోజులు స్పేసులో గడిపినవాళ్లున్నారు… ఆమెకన్నా వాళ్లకు నిజానికి ఇంకా ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా మరి… పైగా అంతరిక్షయానం ఎప్పుడూ రిస్కే… ప్రతి ఆస్ట్రోనాట్‌కు అది తెలిసిన విషయమే… మానసికంగా, ఆరోగ్యపరంగా ప్రిపేరయ్యాకే వెళ్తారు…

కల్పనా చావ్లా రాకెట్ ప్రమాదాల వంటివి దురదృష్టమే కానీ ఆ రిస్క్ ఎప్పుడూ ఉండేదే… చివరి క్షణాల్లో ఏవో సాంకేతిక సమస్యలు కనిపించి వాయిదా వేసిన ప్రయోగాలూ బోలెడు…

 

సునీత

రష్యన్ స్పేస్ ఏజెన్సీ రస్కోస్మాస్ ( Roscosmos ) కు చెందిన వలెరి పోల్యకోవ్ ఏకంగా 437 రోజులున్నాడు స్పేసులో… సునీత 286 రోజులే… అంటే వలెరి దాదాపు 15 నెలలు… ఈలెక్కన ఆమెకన్నా తను ఎన్నిసార్లు ఎక్కువ భూప్రదక్షిణలు చేసి ఉంటాడో అర్థం చేసుకోవాలి…

అదే స్పేస్ ఏజెన్సీకి చెందిన సర్జె అవదెయెవ్ 379 రోజులున్నాడు స్పేసులో… తరువాత ప్లేసు నాసా ఆస్ట్రోనాట్ ఫ్రాంక్ రుబియో… తను 371 రోజులు… వ్లాదిమిర్ తితొవ్, మూసా మనరొవ్ అనే రష్యన్ ఆస్ట్రోనాట్లు ఒకేసారి వెళ్లి సరిగ్గా సంవత్సరం ఉన్నారు, ఒకేసారి తిరిగి వచ్చారు… ఇదే నాసాకు చెందిన మార్క్ వందే 355 రోజులు…

నాసా ప్లస్ రస్కోస్మాస్ కలిసి స్కాట్ కెల్లీ, మిఖైల్ కోర్నియెంకోలను పంపిస్తే వాళ్లు కూడా 340 రోజుల తరువాత కలిసే వాపస్ వచ్చారు… నాసాకే చెందిన క్రిస్టినా 328, పెగ్గీ విట్సన్ 289 రోజులు… తరువాత ప్లేసు సునీత… మనం ఎంతసేపూ సునీత మీదే కాన్సంట్రేట్ చేశాం గానీ ఆమెతోపాటు అదే 9 రోజుల జర్నీ కోసం వెళ్లి బచ్ విల్మోర్ కూడా అక్కడే ఆమెతోపాటే 9 నెలలు చిక్కుబడ్డాడు కదా…

ఆండ్రూ మోర్గాన్ అనే నాసా ఆస్ట్రోనాట్ 272 రోజులున్నాడు… సో, సునీత మాత్రమే ఎక్కువకాలం స్పేసులో ఉండలేదు… అందరికీ ఒకేరకమైన ఆఫ్టర్ స్పేస్ జర్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, వస్తాయి… పైన జాబితా జాగ్రత్తగా గమనిస్తే ఇదే నాసాకు చెందిన వాళ్లే ఎక్కువగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్తున్నారు, వస్తున్నారు… 250 మైళ్ల దూరంలో ఉంటుంది ఈ కేంద్రం…

26 ఏళ్లుగా ఉంది ఆ కేంద్రం… మొన్న నలుగురు వచ్చారు… ఇంకా ఏడుగురున్నారు అక్కడే… సాహసం, తెగువ, స్పూర్తి వంటి పదాలు సునీత మాత్రమే కాదు, ఆ ఆస్ట్రోనాట్లందరూ అర్హులే…

15 ఏళ్ల కోసం అనుకున్న ఈ స్టేషన్ ఇంకా తన సేవలు అందిస్తూనే ఉంది… ఈసారే ఆస్ట్రోనాట్లను తిరిగి తీసుకురావడంలో నాసా ఫెయిలైంది… చివరకు ఎలన్ మస్క్ స్పేస్ కంపెనీ సాయంతో నలుగురిని తీసుకురాగలిగింది… అదీ సంగతి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions