Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేప్పొద్దున కేటీయార్, రేవంత్ చేతులు కలిపి బజార్లలో నినదిస్తారా..?!

March 22, 2025 by M S R

.

లోకసభ స్థానాల అశాస్త్రీయ, కుట్రపూరిత పునర్విభజన వ్యతిరేక మలి భేటీ హైదరాబాదులోనట… స్టాలినుడు చెప్పాడు… ఆ సమావేశంలో కూడా కేటీయార్, రేవంత్ పాల్గొని… మొహాలు మొహాలు చూసుకోకుండానే… ఒకరినొకరు తీవ్రంగా అసహ్యించకుంటూనే… ఉమ్మడిగా డౌన్ డౌన్ మోడీ అని నినదిస్తారు…

అడ్డదిడ్డపు డీలిమిటేషన్ కేవలం బీజేపీ కుట్ర అని దక్షిణాది రాష్ట్రాల్లో ఓ భావనను బలంగా వ్యాప్తి చేస్తున్నారు కదా… జాతీయ స్థాయిలో మా విధానం ఇదీ అని సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ ఎట్సెట్రా సోకాల్డ్ జాతీయ, అంతర్జాతీయ పార్టీలు ఏమీ ఇదమిత్థంగా ప్రకటించవు… నోళ్లు పెగలవు…

Ads

దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రాంతీయ, భారీ అవినీతి, కుటుంబ, వారసత్వ పార్టీలు భేటీలు వేస్తాయి సరే.., కానీ రేవంత్ రెడ్డి, పినరై విజయన్‌లు కూడా ఈ భేటీల్లో పాల్గొని… డీలిమిటేషన్ వ్యతిరేకించడం అంటే బీజేపీని వ్యతిరేకించడమే అనే భ్రమల్లో బతుకుతూ ఉంటారు…

హైదరాబాద్ భేటీలో ఇక పోరాటాన్ని ఉధృతం చేద్దామని, ఒకరోజు దక్షిణ బంద్ పాటించి, బజార్లలో నిరసన ప్రదర్శనలు చేద్దామని ఇదే స్టాలినుడు పిలుపునిస్తాడు వచ్చే భేటీలో… కేటీయార్, రేవంత్ సై అంటారు…

ఇవన్నీ దొంగల భేటీలు అని బండి సంజయుడు ఛీత్కరిస్తాడు… తను అంతకుమించి ఎదగలేడని చాలాసార్లు నిరూపించుకున్నాడు కదా… సరే, తెర వెనుక రాజకీయాలు వేరు, తెర మీద రాజకీయాలు వేరు కదా… కేటీయార్, రేవంత్ చేతులు కలిపి, పక్కపక్కనే నడుస్తూ హైదరాబాద్ నగర వీథుల్లో మోడీ డౌన్ డౌన్, అమిత్ షా ముర్దాబాద్ అని నినాదాలు చేస్తారు అనుకుంటున్నారా, నెవ్వర్, ఎవరి ఉద్యమం వాళ్లదే… యావత్ ముసుగు జర్నలిజంతోసహా మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం కూడా ఆనందబాష్పాలు రాలుస్తూ పండుగ చేసుకుంటుంది…

ఇంతకీ సోకాల్డ్ హార్డ్ కోర్ యాంటీ బీజేపీ నేతలు ఉత్తరప్రదేశ్ అఖిలేషుడు, బీహార్ తేజస్వి యాదవుడు ఎట్సెట్రా ఏమైనా స్పందించారా..? స్పందించరు, ఈ దక్షిణ అవసర కూటములకు సంఘీభావం ప్రకటిస్తారు..? టించరు… ఎందుకంటే సీట్లు పెరిగితే వాళ్లకూ ఆనందమే కదా… మరో నాలుగు ఎక్కువ సీట్లు రాకపోవు కదా…

సో, యాంటీ బీజేపీ అయినా సరే, ఇదంతా కేవలం సౌత్ ప్రతిపక్షానికి మాత్రమే పరిమితం అని మమత బెనర్జీలు, నవీన్ పట్నాయక్కులు అని అర్జెంటుగా నోళ్లు మూసుకుంటారు… రాహుల్ గాంధీకి అస్సలు నోరు పెగలదు… సొంతంగా ఏదీ చెప్పలేడు కదా, వీలైతే వియత్నాం వెళ్లొచ్చి స్పందిస్తా అంటాడేమో… ఇప్పుడు అక్కడే కదా అన్ని వ్యూహరచనలు… యాంటీ నేషనల్ యాక్టివిటీసూ…

అవునూ, మహారాష్ట్ర పార్టీలు ఎటువైపు అంటారా..? ఈ ఠాక్రేలు,  ఈ పవార్లు అటూ ఇటూ కాని బ్యాచులు… వాళ్లకూ ఏమనాలో తోచడం లేదు…

మా మోడీకి అన్నీ తెలుసు, అందరికీ న్యాయం చేస్తాడు అంటాడు అమిత్ షా ఎప్పటిలాగే…, ఆ న్యాయం ఎలా చేస్తాడో మాత్రం ఎవరూ వివరంగా చెప్పరు, మోడీ సహజంగానే ఎప్పటిలాగే ఏమీ మాట్లాడడు… ప్రొరేటా పెంపు అని ఏదో బ్రహ్మపదార్థం ముచ్చట చెబుతారు బీజేపీ నేతలు ఒకరిద్దరు… అదేమిటో ఎవడికీ అర్థం కాదు… అదెలా శాస్త్రబద్ధమో ఎవడికీ తెలియదు… వాళ్లకైనా తెలిస్తే కదా, చాలామంది నిర్మల సీతారామన్ టైపే కదా…

చివరగా… నిజానికి ఎంపీ సీట్ల పెంపు అనేది ఉత్త శుద్ధ అనవసర ప్రక్రియ… దాంతో దేశానికి, సమాజానికి, జనానికి ఒరిగేది పెద్ద గుండు సున్నా… ఇదుగో ఇలాంటి దిక్కుమాలిన పంచాయితీలు పెట్టి మోడీ డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తాడు… ఈ స్టాలిన్లు, ఈ పినరై విజయన్లు… చివరకు కేటీయార్, రేవంతులు కూడా ఆ ట్రాపులో పడిపోతారు… అదీ సంగతి… (తెర వెనుక మోడీతో ఎవరేమిటి అనేది నాకు తెలియదు, మీరూ అడగొద్దు ప్లీజ్)…

పంజాబ్ సీఎం వచ్చాడు, ఉత్సవ విగ్రహం… ఖలిస్థానీ కీలుబొమ్మ… డీకే శివకుమార్ వచ్చాడు… రేవంత్ రెడ్డి టైపే కదా… ఎటొచ్చీ బీజేపీ కూటమిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబులు, పవన్ కల్యాణులకు ఏ సోయీ ఉండదు… అంటే లోకసభ ఎంపీ సీట్లలో నష్టం జరిగినా పర్లేదా..? కిమ్మనరు… ది గ్రేట్ జగన్ బాబు గారు ఓ లేఖ రాసి, అటు మోడీకి కోపం రాకుండా, ఇటు ఎంపీ సీట్ల తగ్గింపును సమర్థించకుండా కప్పదాటు యవ్వారం… ఏం రాజకీయాల్రా బాబూ..?! సౌత్ జేయేసీ చిత్రమైన కలయిక..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions