.
తమ చర్యలు జనంలోకి ఎలా వెళ్తున్నాయనే స్పృహ రాజకీయ నాయకులకు ఎప్పుడూ ఉండాలి… సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో కాంగ్రెస నాయకులకు కొత్తగా వచ్చిన అధికారాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవుతున్నట్టు లేదు…
బీఆర్ఎస్ వంటి పార్టీని ఢీకొట్టి రాజకీయం చేయాలంటే ఓ పరిణతి, ఆచితూచి అడుగులు అవసరం… సిరిసిల్లలో ఓ టీ స్టాల్… కేటీయార్ ఫోటో ఉందనే కక్షతో మూసేయించారు… దీన్ని కేటీయార్ భలే అవకాశంగా వాడుకున్నాడు…
Ads
అన్ని అనుమతులు తీసుకుని, సిరిసిల్ల నడిబొడ్డున, తన సొంత ఖర్చుతో తన అభిమానికి అదేచోట టీస్టాల్ కొత్తది కట్టించి, తనే ఓపెన్ చేశాడు… అబ్బే, ఒక్క టీస్టాల్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమిటని తేలికగా తీసిపడేయకండి…
జనంలోకి బలంగా వెళ్తుంది… అదుగో కాంగ్రెసోళ్లు కక్షతో తొలగిస్తే కేటీయార్ ఆదుకున్నడు, సొంత ఖర్చుతోని మళ్లీ ఓపెన్ చేయించాడనే ప్రచారం మౌత్ టాక్‌గా జనంలోకి వెళ్తుంది… అది కాంగ్రెస్ పట్ల నెగెటివిటీని పెంచి, బీఆర్‌ఎస్ పట్ల పాజిటివిటీని పెంచుతుంది…
కాంగ్రెస్ వేధింపుల్ని ఎదుర్కుందాం, పోరాడదాం, నేనుంటాను తోడుగా అనే భరోసాను దీనివల్ల కేటీయార్ తన కేడర్‌లోకి పంప్ చేసినట్టయింది… ఈ వార్తలు ఎలాగూ ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశాలు అవుతాయి… ఈసారి టీస్టాల్‌లో కేటీయార్ ఫోటో కాదు, ఏకంగా కేటీయార్ ఫోటోలు, పేరుతోనే ఫ్లెక్సీ కట్టి ఓపెన్ చేయించారు…
ఉన్నతాధికారులను ఉసిగొల్పి బీఆర్ఎస్ కేడర్ మీద పడుతున్నారనే భావన ఇప్పటికే బాగా వ్యాపించింది… పలు ఉదాహరణల్ని చెబుతున్నారు అక్కడి జర్నలిస్టులు… ఏపీలో జగన్ ఇలాగే టీడీపీ కేడర్ మీద నానారకాలుగా వేధింపులకు దిగితే ఏం జరిగింది..? 11 సీట్లు… ఘోరమైన తిరస్కరణ జనం నుంచి… కక్ష రాజకీయాల్ని జనం మెచ్చరు అనడానికి ఉదాహరణ… తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు కొన్నిచోట్ల చేస్తున్న తప్పు కూడా అదే…
ఎస్, తేడా ఉంది… పనిగట్టుకుని, పెయిడ్ నెగిటివ్ క్యాంపెయిన్‌కు పాల్పడుతున్న ఫేక్ జర్నలిస్టులను అదుపు చేయడం ఎంత అవసరమో… మామూలు జనంపై ప్రతాపం చూపించకపోవడం కూడా అంతే అవసరం… నడుమ ఓ రేఖ ఉంటుంది… అది గుర్తించాలి… చిన్న చిన్న అంశాలుగా కనిపిస్తాయి, కానీ ఇంపాక్ట్ బలంగా ఉంటుంది…
అనాలోచితంగా ఓ మిల్క్ సెంటర్ మూసేస్తే… పాడి ఉత్పత్తిదారులు ఎంతగా ఆందోళనలకు పూనుకున్నారో కూడా చదువుకున్నాం కదా… అక్కడే ఆ సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో…! అసలే రైతాంగంలో రైతు భరోసా, రుణమాఫీ మీద వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మిల్క్ సెంటర్ల మూసివేతతో కాంగ్రెస్ ఏ సంకేతాల్ని పంపించింది జనంలోకి..?
ఈరోజుకూ కేసీయార్ పట్ల జనంలో పెద్దగా పాజిటివిటీ ఏం పెరగడం లేదు, పాత తప్పుల్ని జనం ఏమీ మరిచిపోవడం లేదు… అది తెలిసే దొరవారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైలెంటు..! ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దుందుడుకుగా వ్యవహరిస్తే వేగంగా కేసీయార్ పట్ల, ఆయన పార్టీ పట్ల సానుభూతిని కాంగ్రెసే స్వయంగా పెంచినట్టవుతుంది…! కనీసం ఇదైనా అర్థమవుతోందా..?!
Share this Article