.
అనవసరంగా హరీష్‌రావు పత్రిక ప్రకటన అంశాన్ని గోకాడు… నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీన్యూస్ లకు ఇదే హరీష్ రావు ప్రభుత్వం ఎంత అడ్డగోలుగా, ఎంత అక్రమంగా దోచిపెట్టిందో ఓ బండారాన్ని తనే బయటపెట్టించాడు…
ఎస్, 16 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 200 కోట్ల ప్రజాధనాన్ని తగలేసింది నిజమే… ఆ నిజాన్ని చెబుతూనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత ప్రభుత్వం తమ సొంత మీడియా సంస్థకు ఏరకంగా దోచిపెట్టిందో కూడా వివరాలు బయటపెట్టాడు…
Ads
హవ్వ, నమస్తే తెలంగాణకు యాడ్స్ ఆపేయడమా అని హరీష్ రావు బాధపడుతున్నాడు గానీ… అప్పట్లో ఆంధ్రజ్యోతికి తమరు కూడా యాడ్స్ ఎందుకు ఆపినట్టు..? నమస్తే తెలంగాణ మీ పార్టీ డప్పు… మీ కరపత్రం… యాడ్స్ ఆపేసినందుకు ప్రజాస్వామిక వాదులు ఎవరూ బాధపడటం లేదు గానీ…
గతంలో ఏం జరిగింది..? ఏవేవో భాషపత్రికలు, ఏవేవో రాష్ట్రాల పత్రికలకు కూడా కోట్లకుకోట్ల యాడ్స్ ఇచ్చారు… అప్పటికప్పుడు అర్జెంటుగా పీఆర్వోలు యాడ్ ఏజెన్సీ దుకాణాలు తెరిచి అడ్డగోలుగా కమీషన్లు ఆర్జించారు… ఎవరెంత టారిఫ్ చెబితే అంతే… సరే, నమస్తే తెలంగాణ సంగతే చూద్దాం…
2019లో ఆ పత్రికలో కాలమ్ సెంటీమీటర్‌కు 1500 టారిఫ్… నంబర్ వన్ ప్లేసులో ఉన్న ఈనాడుకు కూడా అదే టారిఫ్… అదెలా..? ఈనాడు కాపీలతో పోలిస్తే నమస్తే నాలుగు, అయిదో వంతు సర్క్యులేషన్ కూడా లేదు… పైగా బీఆర్ఎస్ నేతలకు టార్గెట్లు పెట్టి, కొనిపిస్తే, వాళ్ల ఇళ్లల్లో ఆ పార్శిళ్లను ముట్టని, విప్పని రోజులెన్నో… అదీ ఈనాడు సేమ్ అట…
టైమ్స్ ఆఫ్ ఇండియాకు 1000 రూపాయల టారిఫ్ (కాలమ్ సెంటీమీటర్) అయితే తెలంగాణ టుడేకు 2000 రూపాయలు… అసలు ఏమైనా న్యాయమా ఇది..? టైమ్స్ ఎక్కడ..? తెలంగాణ టుడే ఎక్కడ..? సేమ్, టీ న్యూస్‌కు సెకనుకు 3000 అట, టాప్ వన్, టు ప్లేసుల్లో ఉండే ఎన్టీవికి కూడా అదే రేటు అట…
ఈలెక్కన కేసీయార్ మైకులకు, కరపత్రాలకు అర్హతలను మించి అనుచితంగా, అక్రమంగా ప్రజాధనాన్ని దోచిపెట్టినట్టు కాదా..? ఈలెక్కన మరో పదేళ్లపాటు పైసా యాడ్ ఇవ్వకపోయినా పర్లేదు… అన్ని రెట్లు ఇచ్చారు ఆల్రెడీ…
ఆగండాగండి… ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ శుద్ధపూస కాదు… తరువాత వేరే ప్రభుత్వం వస్తే వీళ్లూ ఈ యాడ్స్ విషయంలో ఇరుక్కుంటారు… అసలు ఈ-పేపర్ల రీచ్ ఎవరు లెక్కించాలి..? శాస్త్రీయ ప్రాతిపదిక ఏది..? ప్రభుత్వ ప్రకటనల పాలసీలో ఈ-పేపర్లు ఉన్నాయా అసలు..? వాటికి లైసెన్సింగ్ విధానం అంటూ ఉందా..? మరెలా యాడ్స్ ఇస్తున్నట్టు..? ఇక్కడ ఆప్ట్ అవునో కాదో తెలియదు గానీ… కోడలికి బుద్ది చెప్పి అత్త తెడ్డు నాకిందని ఓ సామెత..!!
చెప్పలేదంటనకపొయ్యేరూ… ఏపీలో జరిగిందీ ఇదే కదా… సాక్షి పత్రిక, సాక్షి టీవీకి వందల కోట్లు దోచిపెట్టలేదా జగన్..? అంతేనా..? ప్రభుత్వం తరఫునే తమకు నచ్చిన సైట్లకు, డిజిటల్ మీడియాకు కూడా కోట్లకుకోట్లు పంచిపెట్టారు…
అదొక అరాచకం… అక్కడా ఆంధ్రజ్యోతికి యాడ్స్ ఇవ్వలేదు కదా… ఈనాడు కూడా కొన్నాళ్లకు మాకు ఈ యాడ్స్ వద్దని వదిలేసింది కదా… ఇప్పుడు సాక్షికి కూటమి సర్కారు యాడ్స్ ఆపేసింది కదా… సో, తెలంగాణ, ఏపీ… కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్… అందరూ సేమ్ సేమ్…
Share this Article