.
మలయాళంలో ఈ ఏడాది 59 సినిమాలు తీశారు… 130 కోట్ల కలెక్షన్లు మాత్రమే… అంటే సగటున 2 కోట్ల చిల్లర… అంతకుముందు ఏడాది కూడా అంతే…
నిజానికి మలయాళం రేంజ్ చిన్నదే… చిన్న బడ్జెట్లతోనే ప్రయోగాలు చేస్తారు… కానీ కొన్నాళ్లుగా మోహన్‌లాల్ భారీ సినిమాల్లో చేస్తున్నాడు… పాన్ ఇండియా అంటున్నాడు… లూసిఫర్ తరువాత దాని సీక్వెల్‌గా తీసిన ఎల్, ఎంపురన్ ఖర్చు దాదాపు 150 కోట్లట…
Ads
లూసిఫర్‌ను ఇతర భాషల్లో రీమేకుల కోసం అమ్ముకున్నారు, కాస్త ఖర్చు పెడితే డబ్ చేసి, మనమే పాన్ ఇండియా రిలీజ్ చేయొచ్చు కదానే భావనతో… ఈ దెబ్బకు శాటిలైట్ టీవీ, ఓటీటీ, ఆడియో రైట్స్ డబ్బులు బాగా వస్తాయని కదాని ఆలోచించినట్టున్నారు నిర్మాతలు… ఈమేరకు బజ్ కూడా బాగానే క్రియేటైంది…
ఇది సూపర్ హిట్టయితే మాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంటుంది… అందరి ఆశా అదే… ఆమధ్య నటుల పారితోషికాలు, నిర్మాణ వ్యయాలపై మలయాళ నిర్మాతలు ఠారెత్తిపోతూ కొన్నాళ్లు ఇండస్ట్రీ బంద్‌కు కూడా పిలుపునిచ్చింది… అవునింతకూ ఈ ఎంపురన్ ఎలా ఉంది..?
ఎంపురన్ అంటే దేవుడికి తక్కువ, చక్రవర్తికి ఎక్కువ అట… మరి తెలుగులో ఎవడికి అర్థం కావాలి ఆ టైటిల్..? సరే, ఆ లూసిఫర్‌తో పోలిస్తే ఈ ఎంపురన్ కాస్త డ్రామా, థ్రిల్ తక్కువే… మరీ ఎక్కువ అంచనాలతో థియేటర్‌కు వెళ్లొద్దు… డైలాగులు, తెలుగీకరణ నాసిరకం… మితిమీరిన హింస… దానికి ఇంటర్నేషనల్ లెవల్ యాక్షన్స్ అని పేరు…
దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఎక్కువగా మోహన్‌లాల్ పాపులారిటీని ఇమేజీని క్యాష్ చేసుకునేలా… ఎంతసేపూ ప్రతి సీన్‌లోనూ, ప్రతి పాత్రకూ ఎలివేషన్స్… మోహన్‌లాల్ ఎంట్రీ కూడా అంతే… తను రావడమే సినిమా ప్రారంభమయ్యాక గంట సేపటికి… మాస్ పోకడ… కథ సో సో, కేరళ రాజకీయాలు… తెలుగు ప్రేక్షకుడికి పెద్దగా ఎక్కవు …
కాకపోతే మోహన్‌లాల్, మంజు వారియర్, టొవినో థామస్ తదితరుల నటన సినిమాకు ప్రాణం… ఒకటీరెండు చోట్ల దర్శకుడు కూడా ఓ పాత్రలో కనిపిస్తాడు… అభిమన్యు సింగ్ అందరికన్నా ఇంకాస్త బెటర్‌గా చేశాడు… ఎస్, నిర్మాణ విలువలు ఓ రేంజులో ఉంటాయి, హాలీవుడ్ రేంజు అక్కడక్కడా… కాకపోతే బీజీఎం పూర్… సినిమాటోగ్రఫీ, విజువల్స్ గుడ్…
ఎడిటింగు పూర్, దాదాపు 3 గంటల నిడివి సినిమా… సో, లూసిఫర్‌తో పోల్చుకోకూడదు, నిరాశపడతారు… మూడో భాగం కూడా ఉంటుందని హింట్ ఉంది… పెద్దగా భావోద్వేగాలు గట్రా ఏమీ ఆశించొద్దు… ఇప్పుడు ట్రెండ్ ఏమిటి..?
అతి… ఎక్స్‌ట్రీమ్… యాక్షన్ అయినా, కామెడీ అయినా ఏదైనా ఎక్స్‌ట్రీమ్‌గా ఉండాలి… కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్ ఇలా ఏది తీసుకున్నా అంతే… చివరకు సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ కూడా ఎక్స్‌ట్రీమ్, అంటే అతి… అదుగో ఆ భావజాలంతోనే ఎంపురన్ నడుస్తుంది… ఓవర్ ఎలివేషన్స్, ఓవర్ యాక్షన్ ఎట్సెట్రా…
కాకపోతే సగటు మలయాళ సినిమాతో పోలిస్తే భిన్నమైన అతి భారీతనం… అక్కడక్కడా మోహన్‌లాల్ ఫ్యాన్స్ విజిల్స్ వేయగల ఎలివేషన్స్ గట్రా సినిమాను నిలబెడతాయి… తెలుగు ప్రేక్షకుడికి ఎక్కుతుందా..? స్థూలంగా ఏమిటీ అంటే..? పర్లేదు…!!
Share this Article