.
ఎస్పీ చరణ్… తండ్రి బాలసుబ్రహ్మణ్యం తన ఫీల్డులో గ్రాండ్ సక్సెస్ కేరక్టర్… శాస్త్రీయ సంగీతమే నేర్చుకోకపోయినా అనేక భాషల్లో వేల పాటల్ని పాడటం అనేది కలగనాల్సిన కెరీర్… డబ్బింగ్, యాక్టింగ్, కంపోజింగ్, కచేరీలు, టీవీ షోలు, గానం… వాట్ నాట్..?
తన వారసుడే అయినా… బహుముఖ ప్రయత్నాలు చేస్తున్నా చరణ్ మాత్రం ఎప్పుడూ ఓ గ్రాండ్ సక్సెస్ కొట్టలేక మిగిలిపోతున్నాడు… నిర్మాత, దర్శకుడు, నటుడు, గాయకుడు, టీవీ హోస్టింగ్… ఎన్నెన్నో… తనకు గానంకన్నా నటనే ఇష్టం…
Ads
అందుకే తన పాటలు తక్కువే… అడపాదడపా నటుడిగా కనిపిస్తుంటాడు… లైఫ్ అనే సినిమా వచ్చింది… లవ్ యువర్ ఫాదర్… అందులో ఓ తండ్రిగా సటిల్డ్‌గా నటించాడు… ఈ సినిమాకు సంబంధించి తన పాత్ర, తన అప్పియరెన్సే ముఖ్యం…
తోడుగా మణిశర్మ మ్యూజిక్, కథకు కాస్త మైథలాజికల్, అఘోరాలు, కాశిల టచ్ గట్రా అద్దడంతో సినిమా మీద కాస్త ఆసక్తి పెరిగింది… నిజానికి సినిమాకు సంబంధించిన వార్తలు పెద్దగా కనిపించలేదు మొదట్లో… మల్లారెడ్డి ‘కసి కపూర్ అట, కసికసిగా ఉంది’ అని సినిమా ఫంక్షన్‌లో తన హోదా, తన వయస్సుకు తగినట్టుగా చేసిన అత్యంత సంస్కారభరిత వ్యాఖ్యలతో సినిమా కాస్త వార్తల్లోకి వచ్చింది…
సినిమా విషయానికి వస్తే… అనాథలకు అంతిమ సంస్కారాలు నిర్వహించే పాత్ర చరణ్‌ది… ఉదాత్తమైన పాత్ర… కొడుకు సిద్ధార్థ్ (శ్రీహర్ష)… తనకు ఓ లవర్ (కషిక కపూర్)… హాయిగా గడిచిపోతున్న జీవితాల్లోకి ఓ గ్యాంబ్లింగ్ మాఫియా లీడర్ ఎంటరవుతాడు, తప్పుడు కేసులు పెట్టిస్తాడు… వాటిని ఎదుర్కుని రివెంజ్ ఎలా తీర్చుకున్నారు తండ్రీకొడుకులు అనేదే కథ…
ఓవరాల్‌గా చూస్తే సినిమా చూడబులే… కాకపోతే కామెడీ పండలేదు… చరణ్, మణిశర్మ బేసిక్‌గా సినిమా సంగీతం బాపతే అయినా… పాటలు పెద్దగా రక్తికట్టలేదు… ఫస్టాఫ్ పెద్దగా కథ మీద ఆసక్తిని క్రియేట్ చేయలేకపోయినా సెకండాఫ్‌లో దర్శకుడు కథను ఎటు తీసుకెళ్తున్నాడు అనే ఆసక్తిని కలిగించాడు… క్లైమాక్స్ వరకూ అలాగే కథ నడిపించాడు…
హీరోయిన్ గురించి చెప్పడానికి పెద్దగా ఏమీలేదు గానీ హీరోగా శ్రీహర్ష కూడా జస్ట్ వోకే… ఇంకొన్ని మంచి పాత్రలు పడితే చాలు రాణిస్తాడు… లోబడ్జెట్ మూవీయే ఐనా సరే, ఎస్పీ చరణ్, మణిశర్మ, శామ్ కే నాయుడు (సినిమాటోగ్రాఫీ) కలిసి కాస్త భారీతనాన్ని అద్దారు..!!
Share this Article