.
హీరో సిద్ధార్థ్ సంగతి ఎలా ఉన్నా సరే… ఈ సినిమాలో హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ నయనతార ఉంది… పైగా మాధవన్ కూడా… ఆ ముగ్గురు చాలు, సినిమా కమర్షియల్ బిజినెస్ వాల్యూ పెంచడానికి…
కానీ థియేటర్లలోకి గాకుండా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది నేరుగా… (తమిళ డబ్బింగ్)… అదేమిటో మరి…! సరిగ్గా మార్కెటింగ్ చేసుకోకపోవడమా, మరే ఇతర కారణాలున్నాయా అనేది వదిలేస్తే… ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్‌ను ఆసక్తికరంగా ప్రజెంట్ చేయలేదు అనిపించింది దర్శకుడు… క్రైమ్, స్పోర్ట్స్ డ్రామా ఉన్న కథ, ఆ ముగ్గురు సీనియర్ నటులు దొరికినప్పుడు మెరుగైన, స్పీడ్ టీ20 ఆట ఆడుకోవాలి కదా…
Ads
సినిమా టైటిలే టెస్ట్… అంటే క్రికెట్‌లోని టెస్ట్ మ్యాచ్… ప్లస్ పరీక్ష అని కూడా…! నీళ్ల నుంచి పెట్రోల్ (ఫ్యుయల్) తయారు చేయాలనే పరిశోధనల్లో మునిగే మాధవన్… (అప్పట్లో రామర్ పిళ్లై అనేవాడు నీళ్ల నుంచి పెట్రోల్ తయారు చేసినట్టు ఫేక్ ప్రచారాలు చేసుకున్న సంగతి తెలుసు కదా… ఇందులో కూడా ఆ పాయింట్ గాకుండా ఇంకేదైనా కొత్త పరిశోధనాంశాన్ని పెట్టి ఉండాల్సింది…)
నయనతార ఓ టీచర్… పిల్లల్లేకపోవడంతో సరోగసీ ప్రయత్నాలు ఏవో చేస్తుంటారు మాధవన్, ఆమె… సిద్ధార్థ్ ఏమో క్రికెటర్… ఫామ్‌లో లేడు… జట్టులో స్థానం నిలుపుకోవడం కోసం నానా పాట్లూ… చెన్నైలో ఇండియా- పాకిస్థాన్ నడుమ ఓ టెస్ట్ మ్యాచ్… సరిగ్గా ఆ సమయంలో ఓ బెట్టింగ్ మాఫియా వీళ్ల జీవితాల్లోకి ఎంటర్ అవుతుంది…
నిజానికి ఓ క్రికెటర్ పాత్ర, ఆట చుట్టూ కాస్త కథ తిరుగుతూ ఉంటుంది… కాబట్టి సరిగ్గా తీయగలిగితే కథ, సినిమా రక్తికట్టేవి… కానీ ఆ మూడు పాత్రల ఎమోషన్స్ నడుమే కథ తిప్పుతూ పోయాడు దర్శకుడు… అవేమో పెద్దగా వర్కవుట్ కాలేదు… వీక్ సీన్లు… పైగా ఇది టీ20 ట్రెండ్… అయిదు రోజుల టెస్టు మ్యాచులకు ఇక కాలం చెల్లినట్టే… చెన్నైలో పాక్- ఇండియా మ్యాచ్ అనేది కూడా ఇక కల్లే… ఇవన్నీ ప్రేక్షకుడిని కనెక్ట్ కాకుండా అడ్డుపడుతుంటాయి…
సినిమా కూడా ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లాగే సా- గు- తూ ఉన్నట్టు కనిపిస్తుంది… సిద్ధార్థ్ పాత్ర కేరక్టరైజేషన్ కూడా బాగోలేదు… తనలో తప్పుల్ని ఎత్తిచూపుతున్నాడని తన కోచ్‌ను దూరం పెడతాడు… (తను హీరోయిన్ తండ్రి)… చిన్నప్పటి నుంచీ తెలిసిన హీరోయిన్‌ను పట్టించుకోడు… కోల్పోయిన ఫామ్ తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలూ పెద్దగా కనిపించవు…
మరిక ఆ పాత్ర ప్రేక్షకులకు ఎలా కనెక్టవుతుంది..? పైగా ఎమోషన్స్ బలంగా పలికించాల్సిన సీన్లలో సిద్ధార్థ్ తేలిపోయినట్టు అనిపించింది… (సినిమాలో పాత్రలాగే తన ఫామ్ ఎప్పుడో కోల్పోయాడు తను)… ఈ సినిమాలో బలం మాధవన్ నటన… నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తను అనుభవాన్ని కనబరిచాడు… నయనతార పెద్దగా ఈ సినిమాకు యూజయ్యేంత ఏమీ లేదు… సెకండాఫ్‌లో కొంతమేరకు వోకే… మీరా జాస్మిన్ ఉందంటే ఉంది… సంగీతం సోసో… టైటిల్ క్రికెట్ టెస్ట్ మ్యాచే అయినా… సినిమా వీక్షణం మాత్రం ఓ టెస్టే..!!
Share this Article