.
ఏమైనా శ్రీరామనవమి స్పెషల్ ఉంటుందేమో అని భ్రమపడి చానెళ్లు చూస్తే ఎక్కడా ఏమీ కనిపించలేదు పాపం… ఆదివారం కదా, ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తోంది… (ఈ వారం దాదాపు ప్రతి టీవీ షోలోనూ ప్రదీస్, దీపిక పిల్లిలు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ప్రమోషన్లలో కనిపిస్తున్నారు… ప్రదీప్ స్పాంటేనిటీ, జోకులు బాగానే ఉంటాయి గానీ… మరీ ఇన్ని షోలలోనా ప్రమోషన్లు…?)
సరే, మొదట్లో కాస్త బాగానే ఉండేది ఈ షో… అన్ని రియాలిటీ షోల్లాగే దీన్నీ ఈటీవీ క్రియేటివ్ టీమ్ భ్రష్టుపట్టించేసింది… మొదట్లో కాస్త హ్యూమన్ యాంగిల్ స్కిట్స్ ప్లాన్ చేసేవాళ్లు, చూడాలనిపించేది… కానీ ఇప్పుడు సగటు తెలుగు సోది సెలబ్రిటీల గేమ్స్, పిచ్చి టాస్క్‌షోలలాగే మార్చిపారేశారు…
Ads
ప్రతి షోలోనూ హీరో ఆ హైపర్ ఆదే కదా… సరే, ఈరోజు షోలో లేడు, వోకే అనుకుంటే… ఏవేవో పిచ్చి సామెతల పక్కన ఫోటోల్ని పెట్టండి అనే ఓ తిక్క టాస్క్, అందులో టీఆర్పీ రేటింగుల కోసం ప్రోమోల కోసం ఫేక్ ప్రాంక్ నటనలు, కోపాలు, అలకలు…
అవన్నీ ఎలా ఉన్నా… శివాజీ మీద ఓ డాన్స్ పర్‌ఫామెన్స్ చూపించారు, ఎవరో ఆదర్శ్ అట… ఏమాటకామాట, ఇప్పుడు ట్రెండ్ శివాజీ కాదు, శివాజీ కొడుకు శంభాజీ… అవును, ఛావా సినిమా తరువాత శంభాజీ జాతీయ హీరో అయిపోయాడు… తన మీద ఓ స్కిట్ పర్‌ఫామ్ చేస్తే సందర్భయుతంగా ఉండేది…
సరే, శివాజీకి, శ్రీరామనవమికీ లింక్ లేదు గానీ… ఏదో రొటీన్ ప్లానింగులో భాగంగా ఇదీ ఆలోచించి ఉంటారు… కానీ ఏమాత్రం రక్తికట్టలేదు సరికదా విసిగించింది… మెయిన్ లీడ్‌లో ఆ గాంభీర్యం, రాజసం కనిపించలేదు… పైగా నువ్వు పక్కన ఉండగా నన్నెవరూ ఓడించలేరు అనే బాహుబలి బాపతు డైలాగ్… అలాంటిదే ఏదో ఓ బ్యాక్ గ్రౌండ్ పాట…
ఈమాత్రం కొత్తదనం రాహిత్యానికి అందరూ చప్పట్లు, హోరు, ప్రశంసలు… ఇంద్రజ మామూలుగానే ఆహా ఓహో నుంచి దిగదు కదా… ఇప్పుడూ అదే… ఆయనెవరో ఆమె పక్కనే కూర్చుని, ఈ దెబ్బకు నీకు నా నెక్స్ట్ సినిమాలో చాన్స్ ఇస్తున్నాను పో అన్నాడు…
షోకు తమన్నాను తీసుకొచ్చారు గానీ ఆమెతో మంచి పార్టిసిపేషన్ ప్లాన్ చేసి, షోను పైకి లేపడంలో ఫెయిలయ్యారు… కానీ ఏమాటకామాట… వచ్చే వారం షోకు సంబంధించి ప్రోమో వేశారు కదా చివరలో… అందులో ఒక్కటి నచ్చింది… శ్రీ శృతి, కీర్తనల పాటలు… ఇద్దరూ ఇద్దరే… వాళ్ల కోసం వచ్చే ఆదివారం ఆ షో చూడొచ్చు అనుకుంటా…
శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాళవిక కనిపించింది… ఎన్నాళ్లైందో కదా ఆమె తెర మీద కనిపించి..!! Of course ఆర్పీ పట్నాయక్ కూడా…
Share this Article