.
లోపల పేజీలో… జిల్లా పేజీలో… జోన్ పేజీలో కాస్త వోకే అనుకోవచ్చు… కానీ ఫస్ట్ పేజీ మేకప్, హెడింగులు, ప్రయారిటీలు ఆ పత్రిక టేస్టును, నైపుణ్యాన్ని పట్టిస్తాయి… తప్పులు దొర్లితే జనం నవ్వుకుంటారు…
పాఠకులు పిచ్చోళ్లు కాదు, అజ్ఙానులూ కాదు… కాకపోతే తిట్టాలన్నా, విమర్శించాలన్నా చాన్స్ లేదు కాబట్టి సైలెంటుగా ఉంటారు… ఉదాహరణకు ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఓ ఫస్ట్ పేజీ హెడింగు…
Ads
‘‘ఆధునిక రామసేతు’’ ఆ శీర్షిక పేరు… దాని కంటెంటు ఏమిటంటే… కొత్తగా కట్టిన పాంబన్ రైలు బ్రిడ్జికి మోడీ ప్రారంభం చేయబోతున్నాడనేది… మరి ఏమిటీ తప్పు అంటారా..?
శ్రీరామనవమి కదా… సేతు అంటే బ్రిడ్జి కదా… ఆధునిక రామసేతు అని రాసేశాడు సబ్ ఎడిటర్… ఈమధ్య అసలు ఆంధ్రజ్యోతి పత్రికను ఎవరూ పెద్దగా చూసుకుంటున్నవాళ్లు లేరు కదా… రాధాకృష్ణ కూడా టీవీనే ప్రేమిస్తూ పత్రికను వదిలేసినట్టున్నాడు… మరీ ఫస్ట్ పేజీ అనాథ అయిపోయింది ఫాఫం…
ఓ సీనియర్ జర్నలిస్టుగా ఓ ప్రధాన పత్రికలో ఫస్ట్ పేజీలు పెట్టీ పెట్టీ పండిపోయిన పెద్దాయన అడిగాడు… నీకు అందులో తప్పేమీ కనిపించలేదా అని… వెలగడం లేదు సార్ అన్నాను… తనే చెప్పాడు…
‘‘అసలు రామసేతు అనేది ఇండియా నుంచి శ్రీలంక దాకా ఉండేది… ఐనా రామాయణ కాలంలోని రామసేతు ప్రారంభమయ్యేది ధనుష్కోడి నుంచి… అది రామేశ్వరం నుంచి 18 కిలోమీటర్లు… పంబన్ నుంచి 30 కిలోమీటర్లు… బ్రిడ్జి అనగానే రామసేతు అని రాసేయడమేనా…’’
ఏదో లెండి సార్, కవి హృదయం అన్నాను… నిజమే తను చెప్పింది… అది రామసేతు ఎలా అవుతుంది..? అక్కడ ఓడలు వెళ్లడానికి వీలుగా పైకి తెరుచుకునే పాంబన్ బ్రిడ్జి ఒకటి ఆల్రెడీ ఉంది పాతది… ఇప్పుడు వర్టికల్ సీ లిఫ్ట్ బ్రిడ్జి కొత్తగా కట్టారు… ఓ రోడ్డు కూడా ఉందిప్పుడు…
పైగా ఇంజినీరింగ్ అద్భుతం కూడా ఏమీ కాదు… ఆకాశంలోకి తెరుచుకునే వంతెన ఆ పక్కనే కనిపిస్తుంది కదా… అది కట్టినప్పుడు దాన్ని అద్భుతం అనాలి, ఆనాటి సాంకేతిక ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని బట్టి… ఇప్పుడు అంత అద్భుతమేమీ కాదు కూడా…
సో, ఇది మోడీ సేతు తప్ప రామసేతు కాదు… రాధాకృష్ణ గారూ గమనించగలరు… అన్నట్టు డెక్కుల్లోనే రాశారు కదా ఇది మండపం నుంచి రామేశ్వరం వరకు అని..!!
Share this Article