.
ఆమె… వయస్సు 19 ఏళ్లు… జస్ట్, ఒకే ఒక రియాక్షన్… దాన్ని పట్టుకున్నాడు ఓ ఫోటోగ్రాఫర్… దేశమంతా చూసింది… కోట్ల మంది… దాంతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది… నో, నో, ఆమె పేరు మోనాలిసా కాదు, త్రివేణి సంగమం దగ్గర పూసలమ్ముకున్న ఆ ఓవర్ నైట్ సెలబ్రిటీ కానే కాదు…
హఠాత్తుగా సోషల్ మీడియాలో లేదా మీడియాలో కొందరు తళుక్కుమంటారు… ఒక్క లక్కీ క్షణం… వాళ్లను అందలం ఎక్కిస్తుంది… ఎనలేని పాపులారిటీని తెచ్చిపెడుతుంది… కొందరినేమో పాతాళానికి పడేస్తుంది… కుమారి ఆంటీ సోషల్ మీడియాతో లక్కీ ఫెలో… అలేఖ్య సిస్టర్స్ అదే సోషల్ మీడియాతో అన్ లక్కీ ఫెలోస్…
Ads
మోనాలిసా కథా అంతే కదా… ఇప్పుడు చెప్పుకునే అమ్మాయి పేరు ఆర్య ప్రియ భుయాన్… అస్సోంలోని గౌహతి స్వస్థలం… చెన్నె సూపర్ కింగ్స్ అభిమాని… ఇంతకీ ఏం జరిగిందంటే..?
చెన్నై- రాజస్థాన్ ఐపీఎల్ మ్యాచ్… చెన్నై మాజీ కెప్టెన్ ధోనీ కొట్టిన షాట్ ను లాంగాన్‌లో ఫీల్డర్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు… చెన్నై గెలుపునకు కీలకమైన సమయంలో ధోనీ ఔట్ కావడంతో స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ఉసూరుమన్నారు… కొన్నాళ్లుగా ధోనీ ఆటతీరు పెద్దగా ఎవరికీ నచ్చడం లేదు కూడా…
ధోనీ ఔట్ కాగానే… చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని అయిన ఆ యువతి తీవ్రంగా నిరాశపడింది … ‘అరె, ఏంట్రా ఇది’ తరహాలో ఫోజిచ్చింది… ‘‘అబ్బా.. చేతి దగ్గర ఉంటేనా? ఆ ఫీల్డర్ ను కొట్టేస్తా, పిసికేస్తా’’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ మేరకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది…
ఆ అమ్మాయి రియాక్షన్ బాపతు వీడియో బిట్… ఎక్స్ లింక్…
ఆమెకు ఇన్‌స్టా ఖాతా ఉంది… 800 వరకూ ఫాలోయర్స్… ఎప్పుడైతే ఆమె రియాక్షన్‌ను సోషల్ మీడియా వైరల్ చేసిందో ఆమెకు ఫాలోయర్స్ వరదలా వచ్చిపడ్డారు… ఏకంగా 3 లక్షలకు చేరుకుంది… అనూహ్యం కదా… అంతేెకాదండోయ్… ఆమెకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి ఓ ప్రాజెక్టు వచ్చి పడింది… బ్రాండ్ ప్రమోషన్ ప్యాకేజీ…
అది కుదిరిందో లేదో ఎస్ మేడమ్ అనే మరో పెద్ద బ్రాండ్ ముందుకొచ్చింది… ఆ రెండు ఒప్పందాలనూ ఆమె తన ఫాలోయర్స్‌తో షేర్ చేసుకుంది కూడా… ధోనీ ఔటయితే అయ్యాడు గానీ ఈమెకు భలే కెరీర్ బిల్డప్ చేసి ఇచ్చాడుపో అనే కామెంట్లతో ఆమె వీడియోల కామెంట్ బాక్స్ బద్దలయిపోయింది..!! నిజం… రాసిపెట్టిన అదృష్టం తన్నుకొస్తుంటే ఏదీ ఆపలేదు… ఏదో క్షణం కట్టలు తెంచుకుని వచ్చి అది ఒడిలో పడిపోతుంది..!!
Share this Article