.
ఒక వీడియో కనిపించింది… రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇచ్చే స్కీమ్ కొత్తగా మొదలుపెట్టారు కదా… భద్రాచలంలోని రాములోరి కల్యాణానికి వెళ్లిన సర్కారు పెద్దలందరూ సమీపంలోని ఓ ఇంటికి వెళ్లి, ఆ సన్నబియ్యంతో వండిన అన్నం తిని, ఆ పథకానికి మంచి ప్రచారం కల్పించుకున్నారు…
(నిన్న ఎక్కడో ఓ ఇంటికి వెళ్లిన చంద్రబాబు తనే కాఫీ కలిపి, ఇంటివాళ్లకు ఇచ్చాడనే వార్త, ఫోటో చూశాం కదా… ఆ డ్రామాకన్నా ఇది చాలా చాలా నయం, కృతకంగా గాకుండా సహజంగా ఉంది…)
Ads
ఆ పథకం గురించి కాదు ఇక్కడ… ఆ వీడియో చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, భట్టి ఇతర ముఖ్యులు నేల మీద కూర్చున్నారు… సకులంముకులం పెట్టుకుని, అంటే బాసింపట్టు… ఆ ఇంటి వాళ్లు ప్లేట్లలో అన్నం, కూరలు వడ్డించారు…
దాదాపు సగం మంది ప్లేట్లను పైకి ఛాతీ వరకు లేపుకుని, కూర కలుపుకుని తినడం కనిపించింది… భోజనం అయ్యేంతవరకూ… చివరలో పెరుగు కలుపుకుని జుర్రుకునేవరకూ… (అక్కడ ఎవరూ నాలుగు మెతుకులు గతికి లేవలేదు, ప్లేట్లలో వదిలేయలేదు, పద్ధతిగా అందరూ చివరి మెతుకు వరకూ తిన్నారు…) ఛాతీ వరకూ ప్లేటు లేపి తినడం ఓ కంఫర్ట్ లెవల్… లేకపోతే ప్రతి ముద్దకూ వంగి ప్లేటు నుంచి తీసుకోవడం కష్టం… అసహజం కాదు, సహజమే… ఈ రీల్ చూడండి ఓసారి…
https://www.facebook.com/reel/672564051832988
డైనింగ్ టేబుల్స్ మీద తినడం అలవాటయ్యాక మనకు… చాలామందికి నేల మీద కూర్చుని తినడం అసౌకర్యంగా ఉంటుంది… రోజూ తినేవాళ్లకు సరే, అది అలవాటు…
నిజానికి గతంలో ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే దాదాపు పది అంగుళాల వరకూ ఎత్తుంటే పీటలు వేసి, విస్తట్లో వడ్డించేవారు… అది మర్యాద… అతిథికి మనం చూపించే గౌరవంగా భావించేవారు… ఇప్పుడూ అలాంటి పీటల్ని ఇళ్లల్లో నోములకు, పూజలకు వాడుతున్నారు… అది వేరే సంగతి…
ఇప్పుడు ఆ పీటల మీద కూర్చుని తినడం మరీ అసౌకర్యం అయిపోతోంది… అందుకని చాలామంది టీవీ చూస్తూనో లేదా ట్రెడిషనల్ అనో నేల మీద కూర్చుని తింటున్నారు… దీనికోసం కంఫర్ట్‌గా ఉండటం కోసం దాదాపు ఓ ఫీట్ ఎత్తుతో ప్లాస్టిక్ లేదా స్టీల్ మెటీరియల్‌తోనో చేసిన పీటల్ని వాడుతున్నారు…
ఎస్, చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ ల్యాప్‌టాపుల్ని ఇలాంటి స్మాల్ హైట్ టేబుల్స్ (ఫోల్డెడ్, హైట్ అడ్జస్టబుల్ కూడా దొరుకుతున్నాయి) మీద పెట్టుకుని, నేల మీద కూర్చుని పని చేసుకుంటున్నారు… కాకపోతే వీపుకి దన్ను అవసరం… నిజానికి ఏ బెడ్ మీదో, సోఫా మీదో అడ్డదిడ్డంగా కూర్చుని, ల్యాప్‌టాప్‌తో కుస్తీపట్లు పడుతూ వర్క్ చేయడంకన్నా ఇలాంటి స్మాల్ హైట్ టేబుల్స్ చాలా నయం…
అన్నట్టు… నిన్న సర్కారు ముఖ్యులకు సన్న రేషన్ బియ్యంతో భోజనం పెట్టిన ఆ ఇంటివాళ్లు ఏ ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టలేదు, ఎంచక్కా స్టీల్ ప్లేట్లలో పెట్టారు… ఏ అరిటాకులోనో, విస్తరిలోనో, మార్కెట్‌లో దొరికే ప్లాస్టిక్ ప్లేట్లలోనో అన్నం పెట్టి ఉంటే… ఛాతీ ఎత్తుకు లేపడం, కంఫర్ట్‌గా తినడం కుదరక అవస్థలు పడేవాళ్లు..!!
Share this Article