.
మనిషి సృష్టించిన వాటిల్లో మనిషినే ఆడిస్తున్నవి కొన్ని… డబ్బు, దేవుడు, మతం… అరె, దేనికైనా డబ్బు ఉండాలిరా భయ్… కొండ మీద కోతులైనా దిగొస్తాయి… డాక్టరేట్లు కూడా అలా నడుచుకుంటూ వచ్చి మెడలో పడతయ్… ఓ తెలుగు నటుడు హిజ్ ఎక్సలెన్సీ అని రాసుకుంటాడు తెలుసా..?
మరో అగ్రనటుడు లండన్ వెళ్లి దండలు కప్పించుకుంటాడు ఎలాగో తెలుసా..? అంతెందుకు, దేవుళ్లు కూడా కొండలు దిగి ఆహ్వానం పలుకుతారు కరెన్సీతో ఆస్థానపాలకులను కొడితే… నరనరాన డబ్బు చేసిన జబ్బు అది… ఎవడో ఒకడు రెడీగా ఉంటాడు దండలు పట్టుకుని… శాలువాలు పట్టుకుని…
Ads
తాజాగా ఓ ప్రకటన కనిపించింది… హవ్వ, డాక్టరేట్ ఇంత తేలికా..? డబ్బుంటే చేతిలో పనా..? అనిపించింది…
ఇదీ ఆ నోటిఫికేషన్…
“We are pleased to announce that honorary doctorates will be conferred at the upcoming convocation ceremony in Ooty, India, which will be held both live and offline. Interested candidates are invited to submit their self-nominations and may
contact us
At : +91 7-4-87–78
on WhatsApp for further details.”
భారతదేశంలోని ఊటీలో జరగనున్న స్నాతకోత్సవ వేడుకలో గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము, ఇది ప్రత్యక్షంగా మరియు ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ స్వీయ-నామినేషన్‌లను సమర్పించడానికి ఆహ్వానించబడ్డారు మరియు మరిన్ని వివరాల కోసం +91 7-4-87–78 నంబర్‌లో వాట్సాప్‌లో మమ్మల్ని సంప్రదించవచ్చు….
అబ్బే, ఎలా నమ్ముతాం అంటారా..? అరె, వాళ్లు వచ్చే మే నలెలో ప్రపంచ శాంతి సదస్సు నిర్వహించబోతున్నారు… ఎక్కడో తెలుసా..? లండన్‌లో కాదు, పార్లమెంటు భవనంలో అసలే కాదు… ఊటీలో… ఇదుగో చదవండి…

wpc
బుసాన్ క్రిస్టియన్ యూనివర్శటీ ఫర్ ఫారిన్ స్టడీస్ అట… అది ఉందా లేదా మీకెందుకు బ్రదర్, మీకు కావల్సింది ఓ డాక్టరేట్, ఓ కాగితం… అంతే కదా… పేరుకు ముందు డాక్టర్ అనే పదం…
ఏయ్, ఎవడ్రా అదీ… ప్రపంచ శాంతి సదస్సుకూ డాక్టరేట్లకూ లింక్ ఏమిటని అడిగేది… సినిమా ప్రమోషన్లలో దిక్కుమాలిన డొల్ల ప్రశ్నలు అడిగే మొహమూ నువ్వూనూ…
హబ్బా… డాక్టరేట్లే కాదండీ, రకరకాల అవార్డులు కూడా ఉన్నాయి… మమ్మల్ని సంప్రదించండి చెబుతాం…. పోనీ, వీటిలో మీకు ఏదీ నచ్చలేదా..? ఏదో మీరే సజెస్ట్ చేయండి, అదే ఇస్తాం… తొక్కలో అవార్డులదేముంది..? పైగా మేం ముందు స్నాతకోత్సవం ఏర్పాటు చేశాకే డాక్టరేట్లు, అవార్డులకు సెల్ఫ్ ప్రపోజల్స్ ఆహ్వానిస్తున్నాం, మా పారదర్శకత అర్థం కాకపోతే ఎలా..?
అరె, బాబూ… మీ గొప్పతనాన్ని మీరు ముందుగా మీరే పొగుడుకుంటూ ఓ కాగితం మా మొహాన పారేయండి… డాక్టరేటో, మీరు కోరిన అవార్డో మీ మొహాన మేం కొడతాం… వర్తమాన క్షుద్ర, తుచ్ఛ మీడియాదేముంది..? కవర్లు పారేస్తే సరి… పాదాల మీద పాకుతూ మరీ రాస్తాయి… సరేనా..? రేయ్, ఎవడ్రా అది, బాగా రాస్తే మాకూ ఓ డాక్టరేట్ పడేస్తారా అని అడిగేది…!!
Share this Article