.
నేను దీన్ని Rajani Mucherla వాల్ మీద చదివాను… పది మందికీ షేర్ చేయాలనిపించింది… ఇక చదవండి… భిన్నాభిప్రాయాలున్నవాళ్లు మనసులోనే దాచుకొండి…
… పెళ్ళిళ్లలో వింత పోకడలు…
1. కేవలం ముఖ పరిచయం ఉన్న అందరిని వేల సంఖ్యలో పిలవడం (పిలిచిన వారికి ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు. Attend అయిన వారికి 6 నెలల తరువాత అసలు సదరు పెళ్లికి వెళ్ళమని కూడా గుర్తుండదు)
Ads
2. ప్రొద్దున పెళ్లి అయితే, స్నానం కూడా చెయ్యని, చెమట కంపుతో, అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తులు, అర్థ రాత్రి వంట చేసి, దానికి విందు అని పేరు పెట్టి, ప్రొద్దున వడ్డించడం… రాత్రి పెళ్లి అయితే సీన్ రివర్స్ అంతే.
3. ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళి అంత ఆర్భాటం చేయడం. (కాబోయే వధూవరులను,పెళ్లి కాకుండానే, ఒక చోట కూర్చోపెట్టి, ఆహ్వానితులకు అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమనడం.)
4. పెళ్లి కాకుండానే pre wed photo shoot అని సినిమా లెవెల్లో వింత, సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు photos కి ఫోజులు… ఇంకా ఆ photos (కొన్ని intimate వి) కూడా. పెళ్లి తంతులో భాగంగా పెద్ద TV screen పైన అదంతా ప్రదర్శించడం.
5. పనికిమాలిన మంగళ స్నానం పేరున అమ్మాయిని నడి బజారులో కూర్చోబెట్టి అందరి ముందు తల స్నానం చేయించడం ఏమిటి నీతిమాలిన సంస్కృతి. ఈమధ్య చిన్నపిల్లలను సైతం వధూవరులుగా అలంకరించి నడి బజార్లో మంగళ స్నానాలు చేయించడం, స్టేజీల పైన కూర్చోబెట్టి ఆర్భాటాలు చేసి వారికి చిన్నప్పటి నుండే పెద్దరికం కట్టబెట్టడం చూస్తుంటే ఇది ఒక వింత ఆచారంగా భావించాల్సి వస్తుంది. దేశంలో ఎక్కడాలేని ఈ వింత సంస్కృతి ఈమధ్య మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నది. దీన్ని రాబోవు తరాలు తగ్గించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
6.పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డెకరేషన్‌ను 10 గంటల్లో (ఆలోపే), ఇంకో ఫంక్షన్ ఉంటే పీకి పారేయడం.
7. Photos Natural (candid) గా, తీయకుండా photographer కోసమే పెళ్లి చేసుకున్నట్టు, వాడు చెప్పిన వింత భంగిమల్లో ఫోజులు పెడుతుంటే ఆ ఫోటోల పరమార్ధం లేకుండా పోయింది. (photographer bill కూడా లక్షల రూపాయలు)
8.పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి, జీవితంలో మళ్ళీ ఇంకో function కి వాడకుండా, డబ్బు వృధా చేయడం.
9. భోజనాల పేరుతో, సమయంతో నిమిత్తం లేకుండా, అల్పాహారం, chat, 20 రకాల స్వీట్స్, 50 రకాల వంటకాలు, 10 రకాల fruits, 5 రకాల డిసెర్ట్స్ (ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు, ఆహుతులు, అన్ని తినే ప్రయత్నం చేయడం ఒక వింత. భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు)
10. పెళ్లి తంతు తరువాత కిలోమీటర్ క్యూలో నిలబడి, స్టేజి ఎక్కి, మొక్కుబడిగా అక్షింతలు, వధూవరుల నెత్తిన చల్లి, వాటిని బూట్లు తొడుకున్న కాళ్లతో తొక్కి, photos కి pose ఇవ్వడం. (ఆ photos జీవితంలో ఎవరికి చూసే తీరిక కూడా ఉండదు), అనే ప్రక్రియ కూడా ఆక్షేపణీయం.
11. పెళ్లి జరిపించే పంతుళ్ళు మాటలను, శ్లోకాలను పట్టించుకోకుండా, కెమెరామన్లు, వీడియో గ్రాఫర్ల భంగిమల కోసం జరుగుతున్న తంతు ఒక చిత్రాతి విచిత్రం.
12. DJ MUSIC అనే పేరుతో, చెవులు, మెదడు భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో, అర్థం పర్థం లేని సినిమా పాటలు.
13. కర్ణ కఠోరంగా పాడే orchestra బృందం (వీళ్లు కూడా భయంకరమైన సౌండ్ లెవెల్స్ maintain చేస్తారు).
14. ఇంకా mehendi అని ,సంగీత్ అని, bachelor పార్టీ అని , పనికిమాలిన events. డబ్బు బలుపు ప్రదర్శనలు.
15. మద్యంతో కూడిన విందైతే, హాజరు 110% (బంధు మిత్ర సపరివారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్ గా పాటిస్తారు).
16. ఒక పెగ్గు కెపాసిటీ వాడు 3 పెగ్గులు, 3 పెగ్గుల కెపాసిటీ వాడు 10 పెగ్గులు లాగించేస్తారు.
17. తదనంతరం పెళ్ళికొడుకు ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్ పూజ పవిత్రత మంట కలుపుతూ, మాంసాహార వంటలతో, మళ్ళీ పెళ్లి నాటి ప్రహసనం repeat.
18. ఇంకా హనీమూన్ అనే కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్స్ (ఇది కూడా లక్షల్లో).
19. ఇక గిఫ్ట్స్ పేరుతో వచ్చే పనికిమాలిన వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు.
20.అందుకని పగ తీర్చుకొనేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు, పచ్చడి సీసాలు వగైరా ఇవ్వడం.
పైన చెప్పినవన్నీ మధ్యతరగతి వారు, తాహతుకి మించి, ఈ మధ్య విపరీతంగా పాటిస్తూ, అప్పుల పాలవుతున్నారు.
ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ, ఎదుటివారి ఆడంబరాలను చూసి మేము సైతం అని అప్పులు చేసి బంధువర్గాలకు మొక్కుబడిగా ఫోన్చేసి మేము పిలిచాము అని చాటింపు చేసుకొని, ఇతర ముఖ్యమైన పనుల వల్ల ఫంక్షన్ కి వెళ్ళని వారితో కక్షలు పెంచుకోవడం ఎక్కడి సంస్కృతి..?
అందుకే నిరాడంబర పెళ్లిళ్లను ప్రోత్సహిద్దాం… తక్కువ మంది, ఎక్కువ పలకరింపులు, ఎక్కువ మర్యాదలు, ఎక్కువ జ్ఞాపకాల కలబోతలు… పేరుపేరునా పిలిచి ఆలింగనం చేసుకుని, ఆ పెళ్లిని ఓ జ్ఞాపకంగా మలుద్దాం… అన్నట్టు ఈ ప్రభుత్వాలకు బుద్ధి లేకగానీ… ఏ పెళ్లయినా సరే ఇంత ఖర్చు దాటకూడదని ఎందుకు చట్టం తీసుకురావు..? ముందు ఆ అంబానీకి ఏదైనా శిక్ష విధిస్తే బాగుండు ఏ కోర్టయినా..!!
Share this Article