.
సుడిగాలి సుధీర్ తప్పు చేశాడు… హిందూ దేవుళ్లను అవమానించాడు… ఒరేయ్, హిందూ ఆచార వ్యవహారాలతోపాటు చివరకు ఆధ్యాత్మిక అంశాలనూ మీ వెకిలి వెక్కిరింపులతో కించపరుస్తారా..?
…. ఇలా పోస్టులు కొన్ని కనిపిస్తున్నాయి,.. హిందూ సంఘాలు మండిపడుతున్నాయి… ఆ వార్తలు కూడా కనిపిస్తున్నాయి… అసలేమిటి ఈ వివాదం..?
Ads
రంభ… ఆమధ్య అప్పుడెప్పుడో పాపులర్ హీరోయిన్… పెద్ద హీరోల సరసన కూడా చేసింది… పెళ్లి చేసుకుని కనుమరుగైంది… చాలామంది తారలు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ మళ్లీ నానా ప్రయత్నాలూ చేసుకుంటూ తెర మీదకు వస్తున్నారు కదా… నటిగా పెద్ద పేరేమీ లేదు గానీ కమర్షియల్ తారగా వోకే అప్పట్లో…
ఆమెకూ మనసైంది… నాకు ఇంట్రస్టు ఉంది అని చెప్పడానికి కొన్ని టీవీషోలలో దర్శనమిస్తోంది… జేడీ చక్రవర్తితో కలిసి గెస్టుగా వస్తే ఆ టీవీ షోలో బొంబాయి ప్రియుడు స్పూఫ్స్ చేసి టీవీ కమెడియన్లు ఎనలేని ఇంపార్టెన్స్ ఇస్తూ, ఆ ఇద్దరి పల్లకీ మోశారు…
ఇంకేదో స్కిట్ (జీతెలుగు వాడి సూపర్ సీరియల్ చాంపియన్‌షిప్ షో కావచ్చు) లో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ ప్లస్ రంభ… అక్కడ ఓ నందీశ్వరుడి విగ్రహం… దాని కొమ్ముల నుంచి సుధీర్ చూస్తుంటే రంభ కనిపిస్తుంది… ఇదీ సీన్…
నందీశ్వరుడి కొమ్ముల నుంచి శివుడి దర్శనం చేసుకోవడం శివభక్తులకు ఆనవాయితీ, ఓ పద్ధతి… శివుడికి ఏమైనా చెప్పుకోవాలన్నా, మొరపెట్టుకోవాలన్నా నందీశ్వరుడి చెవుల్లో చెప్పడం కూడా అంతే… అలాంటిది నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి ఓ ఫేడవుట్ వెటరన్ స్టార్ మొహం చూపించి ఆ పద్ధతిని వెటకారం చేశారనేది ఇప్పుడు వివాదం…
టీవీలు, సినిమాలు హిందూ దేవుళ్ల పట్ల, విశ్వాసాల పట్ల పెద్ద పెద్ద తప్పులే చేస్తుంటాయి… వాటితో పోలిస్తే ఇదెంత ఆఫ్టరాల్ అంటారా..? కావచ్చు… కానీ సుడిగాలి సుధీర్ ఇలాంటివి అంగీకరించకుండా ఉండాల్సింది… ఎవడో స్క్రిప్ట్ రాశాడు, అది తప్పని తెలియదు, అందుకే అలా యాక్ట్ చేశాను అని సమర్థించుకుంటే కుదరదు… తెరపై కనిపించేవాడి మీదే రాళ్లు పడతాయి…
సుధీర్‌కు తెలుగు టీవీ వీక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది… మల్టీ టాలెంటెడ్… కమిటెడ్… తన మీద పడే పంచులను సైతం ఆస్వాదిస్తాడు… ఈ గుణం ఏ ఇతర టీవీ కమెడియన్లలో లేదు… అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి… (కనీసం ఆ స్కిట్‌కు ఓ కామెడీ స్పూఫ్ కూడా సరిగ్గా రాయడం, చేయించడం చేతకాలేదు ఆ టీవీ టీమ్‌కు…)
నిజానికి ఈ స్కిట్ అప్పట్లో రంభ, చిరంజీవి నటించిన బావగారూ బాగున్నారా అనే సినిమాలోని ఓ పాపులర్ సీన్‌కు పేరడీ లేదా స్పూఫ్… రంభ టీవీ షోలలోకి వస్తే ఆమె నటించిన పాత సీనిమాల్లోని సీన్లు, పాటలకు పెద్దపీట వేసి, ఆమె అడుగులకు మడుగులు వత్తాలా…? దరిద్రపు ధోరణి… ఆ యాంకర్ రవి అయితే మరీ అతి… మొన్నామధ్య రమ్యకృష్ణతో అంతే, ఇప్పుడు రంభతో అంతే… కాళ్ల మీద పడిపోయినట్టుగానే…
సరే, ఈ సీన్ విషయానికి వస్తే ఇప్పుడు సుడిగాలి సుధీర్ చేసింది తప్పయితే, అప్పుడు చిరంజీవి చేసిందీ తప్పే… కానీ ఆ సినిమా సీన్‌లో కథ ప్రకారం… హీరోయిన్ అక్కను పెళ్లి చేసుకున్నట్టు నటిస్తూ వాళ్ల ఊరికి వస్తాడు హీరో… హఠాత్తుగా బావను చూద్దామని వచ్చిన హీరోయిన్ అలా నందీశ్వరుడి కొమ్ముల నడుమ నుంచి కనిపించి హీరో షాక్ తింటాడు… ఆ అక్కకు ఈ హీరోయిన్ చెల్లెలని తెలియదు… అందుకే అమ్మవారిలా కనిపిస్తుంది అంటాడు…
అప్పట్లో సోషల్ మీడియా లేదు కదా… పైగా చిరంజీవి… సో, అప్పుడలా నడిచిపోయింది… ఇప్పుడు అదే సుడిగాలి సుధీర్ చేశాడు, కానీ సోషల్ మీడియా ఉంది కదా… అది ఊరుకోదు కదా… ఎప్పుడూ ఏదో ఒకటి కావాలి కదా… పైగా మత మనోభావాలకు సంబంధించిన అంశం… సో, ఇక మొదలెట్టేసింది… అవును, జాగ్రత్తగా ఉండాల్సింది సెలబ్రిటీలే… కొన్నిసార్లు వివాదాలు ముదిరి కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయి… అన్నట్టు అప్పట్లో చిరంజీవి నటించిన ఆ సీన్ ఇదుగో…
Share this Article