.
అసలు ఏపీ పాలిటిక్స్ అంటేనే రోత, జుగుప్స, వెగటు… పెంటకుప్ప రాజకీయాలు… ప్రత్యేకించి ఆడవాళ్ల మీద నీచమైన డర్టీ కామెంట్స్ చేసే ఓ మానసిక సామూహిక ఉన్మాదం కనిపిస్తోంది…
ఎవడి సోషల్ మీడియా మీద ఎవడికీ కంట్రోల్ లేదు… తాజాగా ఎవరో చేబ్రోలు కిరణ్ అట… జగన్ భార్య భారతి మీద డర్టీ కామెంట్స్ చేస్తే… అదేదో పాయింట్ బ్లాంక్ టీవీ అట.,. యథాతథంగా ప్రసారానికి పెట్టాడు… వీళ్లు జర్నలిస్టులు..? ఇవీ చానెళ్లు..?
Ads
రీసెంటుగా రేవతి మార్క్ జర్నలిజం చూశాం కదా తెలంగాణ రాజకీయాల్లో… వాళ్లే తిట్టించడం, ఇదుగో ఇలా తిడుతున్నారు అని ప్రసారం చేసేయడం… డర్టీజర్నలిజం అనే పదాన్ని మించి మరొకటి కనిపెట్టాలి… ఏపీ పాలిటిక్స్ విషయానికొస్తే…
గతంలో నారా భువనేశ్వరి మీద ఇలాగే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు… సాక్షాత్తూ చంద్రబాబే కన్నీళ్లు పెట్టుకున్నాడు… (తనను అలా చూడటం అదే మొదటిసారి)… పెయిన్ ఉంటుంది, సహజం… కానీ ఇప్పుడు తన కార్యకర్త కూడా అలాంటి ఉన్మాదాన్నే ప్రదర్శిస్తున్నాడు… చంద్రబాబు రియాక్షన్ ఏమిటో వేచి చూడాలి…
వినడానికే ఏవగింపుగా ఉంది కాబట్టి ఆ వీడియో గానీ, ఆ టెక్స్ట్ గానీ ఇక్కడ పెట్టడం లేదు… మన దరిద్రం ఏమిటంటే…? దీన్ని కూడా జర్నలిజం అని ముద్రవేసి నెత్తిన మోస్తున్నారు ఢిల్లీలోని ప్రముఖ పాత్రికేయులు (?) చివరకు ఎడిటర్స్ గిల్డ్ కూడా… గిల్ట్ అని మార్చుకుంటే బెటర్ అనిపించేలా..?
ఎస్… ఈ రకమైన బజారు రాజకీయం… అంటే వీథి పంపుల దగ్గర బూతులు వీటికన్నా నయం… వైసీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, జనసేన ఎవరు ఈ ధోరణిని ఎంకరేజ్ చేసినా, ఉపేక్షించినా అది మరీ హీనమైన పోకడ…
భువనేశ్వరి, బ్రాహ్మణి, భారతి మాత్రమే కాదు… రోజా, సాదినేని యామిని, మాధవీలత, కవిత దాకా… అంతెందుకు సోనియా, ప్రియాంకల దాకా… అందరూ బాధితులే… ఈ ట్రోలింగ్, బురద జల్లడం పెరిగీ పెరిగీ చివరకు వ్యక్తిత్వ హననాల దాకా, పిల్లల పుట్టుకలపై నిందలు మోపేదాకా పోయింది… ఎంత అసహ్యపు రాజకీయాలు మనల్ని శాసిస్తున్నాయి..? మనల్ని పాలిస్తున్నాయి..?
( థాంక్ గాడ్… మహిళలపై చెడు వ్యాఖ్యలు రాసినా, షేర్ చేసినా సరే… వాళ్లను బ్లాక్ చేస్తూ పోయాను ఆమధ్య… వైసీపీ, టీడీపీ, జనసేన, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరైనా సరే… దాదాపు 300- 400 మంది… ఇప్పుడు వాళ్ల కూతలు, రాతలు నాకు కనిపించవు… )
ఎస్, అప్పట్లో భువనేశ్వరి ఎంత బాధపడిందో, ఇప్పుడు భారతికీ అదే బాధ… ఏ నాయకురాలైనా సరే, చివరకు పార్టీలతో, రాజకీయాలకు సంబంధం లేనివాళ్లను కూడా లాగుతున్నారు… అసలు ఈ బురద వ్యాఖ్యలు చేసేవాళ్లే కాదు, వాటిని అప్‌లోడ్ చేసేవాళ్లు అంతకన్నా ప్రమాదకారులు…
(వైసీపీ ఏమైనా శుద్ధపూసా… ఇంతకన్నా ఘోరంగా వ్యవహరించింది వాళ్ల సోషల్ మీడియా అనే సమర్థనలు కనిపించవచ్చుగాక… కానీ ఇలాంటి బురద, డర్టీ రాజకీయాలు ఎవడు చేసినా తప్పే… ఎంకరేజ్ చేసేవాడు మరీ నేరస్థుడు…)
నెవ్వర్, ఇంత దారుణంగా మహిళల్ని టార్గెట్ చేసే రాజకీయాలు మరే రాష్ట్రంలోనూ కనిపించవు… అవునూ, వీటినీ భావప్రకటన స్వేచ్ఛలో భాగంగా చూడాలా..? ఆ స్వేచ్ఛ మరీ ఇంత విశృంఖలంగా, విచ్చలవిడిగా, వికృతంగా ఉంటుందా..? (డర్టీ యూట్యూబ్ చానెళ్ల నియంత్రణ మీద ఆమధ్య రేవంత్ రెడ్డి పరుష వ్యాఖ్యలు చేశాడు, తరువాత ఫాలోఅప్ యాక్షన్ లేదు… ఎందుకో గానీ…)
Update :: భారతి కాళ్ళ మీద పడి క్షమాపణ చెబుతానని ఆ డర్టీ ఫెలో మరో వీడియో రిలీజ్ చేశాడట… మరి ఆ మెగాసేసే జర్నలిస్టు సంగతి..!? ఈ కార్యకర్త వరకూ కేసులు నమోదు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశించిందట… గుంటూరు పోలీసులు కేసు పెట్టారట… గుడ్… ఆ స్పిరిట్ కంటిన్యూ చేయండి… మీ ప్లేసులో జగన్ ఉంటే కనీసం స్పందించకపోయేవాడు… అది రియాలిటీ…
Share this Article