.
నిజంగానే రేవంత్ రెడ్డిలో ఏదో తేడా ఉంది… ఖచ్చితంగా… ఐతే అది తన మీద అసహ్యంతో మరీ కేసీయారే గొప్పోడు అనేంత దరిద్రంగా ఏమీ లేదు… చాలా దరిద్రాలకు కేసీయార్ ఆద్యుడు కాబట్టి,… తెలంగాణ తెచ్చాడనే భావనను మించి, దాటి తెలంగాణ సమాజం తనను థూత్కరించింది కాబట్టి…
సరే, రేవంత్ రెడ్డి విషయానికి వస్తే… తనేం మాట్లాడతాడో తనకే తెలియదు… కానీ తన భాష, తన బూతులు, తన భావదరిద్రాన్ని జనం మెచ్చి తనను గెలిపించారనే భ్రమల్లో ఉన్నాడు పాపం… తన గెలుపుకు కారణం కూడా కేసీయారేననీ, తనను జనం ఛీత్కరించి, వేరే ఆల్టర్నేట్ దిక్కులేక తనకు… సారీ, కాంగ్రెస్‌కు వోటేశారనే వాస్తవాన్ని మరిచిపోతున్నాడు… ఎవడైనా సమర్థుడైన బీజేపీవాడు ఉండి ఉంటే కథ వేరే ఉండేది…
Ads
తను ఓ వ్యతిరేక వోటుతో గెలుపొందాడు… అంతే తప్ప తన ఈ మూసీ మురికి భాషను ప్రేమించి, తన రాజకీయ ధోరణులను అభిమానించి ఎవడూ తనను ఆలింగనం చేసుకోలేదు… అది మరిచి, తను ముఖ్యమంత్రిని అని మరిచి, తన చేష్టలు, తన మాటలు అన్నీ ఓ టైపు వింత ధోరణిలో సాగుతున్నాయి…
(నిన్న తన మాటలతో ఉన్న ఓ రీల్ చూడబడ్డాను, అది మరీ నీచంగా ఉంది… సీఎం మీద జాలిపడటం తప్ప తెలంగాణ సమాజం ఏమీ చేయలేదు ఫాఫం… తెలంగాణ ఎప్పుడూ ఓ శాపగ్రస్తే కదా… పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు…)
ఆమధ్య దావోస్ వెళ్లినప్పుడు, ఇండియాటుడే కాంక్లేవ్‌లో మాట్లాడినప్పుడు… ఇతరత్రా సందర్భాల్లో తన వ్యాఖ్యలు నవ్వులపాలయ్యాయి… ఐనా తను మారడు, ఎందుకంటే, తన మాటను, తన భాషను, తన బూతుల్ని, తన చేష్టల్ని జనం మెచ్చుకుంటున్నారనే డొల్ల ఊహల్లో కొనసాగుతున్నాడు కాబట్టి… తాజాగా ఏమంటాడంటే..?
‘‘బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వను, బ్రిటిషోళ్లకన్నా బీజేపీ డేంజర్… గాంధీ మీద వాళ్లు లాఠీ విసరలేదు ఎప్పుడూ, కానీ స్వరాజ్యం రాగానే గాంధీని చంపేశారు వీళ్లు… వాళ్లను దేశం నుంచి తరిమేద్దాం… బీజేపీని రానివ్వకూడదని ఆదేశాన్ని తీసుకుపోతున్నాను,,,’’ ఇవీ తన వ్యాఖ్యలు…
ఇంకా ఇంకా పాత మానుకోట జిల్లాలో రాజకీయం చేస్తున్నాను అనుకుంటే కుదదు బాస్… నువ్వు యావత్ తెలంగాణ సమాజానికి ప్రస్తుతం ముఖ్యమంత్రివి… తరువాత భట్టియా, పొంగులేటియా మీ హైకమాండ్ చెబుతుంది… పార్టీకి నీ కంట్రిబ్యూషన్ చెబుతుంది… అసలు నువ్వే ఆ పార్టీలో రాంగ్ ప్లేసింగు…
ఏమంటివి, ఏమంటివి..? బీజేపీని అడుగుపెట్టనివ్వవా..? నువ్వు అధికారంలోకి వచ్చాకే నీతో సమానంగా ఎంపీ సీట్లు గెలిచింది బీజేపీ, మొన్నటికిమొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోల్తా కొడితివి… హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థిని కూడా పెట్టలేని దారిద్ర్యం…
ఐనా దేశం నుంచి తరిమేయడం ఏమిటి..? బీజేపీ వాళ్లు విదేశీయులు కాదు, పక్కా స్వదేశీ బ్యాచు… బయటికి పంపించడానికి… అసలు తమరి రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది ఏ పార్టీ వింగులో..? ఏబీవీపీ, టీఆర్ఎస్, టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్… ఇంకేం మిగిలి ఉంది..? పైగా పార్టీ ఆదేశమట… అక్కడ రాహుల్ గాంధీకే దిక్కూదివాణం లేదు…
జనం ఇవే చూస్తారు..? ఫాఫం, కేసీయార్ వ్యతిరేకగణం… పోయిపోయి తనను వ్యతిరేకించి… అంటే ఏదో పడేసి ఇంకేదో ఎత్తుకున్నట్టు… స్టేటులో బీజేపీకి ఓ దిక్కూదివాణం సరిగ్గా లేకగానీ, లేకపోతే ఇప్పటికే చుక్కలు చూపించేవాళ్లు… లక్కీ కేసీయార్… లక్కీ రేవంత్..!!
అన్నట్టూ… స్వరాజ్యం రాకముందు జనసంఘ్ ఉంది… గాంధీ హత్య జరిగినప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్… అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి నెత్తిన మోస్తున్న ఆ నెహ్రూయే ప్రధాని…!! రేవంత్ ఏమీ చదవడు, తెలియదు… ఎవరు చెప్పినా వినడు.,. ప్రతిదీ చంద్రబాబు చెప్పాలా ఏమిటి..?!
Share this Article