.
విడాముయార్చి… అదేనా ఆ సినిమా పేరు..? అజిత్ సినిమా… తీవ్రంగా నిరాశపరిచింది… అదే త్రిషతో జతకట్టి ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ పేరుతో మార్కెట్లలోకి వచ్చాడు… ఇప్పుడూ త్రిషతో తన కెమిస్ట్రీ పండకపోయినా సరే, యాక్షన్ సీన్లలో అజిత్ రెచ్చిపోయాడు…
అజిత్ అంటే యాక్షన్ కదా… పైగా పాత పరాజయం నుంచి బయటపడాలంటే ఫక్తు ఫ్యాన్స్‌ను అలరించే సినిమా తీయాలని అనుకున్నట్టున్నాడు… పక్కా కమర్షియల్ బాట… లాజిక్కులు మన్నూమశానం జాన్తా నై… తన పాత సినిమాల్ని కూడా గుర్తు చేస్తూ, పక్కా ఎలివేషన్ల సినిమా… ఇది ఫ్యాన్స్ సినిమా…
Ads
ఎస్… నాట్ వెరీ గుడ్… నాట్ బ్యాడ్ ఆల్సో… అఫ్‌కోర్స్ అజిత్ సినిమా కదా, అగ్లీ అసలే కాదు… ఓ ఎంటర్‌టెయినర్‌గా మలిచారు సినిమాను… యాక్షన్ ప్లస్ కొంత కామెడీ… సినిమా మొత్తం అజిత్ మాస్ హీరోయిజం…
భిన్నమైన గెటప్పులు, పవర్ ఫుల్ డైలాగులు, హై ఎనర్జీ యాక్షన్ సీన్లు… వెరసి ఈ సినిమా… ఇప్పుడు ట్రెండ్ అంటే వన్ లైనర్స్, పంచ్ డైలాగులు కదా… బాగానే వాడుకున్నారు…
క్రైమ్ బాస్ అయిన ఎకె అలియాస్ రెడ్ డ్రాగన్ కథ… అతని భార్య, కొడుకులతో విడిపోయిన తర్వాత, ఆ వ్యక్తి తన నేరాలకు లొంగిపోయి చట్టపరమైన శిక్షలను ఎదుర్కొంటాడు…
సంవత్సరాల తరబడి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆ వ్యక్తి తన కొడుకు 18వ పుట్టినరోజున విడుదలవుతాడు. అయితే, త్వరలోనే అతని కొడుకు డ్రగ్స్ కేసులో, తన స్నేహితురాలిని చంపినందుకు అరెస్టు చేయబడ్డాడని తెలుస్తుంది…
దీని వెనుక ఉన్న నిజాన్ని AK అర్థం చేసుకోలేకపోవడంతో, తన కొడుకును బంధించిన వ్యక్తులను పట్టుకోవడానికి అతను తన పూర్వ స్వభావమైన రెడ్ డ్రాగన్‌లోకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు…
సినిమా మిగతా భాగం AK తన కొడుకుపై కుట్ర చేసిన వారిని ఎలా పట్టుకోగలిగాడు, వారిని ఎలా అంతం చేస్తాడు అనేదే… పాత స్టోరీ లైన్… నాట్ ఇంప్రెసివ్… కానీ క్రీస్తుపూర్వం నాటి బాషా మార్క్ కథలూ తొక్కా తోలూ అని చూడదలుచుకోలేదు దర్శకుడు అధిక్ రవిచంద్రన్…
అజిత్ పాపులారిటీని వాడుకుంటూ ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టెయినర్ తీసేయాలనేది ప్లాన్… పక్కాగా అమలు చేశాడు… ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసి తీసినా సరే… కథ, స్క్రీన్ ప్లే ఫ్యాన్స్‌కు కూడా కాస్త నిరాశే… జీవీ ప్రకాష్ బీజీఎం సినిమాను ఎలివేట్ చేసింది… సినిమాటోగ్రఫీతో కలిసి ఓ గ్రాండ్ ఫీల్ తీసుకొచ్చింది…
ఈ వన్ మ్యాన్ షోకు ఫస్ట్ డే వసూళ్లు బాగానే ఉండవచ్చు… కానీ అది తమిళనాడులో మాత్రమే… తెలుగులో పెద్దగా ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కకపోవచ్చు… తమిళనాట థియేటర్లలో దళపతి విజయ్ అభిమానులు సినిమా ఇంటర్వెల్ సన్నివేశంలో అజిత్ చేసే సర్‌ప్రైజ్ కోసం ఎదురు చూడవచ్చు…
Share this Article