.
మిస్ యూ నాన్నా… 21st జనవరి 2021 మా నాన్నకు 4th స్టేజ్ ప్రొస్టేట్ క్యాన్సర్ గుర్తించిన రోజు, 10th ఏప్రిల్ 2023 మా నాన్న చివరి రోజు.
ఈ 2Y 3M కాలం ఎలా మారుస్తుందీ అంటే… ఒక కుటుంబాన్ని ఉల్టా పల్టా అంటే, ఆర్థికంగా మానసికంగా .., పైసలు మల్ల సంపాదించొచ్చు కానీ ఆ పెయిన్ ఎప్పటికి వుంటుంది, కనుల ముందు మీ ఇంట్లోని మీ ఇష్టమైన వ్యక్తి చనిపోతాడు అని తెలిస్తే యెట్లా వుంటది,
Ads
శత్రువులకు కూడా కేన్సర్ రావొద్దు అని కోరుకుంటం, హార్ట్ ఎటాక్ తో పోయినా బెటర్ కానీ కేన్సర్ మిమ్మల్ని యేడిపించి పోతుంది, మూత్రం పోయడానికి పోతే రక్తం వస్తే ఎలా వుంటది, జస్ట్ ఇమాజిన్, డాక్టర్లు ఇంకా ట్రీట్మెంట్ వుండదు ఇంటికి వెళ్ళండి అంటారు , నాన్న టైమ్ అయిపోయింది (చనిపోతాడు) అంటారు,
(డాక్టర్లు దేవుళ్ళు వాళ్ల డ్యూటీ అది) నాన్నేమో హాస్పిటల్ లో వుందాం అంటడు, ఇంకా 150000 LOC letter వుంది, Thankyou Kavithakka ,
ఎవరి కోసం మా తమ్ముడు కష్టపడ్డాడో, (19 ఇయర్స్ కి జైల్ కి పంపినారు మిలియన్ మార్చ్ కేసులో) వాళ్ళు ఎవ్వరూ సహాయం చేయలే, ఇంకా తొక్కుడు స్టార్ట్ చేసారు, ఒక్క కవితక్కే హెల్ప్ చేసింది,
నాన్న చనిపోయే ఒక్క రోజు ముందు KTR అన్న వున్నాడు కదరా, అన్న చూసుకుంటాడులే తమ్ముడిని అన్నాడు, అవును నాన్నా, ఆయనకి అన్నీ తెలుసు, టైం వచ్చినప్పుడు చూస్తాడు అన్న లాస్ట్ మాటలు కూడా టెన్షన్ వుండే నాన్నకు,
ఏం చేయాలో అర్థం కాదు, ఇప్పటికీ గుర్తొస్తే ఏడుపు వస్తుంది, మా నాన్న ఫైటర్, ఆ పెయిన్ వేరే వాళ్లైతే నొప్పికి సూసైడ్ చేస్కుంటారు, లాస్ట్ రోజుల్లో మా నాన్న లెట్రిన్ దొడ్డికి పోతే కడిగినం, స్నానం చేపించినం, డైపర్లు మార్చినం, భుజాల మీద మోసుకుని పొయినం, మా నాన్న సుఖంగా చచ్చిపోవాలి అనుకున్నం,
ఎందుకంటే.. చిన్నప్పటి నుండి కష్టపడ్డడు, మోటు పని , లేబర్ పని, బీడిల గంప గుంజుడు, జీవితాంతం కష్టపడ్డడు, చనిపోయెప్పుడు అయినా కొంచెం సుఖంగా పోతే బాగుండు అనిపించింది, కానీ కేన్సర్ నరకం చూపిస్తుంది.. నొప్పి , మమ్మల్ని కూడా చంపేసింది,
మా నాన్నకి ముద్దునివ్వాలి , హగ్ చేస్కోవాలి, ఫ్లైట్ విమానం ఎక్కించాలి అని వుండె… మీరు వాళ్ళు వున్నపుడే చెయ్యండి.., మేం 42 సార్లు హాస్పిటల్ పోయినం, 95 రోజులు హాస్పిటల్ లోనే వున్నం, ఎన్ని లక్షలు ఖర్చు అయిందో, అర్జెంట్ డబ్బులు అవసరం అయి ఆత్మగౌరవం కోల్పోవాల్సి వస్తుంది, చాలా మంది నిజ స్వరూపాలు చూశాం, కానీ టైం… రేపు ఈ రోజులా ఉండొద్దు, e=mc2
నోట్: ప్రొస్టేట్ క్యాన్సర్ 40+ మగ వారికి వస్తుంది, 35 ఏజ్ దాటిన ప్రతి ఒక్కరూ PSA – prostate specific antigen టెస్ట్ చేయించుకోండి, ఓన్లీ 500+ వుంటది, అందుకే మీ ఇంట్లో వాళ్లకు కొంచెం తేడా అన్పిస్తే వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళి టెస్ట్స్ చేయించండి, మీ టైం సేవ్, హెల్త్ సేఫ్, మనీ సేవ్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దేన్ క్యూర్ …….. చింతా శ్రీనివాస్
(ఓ కొడుకు బాధను ఎందుకిప్పుడు పబ్లిష్ చేయడం అంటే… పెయిన్… అది అనుభవించేవాళ్లకే తెలుస్తుంది… ఎస్.., పీఎస్ఏ టెస్టు ఆవశ్యకతను గుర్తుచేయడానికి ఇది… )
Share this Article