.
ప్రదీప్, దీపిక పిల్లి, గెటప్ శ్రీను, రోహిణి… ఈ పేర్లన్నీ ఈటీవీ బ్యాచ్… ఢీ, జబర్దస్త్ ఎట్సెట్రా… అంతెందకు ఇప్పుడు తాజాగా రిలీజైన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో కూడా వీళ్లే… ఇంకా చాలామంది అదే బ్యాచ్ కనిపిస్తారు…
అంతేకాదు, జబర్దస్త్ షో స్టార్ట్ చేసిన డైరెక్టర్లు నితిన్, భరత్ (తరువాత వేరే చానెళ్లకూ మళ్లారు…) కూడా ఈటీవీ, మల్లెమాల బ్యాచే… ఎస్, వీళ్లందరూ కలిసి చేసిన సినిమా అచ్చంగా ఓ ఈటీవీ రియాలిటీ షోలాగే ఉంది… పూర్తిగా కామెడీ బేస్డ్…
Ads
ఓ ఊరు, ఓ సర్పంచ్… అందరూ మగాళ్లే పుడుతుంటారు… లేకలేక పుట్టిన దీపిక పిల్లితో ఊరికి అదృష్ట యోగం పడుతుంది… సో, ఆమెను పెళ్లి చేసిన బయటికి పంపించొద్దు అనుకుంటారు… ఊళ్లో సంబంధమే చూడాలి… 60 మంది యువకులు…
కానీ బయటి నుంచి వేరే వ్యక్తి వస్తాడు… వాడే ప్రదీప్ మాచిరాజు… ఆమెను దక్కించుకోవడానికి తనకూ ఊరోళ్లకూ పోటీ… ఇదీ కామెడీ… చివరకు క్లైమాక్స్‌ను కూడా పేలవమైన కామెడీతో ముగించారు దర్శకులు… ఐనా జబర్దస్త్ తాలూకు సినిమా అలాగే ఉంటుంది అంటారా..?
ఒకటి నయం… ఎంత జబర్దస్త్ బ్యాచ్ అయినా సరే… ఆ షో తాలూకు వెగటుతనాన్ని, అశ్లీలాన్ని, అసభ్యతను ఇందులో క్యారీ చేయలేదు… అది ఒక ప్లస్ పాయింట్… ప్రత్యేకించి సినిమాకు బలం ప్రదీప్ కాదు, దీపిక కాదు… జస్ట్, గెటప్ శ్రీను, సత్య మాత్రమే…
వాళ్ల బిట్సే నవ్విస్తాయి… కానీ సత్య డేట్స్ దొరకలేదేమో సెకండాఫ్‌లో తన పాత్ర కుదించుకుపోయింది… ఫస్టాఫ్ వరకూ ఏదో టీవీ కామెడీ షో చూస్తున్నట్టు బాగానే ఉన్నా సెకండాఫ్ దెబ్బతింది… కారణం, పెద్దగా ఎమోషన్లు వర్కవుట్ కాలేదు…
నిజానికి ప్రదీప్ నంబర్ వన్ తెలుగు హోస్ట్… ఫిమేల్ సుమతో పోలిస్తే ఈక్వల్ పాపులారిటీ తనది… స్పాంటేనిటీ సూపర్… కానీ సినిమా చూస్తుంటే ఏదో టీవీలో షోలో ప్రదీప్‌ను చూస్తున్నట్టే ఉంటుంది… ఎమోషనల్ సీన్లలో పూర్ పర్‌ఫామెన్స్… స్టెప్పులు మరీ కృతకంగా… పట్టి పట్టి బలవంతంగా ఎక్సర్‌సైజు చేయిస్తున్నట్టు…
నిజానికి ప్రదీప్ ప్లస్ కాదు, సినిమాకు ఓరకంగా మైనస్… దీపిక పిల్లి గతంలో ఢీ షో, ఆహాలో కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ హోస్ట్ చేసింది… పర్లేదు, లుక్ వరకూ వోకే… కానీ ఎక్కడో ఏదో అసంతృప్తి… కెమిస్ట్రీ పండలేదు… పోనీ, పాటలు బాగున్నాయా లేవు…
మరి సినిమా బాగా లేదంటారా అనడక్కండి… నాలుగు కామెడీ బిట్లు చూడాలనుకుంటే వోకే… అబ్బే, పాత జబర్దస్త్ స్కిట్లు చూస్తే సరిపోదా, థియేటర్ దాకా వెళ్లాలా అంటారా..? అది మీ ఇష్టం… చివరగా… భయ్యా, ప్రదీపూ… టీవీ హోస్టింగులో నువ్వు తోపు… మనకు ఈ సినిమాలు అవసరమా చెప్పు..! అదీ నువ్వే పైసలు పెట్టి, నీ ఫ్రెండ్ సర్కిల్‌తో పెట్టించి మరీ…!
Share this Article