.
Shiva Prasad …… కంచ గచ్చిబౌలి భూముల విషయంలో వేల కోట్ల రేవంత్ సర్కారు అవినీతి, అక్రమం, బ్లాస్టింగ్ వివరాలు బయటపెడతాను అని ఊదరగొట్టాడు కేటీయార్…
తీరా చూస్తే… దాదాపు గంటసేపు కేటిఆర్ పెట్టిన ప్రెస్ మీట్ విన్నా కూడా నాకు ప్రభుత్వం చేసిన అవినీతి ఏంటో అర్థం కాలేదు. మహా అయితే ఐసిఐసిఐ కొంత ఉదారంగా ప్రభుత్వానికి లోన్ ఇచ్చింది… అదీ అక్రమ మార్గంలో కాదు…
1. ఆ భూమి ఐసిఐసిఐ పేరు మీద ఇంకా రిజిస్ట్రేషన్ కాకుండానే లోన్ ఇచ్చింది…… ఇదొక విమర్శ… కానీ ఒకసారి భూమిని బదలాయిస్తూ ప్రభుత్వం జివో ఇచ్చాక ఇవాళ కాకపోతే రేపు మ్యుటేషన్ అవుతుంది. ఇది కేవలం సాంకేతిక ఆలస్యమే తప్ప బ్యాంకుని ప్రభుత్వం మోసం చేస్తుందని అనుకోరు కదా…
Ads
2.ప్రభుత్వ రేటు కాకుండా మార్కెట్ రేటుకి వాల్యూ కట్టి రేవంత్ రెడ్డ ప్రభుత్వానికి లోన్ ఇచ్చింది…. ఇది మరో విమర్శ… కానీ ఒక కార్పొరేట్ బ్యాంక్ నుంచి ప్రభుత్వం ఎక్కువ లోన్ రాబట్టడం మంచిదే కదా… దానికి రేవంత్ అవినీతి అని ఎలా చెప్తాం?
3. అటవీ భూమికి లోన్ ఎలా ఇస్తారంటున్నారు…. ఇంకో విమర్శ… ఈ అటవీ భూమి గొడవ అంతా ఇప్పుడు కదా.. లోన్ తీసుకునే సమయానికి లేదు… పైగా అది అటవీ భూమి కాదు… ప్రభుత్వ భూమి…
4. లోన్ వచ్చిన తర్వాత మళ్ళీ లాండ్ రేటు తగ్గిస్తూ ఏవో సర్వే సంస్థలు రిపోర్టు ఇచ్చాయి అంటున్నారు…. కానీ ఆ తగ్గించిన రేటుకి ఇంకా ఎవరికీ అమ్మినట్టు లేదు. కనుక ఇప్పటికప్పుడు అది అవినీతి అని ఎలా చెప్తాం?…
ఇవి గాక ఇంకేవో మతలబులు ఉన్నాయా..? బీజేపీ ఎంపీ అంటాడు, లోపాయికారీ యవ్వారం అంటాడు… తన ఆరోపణల్ని సబ్‌స్టాన్షియేట్ చేసుకునే ఆధారాలు ఏవి..? మిత్రుడు కృష్ణ నారాయణ పోస్టు ఓసారి చదవండి,..
కంచ ఏరియాలో వేరే భూములు collateral gaa పెట్టి TGIIC బాండ్స్ ద్వారా 10 వేల కోట్లు సేకరించింది. ఆ ల్యాండ్స్ వేరే అనుకుంటా… ఇవీ సంబంధిత డాక్యుమెంట్స్. (ఎవరైనా download చేసి చదవచ్చు) నాకు అర్థం అయినంత వరకూ ఎక్కడా ప్రాసెస్ తప్పలేదు. NSE లిస్టెడ్ బాండ్స్ అవి…traded…
కార్పొరేట్ బాండ్స్ ద్వారా నిధుల సేకరణ జరిగింది. ఇందులో స్కాంకు ఛాన్స్ ఉండకపోవచ్చు. బాండ్స్ కోసం ఇచ్చే కమీషన్ లంచం కాకపోవచ్చు. కేటీఆర్ ఆరోపణల్లో బలం లేదు అనుకుంటా… unless, some unseen political game….
.
Share this Article