ముందుగా ఓ ప్రముఖ సైటులో కనిపించిన ఓ వార్త చదవండి… ‘‘నటిగా, యాంకర్‌గా ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న అనసూయ సోషల్ మీడియాలో ఫొటో పెట్టినా… లేదంటే ఏదైనా ఇష్యూపై స్పందించినా చాలా వరకూ నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి… ముఖ్యంగా ఆమె పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉండటంతో దాన్ని గుర్తు చేస్తూ… ఈ అందాల ప్రదర్శన అవసరమా..? పోయి పిల్లల్ని సరిగా పెంచుకో అంటూ ఉచిత సలహాలు ఇస్తుంటారు… ఇలాంటి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించే అనసూయ తన వస్త్రధారణ విషయంలో ఓపెన్‌గానే మాట్లాడుతూ నా శరీరం నా ఇష్టం… ఇది నా ఛాయిస్… మధ్యలో మాట్లాడటానికి మీరు ఎవరు అంటూ చురకలేస్తుంది… అయితే కేవలం బయట వారే కాదు… తన కొడుకు కూడా తన వస్త్రధారణ విషయంలో అభ్యంతరం చెప్పాడని… నేను వేసుకునే బట్టలు వాడికి ఇష్టం ఉండదని చెప్పింది అనసూయ… నేను ఏ బట్టలు వేసుకోవాలనేది డిగ్రీ వరకూ కూడా మా అమ్మే ఇచ్చేది… గంజి పెట్టి మరీ పైజామా ఒంటిపై కప్పుకోమనేది… నేను ఏం బట్టలు వేసుకోవాలో అమ్మే చెప్పేది… నేను అమ్మని బ్లేమ్ చేయడం లేదు కానీ… అలా పెరగడం వల్లే నాలో చిత్తశుద్ధి ఇంకా ఉంది… నేను అంత పద్దతిగా పెరిగాను… కానీ ఇప్పుడు నా కొడుకు కూడా నా బట్టల గురించి మాట్లాడుతున్నాడు… నేను వేసుకునే బట్టలు నా కొడుకుకి నచ్చవు… అమ్మా ఆ బట్టలు బాలేదని చెప్తాడు… నేను పై వరకూ ఉన్న క్రాప్ టాప్ వేసుకుంటే, కాస్త పెద్దవి వేసుకో అని చెప్తాడు… కానీ వాడికి నేను చెప్తాను… రేయ్ అది నా ఛాయిస్… ఇది నా కంఫర్ట్… ఈ బట్టల్లో నేను బాగా కనిపిస్తా… నువ్ వేసుకున్న టీ షర్ట్ నాకు నచ్చకపోయినా… నీకు ఇష్టం కాబట్టి నిన్ను వేసుకోనిస్తున్నా… నువ్ ఎందుకు నా ఇష్టాన్ని కాదంటావ్ అని నా కొడుక్కి చెప్పా… నేను ఫ్యామిలీ రిలేషన్స్కి రెస్పెక్ట్ ఇస్తా… నేను పడుపు వృత్తిని నమ్మను… నా శరీరం నాకు దేవాలయం లాంటిది అని గట్టిగా నమ్ముతున్నా…. మెంటల్‌గా కానీ ఫిజికల్గాని అలాంటి వాటికి వాటికి నేను వ్యతిరేకం… ఇవి చాలామందికి అర్థం కాదు అంతే అంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది అనసూయ… ప్రముఖ జర్నలిస్ట్ స్వప్నకి ఇచ్చిన ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో ఇవన్నీ పంచుకుంది…’’
ఇంకా లోకం తీరు గురించి లోతుగా అవగాహన లేని ఓ కొడుకు తన తల్లి వస్త్రధారణ మీద అంత అసంతృప్తి వ్యక్తీకరించాడనే విషయం ఆ వార్త చదివినప్పటి నుంచీ తొలుస్తూనే ఉంది… కరెక్టే… తన వస్త్రధారణ తన ఇష్టం… ఇంకా పొట్టిబట్టలు వేసుకున్నా సరే… తన కంఫర్ట్, వాటిల్లో తను అందంగా కనిపిస్తాను అనేది అనసూయ సమర్థన కావచ్చుగాక… కానీ లోకానికి ఎలా ఉందనేదీ ప్రధానమే… ఆ తొక్కలో లోకం, అది ఏమని అనుకుంటే ఏం..? ఐ డోన్ట్ కేర్ అనుకోవచ్చుగాక… కానీ చివరకు ఆడవాళ్ల వస్త్రధారణ మీద పెద్దగా నాలెడ్జి లేని సొంత కొడుకుకే ఆమె వస్త్రధారణ వెగటుగా అనిపించిందా…? అందుకే ధైర్యంగా తల్లికి నాకు నచ్చలేదు మమ్మీ అని చెప్పాడా..? హఠాత్తుగా కొందరు విరుచుకుపడతారేమో… నాన్సెన్స్, ఆ కొడుకు కూడా మగాడే కదా అని..! కానీ అనసూయ ఆ పిల్లాడికి అమ్మ కదా… మా అమ్మ ఇలా కనిపించాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని తను అనుకుంటే తప్పుపట్టలేం కదా… అనసూయ తన ధోరణిని బట్టి తన డ్రెస్సింగు గురించి ఎవరేం కామెంట్ చేసినా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటుంది… కొడుకును తిట్టలేదు గానీ, అలా కాదు బిడ్డా, నాకిదే సౌకర్యంగా ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నించింది… కానీ కొడుకు అంతరంగం అర్థం చేసుకోలేకపోయింది… అర్థం చేసుకుంటే ఆమె అనసూయ ఎందుకు అవుతుంది..?!
Ads
సోషల్ మీడియాలో ఎవరో ఒకరు… ‘‘ఆ డ్రెస్సులో మీరు కాస్త అసభ్యంగా కనిపిస్తున్నారు’’ అన్నాడు అంటే… అందులో ద్వేషం ఎందుకు వెతకాలి..? ప్రేమగా ఓ సలహా ఇచ్చినట్టుగా ఎందుకు స్వీకరించదు..? సేమ్, తన కొడుకు కూడా… అమ్మా, అలా వద్దమ్మా అంటున్నాడు అంటే అందులో ప్రేమ ఉంది తప్ప తల్లి మీద కోపం కాదు కదా… నా డ్రెస్సింగును ఎవడేం అన్నా ఊరుకోను, నా ఇష్టం వచ్చినట్టు ఊరేగుతా అంటే ఎవడేమీ వద్దనడు… కానీ ఆమధ్య జబర్దస్త్ వాడే ఓ ఎపిసోడ్లో ఆమె డ్రెస్సు కనిపించకుండా నానా కష్టాలూ పడ్డాడు ఎడిటింగులో… ఎందుకు..? జనం ఛీత్కరిస్తారనే సందేహం… అప్పుడైనా తనకు ఆత్మమథనం ఏదో జరిగి ఉంటుందని మనం అనుకోకూడదు…
నో డౌట్, ఆమె అందమైంది… మంచి కలర్, మంచి ఎత్తు, మంచి లుక్కు… ఆమెకేమీ తక్కువ లేదు… దేహం ఉదారంగా చూపిస్తాను అంటే ఎవడెందుకు వ్యతిరేకిస్తాడు..? ఐనాసరే కొందరు వ్యతిరేకిస్తున్నారు అంటే… అందులో కొడుకు కూడా ఉన్నాడు అంటే… సమస్య ఎక్కడుందో ఆమెకు అర్థమవుతుందా..? డౌటే…!! నా దేహం ఓ దేవాలయం, నాకు పడుపు వృత్తి మీద నమ్మకం లేదు వంటి వ్యాఖ్యలు ఆమె జ్ఞానసంపద మత్తడి దూకుతున్నట్టుగా ఉన్నయ్… మరి ఐడ్రీమ్స్ వాళ్లు ఇంటర్వ్యూలో ఏం చూపించారో ఏమో మనకు ఇక్కడ అనవసరం గానీ… చివరకు ఏడెనిమిదేళ్ల కొడుక్కి కూడా ఆమె డ్రెస్సింగు నచ్చడం లేదు అనే పాయింట్‌కే పరిమితమై ఇక మనం దీన్ని ఇంతటితో ముగిద్దాం… ఐనా ఇదంతా మనకెందుకు అంటారా..? ఆడవాళ్ల వస్త్రధారణ ఎప్పుడూ ఓ చర్చనీయాంశంగా ఉంటున్నది కాబట్టి…!! సుమ వయసైపోతూ, ఇప్పుడు అనసూయే నంబర్ వన్ పాపులర్ టీవీ యాంకర్ కాబట్టి… ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తున్నది కాబట్టి… ఇది ఆమెకు మాత్రమే పరిమితమైన సబ్జెక్టు కాదు కాబట్టి… ఇది ఒక ఉదాహరణ కాబట్టి…!! మరి బోలెడుమంది తెర మీద ఎక్స్పోజింగ్ చేస్తారు కదా అంటారా..? అందరూ ఇలా దేహమేరా దేవాలయం మార్క్ నీతులు చెబుతూ, సోషల్ ట్రోలర్స్ మీద పడి కరవడం లేదు కాబట్టి…!!
Share this Article