.
అసలు ఈ రోగం ఈటీవీ ఢీ షో నుంచే వ్యాపించడం మొదలైంది… కాకపోతే అశ్లీలం జోలికి పోకుండా కేవలం సర్కస్ ఫీట్లు చేయిస్తూ దాన్నే నాట్యంగా చూపిస్తూ ఓ తిక్క అభిరుచిని జనం మీద రుద్దింది ఈటీవీ…
అవి స్టెప్పులు కావు, డాన్సులు కావు, జస్ట్ ఫీట్లు… చాలావరకూ… తరువాత ఏ టీవీ వాడు డాన్స్ కంపిటీషన్ల రియాలిటీ షోలు పెట్టినా అదే కథ… సాముగరిడీలు, కుప్పిగంతులు, కోతిగెంతుల స్టెప్పులు చూస్తూ జడ్జిలు మురిసిపోతూ తమ పర్సులకు న్యాయం చేసేవాళ్లు…
Ads
ఓహోంకార్ (Ohmkar) అని వింత డిక్షన్‌తో నవ్వు తెప్పించే ఓ యాంకర్ కమ్ హోస్ట్ ఉన్నాడు కదా… తను ఆహా ఓటీటీ కోసం డాన్స్ ఐకన్-2 అని ఓ డాన్స్ రియాలిటీ షో చేస్తున్నాడు… డాన్స్ పేరిట నాట్యాన్ని మరింత వికృతం చేసిపారేస్తున్నాడు…
సరే, కుర్చీ మడతపెట్టి, కిసిక్, ఊ అంటావా వంటి పాటల్ని సర్కస్ ట్రెయినీ డాన్సర్లలో ఎంత వెకిలిగా, ఎంత రోతగా స్టెప్పులతో భ్రష్టుపట్టిస్తే వోకే… కానీ మరీ క్లాసిక్స్ అనదగిన పాత (రెట్రో) పాటల్ని కూడా తమ నీచాభిరుచికి బలి చేస్తున్నారు…
తాజాగా ఓ ప్రోమో లింకు ఇది… https://x.com/i/status/1911858089684349152 (పాత పాటల్ని ప్రేమించేవాళ్లు దీన్ని చూడకపోతేనే మంచిది… అంత రోత, అంత వెగటు, అంత జుగుప్స, అంత వెకిలి… ఇలా ఎన్ని పదాలైనా చెప్పుకోవచ్చు)
ఇది ది గ్రేట్ క్లాసిక్ తెలుగు మూవీ (తెలుగువాడు మరిచిపోలేని మాస్టర్ పీస్) లోని అహ నా పెళ్లంట పాట తెలుసు కదా… దానికి ఓ డాన్సర్ రెండు పేలికలు చుట్టుకుని, అవయవాల్నీ అసభ్యంగా ఊపుతూ ఓ చెత్తా ప్రదర్శన చేసింది… (తరువాత ఓ చిన్న పిల్ల వస్తున్నా వస్తున్నా అనే పాటకు ఇంకా ఘోరంగా చేసింది…)
ఇక్కడ చెప్పుకోవాల్సింది ఈ షోకు జడ్జి శేఖర్ మాస్టర్ (కోజడ్జి ఫరియా)… దబిడిదిబిడి పాటకు తను ఏ నీచాభిరుచితో స్టెప్స్ కంపోజ్ చేశాడో మరవకముందే రాబిన్‌హుడ్ సినిమాలో అలాంటిదే ఓ స్కర్టు పాటకు స్టెప్స్ కంపోజ్ చేశాడు… జనం థూత్కరించారు…
ఇప్పుడు తను జడ్జిగా ఉన్న ఈ షోలో కూడా అవే వెగటు స్టెప్పులు… రోత మూమెంట్స్… అవి చూస్తూ జడ్జ్ చేస్తూ ఆనందపరవశుడైపోతుంటాడు… ఖర్మరా బాబూ… ఇంకా ఈ నిర్వాకానికి తోడు అదేదో షోలో కన్నీటిపర్యంతమయ్యాడు… తనపై వస్తున్న విమర్శలను తలుచుకుని…
ఎస్, నిర్మాతలు, దర్శకులు, హీరోల నీచాభిరుచి సరే… మరి దానికి తగినట్టు స్టెప్స్ కంపోజ్ చేసినప్పుడు ఆ విమర్శల రాళ్ల దెబ్బలు తనకూ తగులుతాయి కదా… ఇప్పుడు అహ నాపెళ్లంట పాటను భ్రష్టుపట్టించిన తీరు చూసి నెటిజనం ఆ ఓటీటీని, ఓహోంకార్ టేస్టును తిట్టిపోస్తున్నారు… కనీసం తెలుగు క్లాసిక్స్ జోలికి పోకండిరా అని సూచిస్తున్నారు… సహజమే కదా…
Share this Article