.
ముందుగా ఓ ప్రస్తావన… అఘోరా అంటే… నగ్నంగా ఒళ్లంతా బూడిద పూసుకునే జనజీవన స్రవంతికి దూరంగా శివపూజలో ఆహారఆహార్య విధానాల్లో అరాచకంగా అంకితమయ్యే కేరక్టర్… అంతే కదా…
నాగసాధువు అంటే..? దాదాపు సేమ్… మనకు కుంభమేళా సమయాల్లో తప్ప మరెప్పుడూ కనిపించరు… వాళ్ల ఆహార్యమూ దాదాపు అంతే కదా… కానీ ఆ పాత్రల్ని సినిమాల్లో తీసుకునేటప్పుడు వారిని ఎలా చూపాలి…?
Ads
అదేదో సినిమాలో (అఖండ కావచ్చు) బాలకృష్ణ అఘోరా.,. కానీ తనను అఘోరా నిజ ఆహార్యంలో చూపిస్తే వచ్చే విపత్తులు తెలుసు కాబట్టి ఆ దర్శకుడు ఎవరో గానీ బెల్టు, చొక్కా తొడిగాడు… మీసాలు నలుపు, గడ్డం తెలుపు… త్రిశూలం బదులు పంచశూలం… నానా ఇకారాలకూ పోయాడు…
కాకపోతే తన స్టార్‌డం, డైలాగ్స్ సినిమాను గట్టెక్కించాయి… అఫ్‌కోర్స్, థమన్ బాక్సులు పగిలిపోయే లౌడిజం కూడా ఓ కారణమే… మరిప్పుడు తమన్నా షీరోగా ఓదెల-2 అని ఓ సీక్వెన్స్ వచ్చింది… మరి ఆమెను నిజ నాగ సాధువు ఆహార్యంలో చూపలేరు కదా… జనం తట్టుకోలేరు కదా… అలాగని తెలుగు రాష్ట్రాల్లోని ఓ చెత్తా అఘోరి కేరక్టర్ రూపం అస్సలు అనుకరించలేరు…
సో, ఏదో ఓ పిచ్చివేషం వేయించారు… కానీ గత పాత్రల ప్రభావం ఎంతగా ఉంటుందీ అంటే… తమన్నాను చూస్తే దా దా అని డర్టీ బాడీ లాంగ్వేజీతో చేసిన ఆ రోత పాటే గుర్తొస్తుంది… అదీ ఆమె సంపాదించుకున్న క్రెడిట్… పోనీ, నటనతో అవన్నీ మరిపించిందా… నిల్… దర్శకుడి వైఫల్యమో, పిచ్చి పాత్రలు చేసీ చేసీ ఆమెకే చేతకాలేదో తెలియదు గానీ పెద్దగా ఆప్ట్ అనిపించలేదు… ఆమెను ఈ పాత్రలో తెరపై చూస్తుంటే భక్తీ కలగలేదు, భయమూ కలగలేదు…
పైగా సినిమా చూస్తున్నంతసేపూ అరుంధతి గుర్తొస్తుంటుంది… అన్నింటికీ మించి ఓ పాత్రకు శ్రీకాంత్ అయ్యంగార్ అనే మరో వెకిలి నటుడిని తీసుకున్నారు… తనను చూస్తుంటే తన పాత తిక్క వివాదాలు గుర్తొస్తూ సినిమా మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగింది…
శవపురాణం అట… దర్శకుడు ఎవరో గానీ, నీకో దండంరా బాబూ… నిలువునా పాతిపెట్టడం ఏమిటి… ఊరోళ్ల పాదధూళితో సమాధి చేయడం ఏమిటి..? ఎవడో వెధవ టాయిలెట్ వెళ్తే రక్తం పడి ఆత్మ కాష్మారా టైపులో ప్రాణం పోసుకోవడం ఏమిటి..?
అసలు సినిమాయే హింస… అనగా మితిమీరిన హింస… ప్రేక్షకుడికి కూడా… ఎవడో శోభనం రోజే పెళ్లికూతుళ్లను అపహరించి అత్యాచారం చేస్తాడు… తరువాత వాడి ఆత్మ బతికొచ్చీ అదే చేస్తుంటాడు… ఈ తమన్నా వచ్చి కాపాడుతుంది… ఆమెకు సాయంగా సాక్షాత్తూ ఆ శివుడే కదిలివస్తాడు…
శివుడు కదిలివచ్చే ఆ సీన్ వరకూ వోకే, అజనీష్ బీజేఎం అక్కడ మాత్రం వోకే… అంతకుమించి సినిమాలో పెద్దగా ఏమీ లేదు… అంత మురిసిపోయి చూసేంత సీన్ కూడా ఏమీ లేదు… ఇంకా రాయడానికి కూడా ఏమీలేదు… తమన్నా సాక్షిగా…!!
Share this Article