.
Subramanyam Dogiparthi ……. పోరాటం… ఇది కృష్ణ- శారదల సినిమా . కాదేమో, శారద సినిమాయేనేమో… ఆ ఇద్దరి కోసమే మూలకధను కోడి రామకృష్ణ తయారుచేస్తే , పరుచూరి బ్రదర్స్ శారదను తమ డైలాగుల ద్వారా రీలాంచ్ చేసారని చెప్పాలి .
ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు . అప్పటివరకు విషాద పాత్రలకు , బరువైన పాత్రలకు చిరునామా అయిన శారద పరుచూరి బ్రదర్స్ పుణ్యాన ఫైర్ బ్రాండ్ లేడీ పాత్రలకు పెట్టింది పేరుగా చేసారు . చండశాసనుడు , కడప రెడ్డెమ్మ వంటి షీరోయిక్ పాత్రలు ఆమె చాలా చేసారు . మొత్తం మీద 1983 లో శారద సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయ్యాయి .
Ads
కృష్ణకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . చాలా చేసారు . అయితే ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రాక్టికల్ గా ఉంటుంది . ఆయన నటనలో కూడా చాలా ఈజ్ ఉంటుంది . ముఖ్యంగా చెప్పుకోవలసింది జయసుధతో జోడీ .
మామూలుగానైతే జయసుధతో నటించేటప్పుడు కృష్ణ బిగుసుకు పోతారు (విజయనిర్మల తరఫు బంధువు కదా… జయసుధకు విజయనిర్మల మేనత్త..) జయసుధ కూడా అందరితో నటించినట్లు ఫ్రీగా నటించలేదు . కానీ ఈ సినిమాలో మాత్రం ఇద్దరూ చాలా బాగా ఫ్రీగా నటించారు . డ్యూయెట్లలో కూడా ఎలాంటి బెరుకు , మొహమాటం లేకుండా నటించారు . కోడి రామకృష్ణ ఏం మంత్రం వేసాడో !
ఎనిమిది సెంటర్లలో వంద రోజులు ఆడిన ఈ సినిమా విజయానికి పరుచూరి బ్రదర్స్ , కోడి రామకృష్ణ , కృష్ణ , శారదలు ప్రధాన కారకులు . ఆ తర్వాత జయసుధ . ఆమెతో పాటు ఇతర ప్రధాన పాత్రల్లో రావు గోపాలరావు , గొల్లపూడి మారుతీరావు , పి యల్ నారాయణ , జగ్గయ్య , కాంతారావు , అంజలీదేవి , పూర్ణిమ , శ్రీలక్ష్మి , ప్రభృతులు నటించారు .
ప్రత్యేకంగా చెప్పవలసింది మహేష్ బాబు గురించి . సాంకేతికంగా అతనికి బాలనటుడిగా ఇది రెండో సినిమా . కృష్ణ తమ్ముడిగా నటించాడు . బాగానే నటించాడు . మరో ముఖ్య పాత్ర శివకృష్ణది . తన్ను, కొట్టు, చంపు, కొరుకు పాత్ర . పని , బుర్ర తక్కువ ; అనవసర ఆవేశం ఎక్కువ పాత్ర . ఓ చిన్న టైలర్ అప్పారావు పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపిస్తాడు .
రొటీన్ కధకు భిన్నంగా నేసారు . తన మేనత్తకు ప్రత్యక్షంగా , తన కుటుంబానికి పరోక్షంగా ద్రోహం చేసిన విలనాసురుడి మీద , అతని సహచరుల మీద హీరో ప్రతీకారం తీర్చుకునే కధ . అయితే ఈ ప్రక్రియలో హీరో అర్జునుడు అయితే కృష్ణ పాత్రధారి మేనత్త శారద .
హీరో అమె చేతిలో తుపాకీ . క్లైమాక్సులో ఆమే విలన్లను కోర్ట్ హాల్లో రివాల్వరుతో షూట్ చేసి లేపేస్తుంది . అలా ఆమె చేత షీరోయిక్ పాత్రను పోషింపచేసారు కోడి రామకృష్ణ , పరుచూరి బ్రదర్స్ .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో డ్యూయెట్లు , జయమాలిని పేసింజరు పాట జనాన్ని ఊపేసాయి . ఇది ఆది మానవుడి పోరాటం కృష్ణ టైటిల్సుతో ఎంట్రీ పాట . ఆయన అభిమానులకు బాగా నచ్చిన పాట . ఆత్రేయ వ్రాసిన ఫేమిలీ పాట ఏ దేవుళ్ళు దీవించారో సినిమాకు ఐకానిక్ పాట అని చెప్పవచ్చేమో ! మూడు సార్లు వస్తుంది .
కృష్ణ జయసుధల రెండు డ్యూయెట్లు ఇద్దరూ ఇరగతీసారు . ఈ రెండు పాటల్నీ వేటూరి వారే వ్రాసారు . జయమాలిని చేత తిరణాల డాన్స్ పాట ఇంటి కాడ చెప్పలేదు పేసింజరూ కూడా ఆయనే వ్రాసారు . ఆయన కలానికి రెండు వైపులా పదును ఉంటుందిగా !
ఏక్షన్ , వెంజెన్స్ , రొమాన్స్ , ఫేమిలీ సెంటిమెంట్ అన్నింటినీ కలబోసిన సినిమా 1983 డిసెంబర్లోలో వచ్చిన ఈ పోరాటం . యూట్యూబులో ఉంది . కృష్ణ , జయసుధ , శారద అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే చూడండి . An entertaining , watchable , feel good movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article