.
గుర్తుంది కదా… బెంగుళూరుకు చెందిన శునక ప్రేమికుడు సతీష్ అనే ఒకాయన నేను 50 కోట్ల విలువైన వూల్ఫ్ డాగ్ కొన్నాను అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టుకున్నాడు… ఫుల్లు వైరల్ అయిపోయింది కూడా…
ఆ పోస్టు ఆధారంగా మన దేశంలోని చిన్నాచితకా పెద్దాగొప్పా మీడియా సంస్థలు… వెబ్, డిజిటల్, ప్రింట్, టీవీ, వాట్సప్, యూట్యూబ్ ఎడిషన్లన్నీ కవర్ చేశాయి… మన మీడియా దురవస్థ… ఒక్కరూ ధ్రువీకరించుకోలేదు, తనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు… యూకే, యూఎస్ మీడియా కూడా…
Ads
తను పోస్ట్ చేసిన ఫోటో చూసి అందరూ తప్పులో కాలేశారు… జస్ట్, సోషల్ మీడియా పోస్టు ఆధారంగా రాసేశారు… వూల్ఫ్ డాగ్ … అంటే ఇది ఏ బ్రీడో తెలుసా? తోడేలు- కుక్క కలిసిన సంకర జాతి శునకం…
(lion plus tiger లైగర్ అయినట్టు… దీన్ని డోల్ఫ్ అని గానీ, వోడ్ అని గానీ పిలవరు… wolfdog అంటారు… తెలుగులో ఏమనాలో..? కుడేలు, తోడేక్క అనేమైనా పిలవాలేమో, రెండింటినీ సంకరం చేసేసి… హైబ్రీడ్ అంటే అంతే కదా…)
ఐతే ఇందులో ట్విస్టు, ఫ్యాక్ట్ ఏమిటో సీనియర్ పాత్రికేయ మిత్రుడు ఉడుముల సుధాకర్‌రెడ్డి ఓ ట్వీట్‌లో ఇదుగో ఇలా వివరించి చెప్పేశాడు…
https://x.com/sudhakarudumula/status/1912760363944116489?t=OqqH9KsoN90DiwIOuG6u2A&s=08
సరే, యాభై కోట్లు అంటున్నాడు… విదేశాల నుంచి తెప్పించాను అంటున్నాడు… ఈ కథానాయకుడు కొనుగోలు చేశాడని చెప్పబడిన జంతువు పేరు “Cadaboms Okami” అనీ, ఇది ఒక Caucasian Shepherd ప్లస్ ఓ తోడేలు సంయోగంతో పుట్టిన అరుదైన వోల్ఫ్‌డాగ్ అనీ జీవశాస్త్ర భాషలో కూడా చెబుతున్నాడు కదా,.. మరి విదేశీ మారకద్రవ్యం, మనీలాండరింగ్, హవాలా బాపతు యవ్వారాలేమైనా ఉన్నాయో కనుక్కుందాం, దొరికితే బుక్ చేద్దాం అనుకుని ఆ తలుపు తట్టారు ఈడీ అధికారులు… మరి వాళ్ల పని వాళ్లు చేయాలి కదా…
8 నెలల వయస్సు… 75 కిలోల బరువు… రోజూ కిలోల మాంసాహారం… మరి మామూలు జంతుకు కాదు కదా… తీరా అక్కడికి వెళ్లాక తెల్లమొహాలు వేయాల్సి వచ్చింది… ఎందుకంటే..? ఈ స్థాయిలో విదేశీ కరెన్సీతో కొనుగోలు జరిగితే, ఖచ్చితంగా FEMA (Foreign Exchange Management Act) పరంగా అనుమతులు, పత్రాలు ఉండాలి. కానీ, ED అధికారులకు అక్కడ ఏ జంతువు కనబడలేదు. ఎలాంటి పాస్‌పోర్ట్ లేదు, ఎలాంటి దిగుమతి రికార్డులు లేవు…
ఒక అధికారి మాటల్లో చెప్పాలంటే:… “అది కుక్కో నక్కో, అలాంటి జంతువేదీ అతని దగ్గర లేదు. అతను ఎప్పుడూ దాన్ని కలిగి ఉండలేదు. ఎలాంటి లావాదేవీ లేదు, ఎలాంటి విదేశీ రిమిటెన్స్ లేదు, జస్ట్, ఏమీలేదు…”
సో, ఈ కథ నిజానికి ఒక పబ్లిసిటీ స్టంట్‌గానే కనిపిస్తోంది. ఫోటోలు ఎవరివో, లేక ఎఐ బాపతో… 50 కోట్లు అన్న ధర కూడా కేవలం ఊహాగానమే. ఈ మొత్తం కథ సోషల్ మీడియాలో వైరల్ చేయడానికే ఉద్దేశించినట్టుంది… అంతా తూచ్…
Share this Article