.
రెండు అంశాలు… 1) విజయశాంతి… ఒకప్పటి స్టార్ హీరోయిన్… తెలంగాణ రాజకీయాల్లో కేసీయార్ వాడుకున్న ఓ బకరా… ఆమె మాట అర్థం కాదు, ఏదో ఆ మీనాక్షి పుణ్యమాని ఎట్టకేలకు ఎమ్మెల్సీ… ఫాఫం… కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం పెద్ద గుండా సున్నా, ఈ సినిమాలాగే… (అప్పట్లో ఏదో ఇంటర్వ్యూలో తనను తెలంగాణ గాంధీ అని చెప్పుకుంది, చాన్నాళ్లు చెప్పుకుని పడీ పడీ నవ్వుకున్నాం)…
విజయశాంతి అంటే టి.కృష్ణ బతికున్నరోజుల్లో టాప్… తరువాత పెద్ద జీరో… ఏవో పిచ్చి కమర్షియల్స్‌లో నటించవచ్చుగాక… అప్పటికే ఫేడవుట్… పేరుకు పొలిటిషయన్, కానీ ప్రజాజీవితం నిల్… ఏమనిపించిందో ఆమధ్య మహేశ్ బాబుతో ఓ సినిమా… అందులో ఓ పిచ్చి పాత్ర…
Ads
తను క్రెడిట్ తీసుకునే ప్రజాజీవితం ఏమిటి..? ఆ దిక్కుమాలిన పాత్ర ఏమిటి..? అది మరిచిపోలేదు కదా… ఇప్పుడు సన్నాఫ్ వైజయంతి అని మరో పిచ్చి పాత్ర… హహహ, రోజాలాగే అనిపించింది… ఆమె కూడా అంతే కదా… ప్రజాజీవితం అంటూనే ఆ వెకిలి, ఆ వెగటు, ఆ రోత, ఆ జుగుప్స జబర్దస్త్ స్టార్‌గా కొనసాగి, దాన్ని తన ఘనతగా చెప్పుకుంది ఫాఫం… ఇప్పుడు ఖాళీ దొరికింది కదా, మరో టీవీ షోలో అర్జెంటుగా దూరిపోయింది…
ఎస్, జయలలిత వంటి యూనియ్ కేరక్టర్లను వదిలేస్తే ఏ ఫిమేల్ స్టార్ వెండి తెర నుంచి నిజమైన ప్రజాజీవితంలోకి స్విచ్ ఓవర్ కాలేకపోయారు… రోజా, విజయశాంతి మాత్రమే కాదు… సరే… ఎప్పుడు విజయశాంతి ఇంటర్వ్యూ పత్రికల్లో వచ్చినా చదువుతూ భలే నవ్వుకునేవాళ్లం… వీళ్లు జాతికి దిగ్దర్శకులు అనే జాలితో కూడిన భావనతో…
రోజాంటీని, విజ్జమ్మను… పక్కన పెడితే…. తెర జీవితం, ప్రజా జీవితం నడుమ వీళ్లకు ఎలాగూ తేడా తెలిసే సోయి ఉండదు కాబట్టి, కనీసం ఈ సన్నాఫ్ వైజయంతి అనే సినిమా సంగతికొద్దాం… ఫస్ట్, మైనస్ అజనీష్… ఏదో కాంతారా పాటలు, బీజీఎం హిట్టయ్యాయి కదాని, థమన్- డీఎస్పీ రేట్లు ఎక్కువైపోయాయి, వాళ్లకు బుద్ధి చెబుతామని అజనీష్‌ను ఎంకరేజ్ చేస్తే… ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా కాస్త గురుతుండే పాట లేదు, బీజీఎం లేదు…
ఈ సినిమాలో కూడా అంతే… సినిమాకు పెద్ద మైనస్… పేరుకు పెద్ద హీరో, పెద్ద నటి కాబట్టి అబ్బో కల్యాణ్‌రామ్ ఊడబొడిచాడు, విజయశాంతి అదరగొట్టింది మీడియా పెయిడ్ ప్రచారాల్ని చూసి, చదివి తాత్కాలికంగా భ్రమల్లో పడి అనుకోవడమే గానీ అంత సీన్ ఏమీ లేదు… ఆ హీరోయిన్ ఎవరో పేరు గుర్తులేదు గానీ… కల్యాణరామ్‌కు భలే దొరుకుతారు ఇలాంటోళ్లు, కానీ హోప్‌లెస్… అఫ్‌కోర్స్, ఆ కేరక్టరైజేషన్ సున్నా…
ఏదో తెలుగు సినిమా అన్నాక ఓ హీరోయిన్ అంటూ ఉండి ఏడవాలిగా…!! కథ ఓ పాత చింతకాయ పచ్చడి… తల్లీకొడుకుల సెంటిమెంట్ సవాలక్ష సినిమాల్లో చూసిందే… పైగా ప్రతీ పావుగంటకూ ఓ యాక్షన్, ఫైట్లు… ఫైట్లు చేస్తే తప్ప తెలుగు హీరో ఎలివేట్ కాడు కదా… చివరకు కల్యాణ్‌రామ్ కూడా… లాజిక్కుల గురించి అడక్కండి, రౌరవాది నరకాల్లో పడిపోతారు…
ఈమాత్రానికేనా ఆ జూనియర్ నేను కాలర్ ఎగరేసుకుంటున్నాను అని చెప్పింది… ఫాఫం, తన కుటుంబం, తన నందమూరి గోత్రరక్షణ కోసం, రాజీపడి, ఏదేదో చెప్పకతప్పడం లేదు ఫాఫం… ఈ సినిమాలో ఏముందని వేల రూపాయలు తగలేసి థియేటర్‌కు రాావాలి మిత్రమా..? నిజాయితీగా చెప్పు ప్లీజ్… వీసమెత్తు కొత్తదనం ఉందా..? ఆ పిచ్చి ఫార్మాట్ సినిమా కాకపోతే…
ఓ తల్లి… పోలీస్… ఆ పంథాలోనే వెళ్తుంది, కొడుకు కూడా అలాగే తన పంథాలోనే రావాలని ఆశపడుతుంది… తనేమో జూనియర్ సినిమా జనతా సర్కార్ తరహాలో వెళ్తాడు… అదీ ఘర్షణ… పోనీ, అదైనా సరిగ్గా ప్రజెంట్ చేశాడా దర్శకుడు అంటే, అదీ చేతకాలేదు… ఫాఫం కల్యాణ్‌రామ్… అప్పుడెప్పుడో ఏదో పాత సినిమా… తరువాత ఆమధ్య బింబిసార… తరువాత..? ఇప్పుడు..? పాఠకులకు, ప్రేక్షకులకే వదిలేద్దాం…
Share this Article