.
Prasen Bellamkonda …… అతను ఏడ్వకపోయి ఉంటే నేను బాధపడేవాడ్ని. ఆ కన్నీరు జారకుంటే నేను చాలా నిరాశపడివుండేవాడ్ని. అతను దుఃఖాన్ని దిగమింగుతూ కన్నీటిని తుడుచుకోవడం నాకు భలే నచ్చింది.
ఆ దుఃఖం పేరు పసితనం. ఆ కన్నీటి పేరు బాల్యం. అతనలా ఏడ్వకపోతే పసితనానికి అర్ధమేలేదు. అతనలా ఏడ్వకపోతే బాల్యం అనే మాటలో సొగసే లేదు.
Ads
ఆ కన్నీళ్లు కాగజ్ కి కష్తి బారిష్ కి పానీ.
ఉరేయ్ వైభవ్ సూర్యవంశీ.. నువు తోపువిరా బుజ్జీ.
ఫోర్టీనియర్స్ ట్వంటి త్రీ డేస్ అంటే టీనేజ్ కావచ్చు. అది బాల్యం కాదు కౌమారం అని వాదించొచ్చు. తను ఒక పెద్ద అంతర్జాతీయ వేదిక మీద ఆడుతున్న మొదటి బంతి అనే భయాన్ని పక్కన పెట్టి ఒక దేశానికి ఆడే ఫాస్ట్ బౌలర్ని చల్ ఫుట్ అని సిక్స్ బాదివుండవచ్చు.
మూడో బంతికీ అంతే పొగరుతో అదే గతి పట్టించి ఉండవచ్చు. తన దేశం తరఫున అండర్ 19 ఆడుతూ 55 బంతుల్లో వంద కొట్టి ఉండవచ్చు. బీహార్ కోసం ఎడాపెడా 300 కూడా కొట్టి ఉండవచ్చు. అయినా ఆ దుఃఖం పేరు బాల్యమే. అయినా ఆ కన్నీటి పేరు పసితనమే.
ఈ కెమెరామన్లున్నారే మహా దొంగనాకొడుకులు. థర్డ్ ఎంపెయిర్ రీప్లేలో వైభవ్ కాలు గాల్లో ఉందని అర్ధం కాగానే అతని మొఖం మీద ఒక క్లోజప్ పెట్టేసాడు కెమెరామన్. కన్నీరు మాగుతున్న దృశ్యం అప్పుడే తెలిసిపోయింది. ఆ షాట్ వైభవ్ ను బవుండరీ లైన్ దాకా వెంటాడుతూనే ఉంది.
నిజానికి ట్వంటీ ట్వంటీ లెక్కల్లో 34 అదీ ఇరవై బంతుల్లో అంటే చిన్న స్కోరేమీకాదు. ఓపెనింగ్ భాగస్వామ్యం 85 అంటే కూడా అల్లాటప్పా కాదు. కనుక గెంతుకుంటూ చంకలెగరేసి వెళ్ళలేదు నువు. క్రీజ్ నుంచి డగవుట్ కి నడక నీకు కొన్ని వేల మైళ్ళు అనిపించింది చూడూ అదికదా నీ భవిష్యత్ ప్రయాణానికి అర్ధం.
కప్పు కొట్టలేనప్పుడూ, ఫైనల్ కు చేరలేని సెమిఫైనల్ ఓటమి వల్లా భోరుభోరుమన్న హార్భజన్లనూ వినోద్ కాంబ్లీలనూ చూసాం. క్రీడా మైదానాల్లో పరాజయాలు పారించిన అనేకానేక దుఃఖనదుల్నీ చూసాం. అక్కడలేనిదీ ఇక్కడ ఉన్నదీ పసితనం. ముక్కుపచ్చలారనితనం. నూనూగు కూడా మొలవనితనం. చిదిమిన పాల్గారుతనం.
A prodigy with warriors heart. సూర్యవంశీ.. ముందు ముందు నీకోసం చాలా మంది ఏడుస్తారు. ముందు ముందు నిన్ను చూసి చాలా మంది ఏడుస్తారు. నీ కన్నీరు వృధాపోదు….
Share this Article