.
ప్రవస్తి ఆరాధ్య… చిన్నప్పటి నుంచీ సింగింగ్ కంపిటీషన్లలో పాల్గొంటోంది… పలు షోలలో కప్పులు కొట్టింది… ఎంత ఎదిగినా సరే… మరీ స్మిత సబర్వాల్ తరహాలో తత్వంలో మాత్రం పరిపక్వత రాలేదు…
తాజా వివాదం చూస్తుంటే అదే అనిపించింది… ముందుగా విషయం ఏమిటంటే..? ఈటీవీ పాడుతా తీయగా రజతోత్సవ ఎడిషన్‌లో ఆమె బలమైన పోటీదారు… కానీ తొలి దశల్లోనే ఎలిమనేట్ అయిపోయింది…
Ads
మనసు కుతకుతా ఉడికిపోయింది ఆమెకు… వెంటనే ట్వీట్ కొట్టింది… జడ్జిల సిఫారసులు, రికమెండేషన్లు, ప్రాపకం ఉంటే తప్ప ఈ పోటీల్లో గెలవలేం, కాబోయే కంటెస్టెంట్లు, గాయకులు గమనించాలీ అని…
అత్యంత చెత్తా ట్వీట్… ఎందుకో తెలుసా..? ఆ ట్వీట్‌లో చాలా శాతం నిజమే కావచ్చుగాక… కానీ గతంలో సూపర్ సింగర్ వంటివి తను గెలిచినప్పుడు కూడా ఇవే పనిచేాశాయని అంగీకరిస్తున్నదా ఆమె..? అంతకన్నా దిగజారుడుతనం మరొకటి లేదు…
కాకపోతే… తన మాటలో ఒక నిజం మాత్రం ఉంది… కాకపోతే అది మనం ఎలిమినేటైనప్పుడే గుర్తుకురావడం ఓ ఐరనీ… పైగా అన్నీ తెలిసీ పిచ్చి వాదనలకు, శుష్క విశ్లేషణలకు… పరనిందకు దిగడం తప్పు, తప్పున్నర… తన పరిపక్వత లేనితనం, నిజాల్ని సహించలేని అపరిణతి…
నిజానికి ఏ టీవీ షో అయినా అంతే కదా… బిగ్‌బాస్ వంటి అత్యంత ఖరీదైన రియాలిటీ షోతోపాటు అన్నీ అంతే… రకరకాల లెక్కలుంటాయి… వోటింగ్ అనే భ్రమాత్మక ప్రపంచం ఉంటుంది, అదీ మేనేజ్‌డే… కేవలం ఎస్పీ బాలు ఈ పాడుతా తీయగా నిర్వహించినప్పుడు మాత్రమే ఆ షోలో ఈ పిచ్చి లెక్కలు లేవు… అది అల్టిమేట్…
కానీ మొదట్లో మాటీవీలో సూపర్ హిట్టయిన సూపర్ సింగర్ తరువాత ఘోరంగా భ్రష్టుపట్టిపోయింది… జీతెలుగు పరిగమప గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్… మొన్నటికిమొన్న మంచి ప్రతిభ ఉన్నవాళ్లను కాదని అభిజ్ఞ అనే యూఎస్ కంటెస్టెంట్ విన్నర్‌ను చేశారు… అంతా కోటి రాగద్వేషాల మహిమ…
నిజానికి ఆమె అంతకుముందు థమన్, గీతామాధురి రాగద్వేషాల మీద ఆధారపడిన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోలో ఆడిషన్లలోనే ఫెయిల్, తరువాత ఏం జరిగిందో లేటరల్ ఎంట్రీ… మూడే వారాలకు ఎలిమినేట్… మరి థమన్, గీతామాధురి అంటే మజాకానా..?
ఈ సోకాల్డ్ కృత్రిమ సంగీత శిక్షణ ఇచ్చే రామాచారి ఈసారి నజీరుద్దీన్ విజేత కావాలనుకున్నాడు… నేరుగా తన కొడుకే స్వయంగా వచ్చి, ఎంట్రీ ఇప్పించాడు, గీతామాధురి ఆ మాయలో పడిపోయింది, తనూ రామాచారి శిష్యురాలే కదా… సహజంగానే వెంటనే థమన్ పడిపోయాడు… ఎంత బాగా పర్‌ఫామ్ చేసినా సరే ఆ నజీరుద్దీనే గెలిచాడు… మార్కులు, లెక్కలు అన్నీ బోగస్… ఫేక్… అసలు ఆ సీజన్ విజేత కావల్సింది కీర్తన…
తను ఎక్సలెంట్ గాయని… చిన్న వయస్సులోనే అమోఘ ప్రతిభతోపాటు, అపరిమిత స్థితప్రజ్ఞత కలిగిన అమ్మాయి… థమన్‌లు, గీతామాధురిల గురించి తెలిసిందే కదా… ఆమె విజేత కాలేకపోయింది… జడ్జిలనే జాలిగా చూస్తూ చిరునవ్వుతో నిష్క్రమించింది… అదీ పరిపక్వత అంటే…
ఐ ఛాలెంజ్… ఇదే గీతామాధురి, ఇదే సునీత ఆ కీర్తన ప్రతిభ ముందు వెలతెలా… ప్రత్యేకించి పరిపక్వత… సరే, ప్రవస్తి విషయానికి వద్దాం… నిజానికి పాడుతా తీయగా షోను కూడా ఓ వారసత్వ షోగా టేకప్ చేసిన కొత్తలో ఎస్పీ చరణ్ తడబడ్డాడు… తరువాత నేర్చుకున్నాడు… ఇప్పుడు గాడినపడింది… బాగా హోస్ట్ చేస్తున్నాడు…
మొదట్లో విజయప్రకాష్, ఆస్కార్ బోస్, ఈటీవీ ఆస్థాన జడ్జి సునీత ఉండేవాళ్లు మొదట్లో… ఇప్పుడు విజయప్రకాష్‌ను తరిమేశారు… కీరవాణిని తీసుకొచ్చారు… తనకే అర్థం కాని ఏదో కలికిలి భాషలో ఏవేవో చెబుతుంటాడు తను…
కానీ ఇదే ప్రవస్తి ఓ పాట పాడితే… బాగానే పాడావుగానీ పలుచోట్ల భలే కవర్ చేశావు తల్లీ అన్నాడు… అప్పుడే అర్థమైంది ఆమె ఎలిమినేట్ కాబోతోందని… అదంతే… దానికి ప్రవస్తి ఉడికిపోయి, ఉలిక్కిపడి, కుళ్లుకుని… ఓ ట్వీట్ కొట్టింది…
సునీత నన్ను సహించేది కాదు, పెళ్ళిళ్ళలో పాడేవాళ్ళు అసలు గాయకులే కాదు అంటాడు కీరవాణి, చంద్రబోస్ కుంటి సాకు చెబుతాడు అని ప్రవస్తి అంటోంది… కీరవాణి వ్యాఖ్యలు నిజమే ఐతే అదొక దరిద్రం… జాతీయ అవార్డు విజేత మాళవిక కూడా పెళ్ళిళ్ళలో పాడుతుంది, సో వాట్, ఎవరి జీవన అవసరాలు వాళ్ళవి… ఇలా తీసిపడేయడం నికృష్టం…
మరొకటీ చెబుతోంది ఆమె… పొట్టి బట్టలు, కావాలని కుళ్లు జోకులు, డాన్సులు, బాడీ షేమింగు చిల్లరగా మారుతున్నాయట…
ఆమె ఆ ట్వీట్ కొట్టగానే కొందరు విరుచుకుపడ్డారు… నిజంగానే చిల్లర స్పందన ఆ పిల్లది… కావాలని మా ఎక్స్ కంటెస్టెంట్లు ఫేక్ ట్వీట్ ఖాతాలు ఓపెన్ చేసి, నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు, కాల్ చేస్తే ఎత్తరు, వాళ్ల గొంతు నేను గుర్తుపడతానని భయం వాళ్లకు అనంటోంది ఆమె…
ఈ పిచ్చి ప్రయాసను పాట పాడటంలో ప్రదర్శిస్తే బాగుండేది… ప్రవస్తీ, ఇన్నాళ్లూ కాస్త నీ మెరిట్ మీద సదభిప్రాయం ఉండేది… ప్చ్, కోల్పోయావు… మెంటల్ మెచ్యూరిటీ, సంయమనం లేని ఏ కళాకారుడైనా జీవితంలో ఎదగలేడు… ఆ నిజం నీకు తెలియదు ఫాఫం..!!
(నిజానికి పిచ్చి టీవీ చానెళ్ల సింగింగ్ కంపిటీషన్లలో ఉన్నంతలో ఆ ఈటీవీ పాడుతా తీయగా షోయే బెటర్… కాకపోతే ప్రవస్తి చెప్పినట్టు చంద్రబోస్, సునీత, కీరవాణి పవర్‌ఫుల్ కదా… ప్రవస్తి కెరీర్ క్లోజ్… పగ ఉంటుందని తనూ సందేహిస్తోంది… సిద్దపడే టీవీల ముందుకొచ్చింది…)
.
.
Share this Article