.
ఓ వార్త కనిపించింది… విజయశాంతి అఖండ-2లో కనిపించబోతోంది అని..! బాలయ్యకు ఈ సినిమా మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి… సేమ్ అఖండలోలాగే ఇందులో కూడా డ్యుయల్ రోల్ అట…
బోయపాటి ఫుల్ కాన్సంట్రేషన్ అట… విజయశాంతి కూడా ఈ టీమ్‌లో చేరితే ఫుల్ బజ్ వచ్చి సినిమా అఖండకన్నా హిట్ అవుతుందని ఆశిస్తున్నారట… కానీ..?
Ads
విజయశాంతి ప్రస్తుత ఆలోచన విధానాన్ని బట్టి చూస్తే ఈ వార్తకు అంత సీన్ లేదని తేలిపోతుంది… ఎందుకంటే..? ఈమధ్య అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ప్రమోషన్ కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ సీనిమా టీమ్‌తోపాటు…
అందులో ఇంటర్వ్యూయర్ అడుగుతోంది… ‘‘చిరంజీవితో 19, బాలకృష్ణతో 17 సినిమాలు చేశావట, మళ్లీ చేస్తావా..? ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు… చెరో సినిమా చేసి, తరువాత మంత్రివైపోయి ఆ బిజీలో తిరుగు’’ అని… దాన్ని మరో మాట లేకుండా కొట్టిపడేసింది విజయశాంతి… (అసలు ఆమెకు వేసిన ఆ ప్రశ్నే అసంబద్ధం అనిపించింది)…
‘‘చాన్స్ లేదు, ఎమ్మెల్సీగానే టైమ్ సరిపోదు…’’ అని చెప్పింది… ఎమ్మెల్సీ ఎలాగూ అయిపోయింది, మంత్రిని కూడా అవుతాననే నమ్మకం ఉన్నట్టుంది… ఏమో, ఢిల్లీ భరోసా ఇచ్చిందేమో కూడా..!
నిజానికి అది కాదు సమస్య… అప్పట్లో ఏదో సినిమాకు సంబంధించి చిరంజీవికీ విజయశాంతికీ నడుమ దూరం పెరిగింది… ఇప్పటికీ ఆ దూరం అలాగే ఉన్నట్టుంది… సో, టైమ్ పుష్కలంగా ఉన్నాసరే చిరంజీవితో ఆమె సినిమా చేయదు… చిరంజీవి కూడా పెద్దగా ఎంటర్‌టెయిన్ చేయడు…
ప్లస్… వాళ్లతో ఈక్వల్ స్టేటస్ అనుభవించిందామె ఓ దశలో… ఇప్పుడు ఎలాగూ స్టెప్పులు గట్రా రొటీన్ హీరోయిన్ వేషం ఎలాగూ వేయదు… వాళ్లకు తల్లిగానో అత్తగానో అసలు చేయదు… తనకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న ఇతరత్రా రోల్ ఉంటే తప్ప చేయదు… చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో వాళ్లు తప్ప మరో ఈక్వల్ స్టేటస్ రోల్ ఇతరులకు ఉండదు… సో, విజయశాంతి ఒప్పుకోదు…
అప్పట్లో మహేశ్‌బాబుతో ఓ సినిమా చేసింది, ఇప్పుడు కల్యాణరామ్‌తో మరో సినిమా… ఇవి అంగీకరించడానికి ముందు ఆమె ఎమ్మెల్సీ కాదు, మంచి రోల్స్ దొరికితే సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిద్దామనే అనుకుంది… కానీ ఇప్పుడు మారిపోయింది…
ఆల్రెడీ తను తెలంగాణ ప్రభుత్వంలో ఓ కీలక రోల్‌కు వచ్చేసినట్టే అనుకుంటోంది… ఇదే సినిమా సక్సెస్ ఫంక్షన్‌లో మాట్లాడుతూ… ‘‘దుష్టశక్తులు ఈ సినిమా మీద దుష్ప్రచారం చేస్తున్నాయి… సినిమాను చంపేసే ఈ కుట్రల్ని నేను క్షమించను’’ అని హెచ్చరించింది… ఏ హోదాలో క్షమించదు, ఏం చేస్తుంది..? ఏమో, తను ఏమనుకుంటుందో మరి..!!
Share this Article