.
Paresh Turlapati ……. తొక్కేయడం.. కాస్ట్ కౌచింగ్.. ప్రోత్సాహం.. ఈ మూడూ డిఫరెంట్ సబ్జెక్ట్స్
అన్ని రంగాల్లో ఏదో సందర్భంలో ఎవరో ఒకరు ఈ మూడు అనుభవాలను ఎదుర్కొనే ఉంటారు
అయితే మొదటి రెంటి వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పడితే మూడోది పాజిటివ్ లైన్ లో ఉంటుంది
దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో మొదటి రెండు ప్రథమ స్థానాలను ఆక్రమిస్తున్నాయి
ఇప్పుడు పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్లో జడ్జీలు సింగర్ సునీత.. కీరవాణిలు తనకు అన్యాయం చేశారని.. కావాలనే తనను తొక్కే ప్రయత్నం చేశారని వర్ధమాన సింగర్ ప్రవస్తి ఆరాధ్య ఓ వీడియో రిలీజ్ చేసి తన ఆవేదనను వెళ్లబోసుకున్నారు
Ads
***
దీని గురించి మరింత చెప్పుకునే ముందు మా విజయవాడలో జరిగిన ఓ తొక్కలో.. సారీ.. తొక్కే ప్రయత్నం గురించి చెప్తా
విజయవాడ వన్ టౌన్ లో హోల్ సేల్ షాపులు ఉండేవి
ఓ కాంప్లెక్స్ లో వేరు వేరు సామాజిక వర్గాలకు చెందిన షాపులు ఎదురెదురుగా ఉండేవి
ఇద్దరి వ్యాపారాలు ఒకటే
అంచేత కస్టమర్లు తమ షాపుకి వచ్చినప్పుడు ఎదుతోడి ఫ్యామిలీ గురించి నీచంగా చెప్పేవారు
వాడ్ని తొక్కేయాలని వీడు
వీడ్ని తొక్కేయాలని వాడు
కస్టమర్లు మాత్రం ఈ ఇద్దరి తొక్కుడు బిళ్ళ ఆటను ఎంజాయ్ చేస్తూ ఆ పోటీలో రూపాయి తక్కువకే సరుకులు కొని బయట పడేవాళ్ళు
అలా ఈ తొక్కుడు బిళ్ళ ఆటల గురించి మొదటిసారి నాకు అప్పుడు తెలిసింది
***
ఇది వ్యాపారాలు.. రాజకీయాలు.. సినిమా రంగం.. ఇలా అన్ని రంగాల్లో ఉంటుంది
ఈ తొక్కుడును తట్టుకుని నిలబడి కొందరు ఎదిగితే మరికొందరు తట్టుకోలేక నిశ్శబ్దంగా నిష్క్రమిస్తారు
ఆ మధ్య ఓ తెలుగు యువ నటుడు మరో బాలీవుడ్ యువ హీరో ఈ తొక్కుడు బాధ తట్టుకోలేకే జీవితాలు ముగించుకున్నారు
ఈ తొక్కేయడం అనే జాడ్యం జెలసీ అనే కాంప్లెక్స్ నుంచి ఉద్భవిస్తుంది
అదేదో విశ్వనాథ్ సినిమాలో తనకన్నా శిష్యుడు ఎదిగిపోవడం గురువుకు నచ్చదు
అక్కడ్నుంచి వాడ్ని తొక్కేయాలని ప్రయత్నిస్తూ గురువు పాతాళానికి దిగజారిపోతాడు
నేటి మన సమాజంలో ఇలాంటి గురువులు చాలామంది మనకు తగులుతారు
మనకన్నా బాగా పాడుతున్నాడనో.. మనకన్నా బాగా రాస్తున్నాడనో.. మనకన్నా ఎదిగిపోతున్నాడనో జెలసీ పెంచుకునేవాళ్ళు మన చుట్టూ ఎంతమంది లేరూ?
నిజానికి వాళ్ళు మన మీద జెలసి పడుతున్నారంటే మనం సంతోష పడాలి
ఎందుకంటే మనలో అంతో ఇంతో టాలెంట్ ఉండబట్టే కదా వాళ్ళు కుళ్ళుకుంటుంది అని ప్రొసీడ్ అయిపోవాలి అన్నమాట
వాళ్లలో ఇన్ఫెరియరిటీ కాంప్లెక్స్ మొదలైంది అనటానికి ఉదాహరణ ఎదుటివాడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం
అందుకే ఆటోల వెనక ‘ నన్ను చూసి ఏడవకురా ‘ అని రాస్తారు
మనలోని గొప్పతనాన్ని ప్రశంసించాలంటే కావాల్సింది పెద్ద స్థాయి కాదు.. పెద్ద మనసు అని తెలుసుకోలేరు
ఇక సినిమా రంగంలో హీరోయిన్లు ఎదుర్కొనే ప్రధాన సమస్య క్యాస్ట్ కౌచింగ్
వాడుకుని అవకాశాలు ఇవ్వడం అన్నమాట
కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని కొందరు మౌనంగా లొంగిపోయి ఎదగ్గా మరికొందరు నో చెప్పి అక్కడే ఆగిపోతారు
బయటపడే దాకా ఇలాంటి సంఘటనలు ఎన్నో మన సమాజంలో జరుగుతూ ఉంటాయి
***
ఇప్పుడు అలాంటి సంఘటనే ఈ అమ్మాయి విషయంలో జరిగింది
2024 లో ఈ అమ్మాయి స్టార్ మా సింగర్ పోటీల్లో పాల్గొని ఫైనల్లో సూపర్ సింగర్ అవార్డ్ గెలుచుకుంది
కాబట్టి ఈ అమ్మాయి టాలెంట్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు
తాజాగా పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సింగర్ సునీత.. సంగీత దర్శకుడు కీరవాణి తనను కావాలనే తొక్కేసారని ప్రవస్తి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
ఇందులో జడ్జీలు ఉద్దేశపూర్వకంగా ఆ అమ్మాయికి అన్యాయం చేశారన్న ఆరోపణల కన్నా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్లు ఎక్స్పోజింగ్ చేయమని వత్తిడి చేశారని తెలిసి నన్ను ఎక్కువ బాధించింది
టీవీ షోలలో విలువలు ఎంతకు దిగజారిపోతున్నాయి ?
ప్రతిభను వెలికి తీయాల్సిన షోలలో స్కిన్ షోల కోసం వత్తిడి చేయడం ఎంత దారుణం?
ఈ విషయంలో సింగర్ ప్రవస్తి ఆరాధ్య కు న్యాయం జరగాలని కోరుకుందాం
***
ఇప్పుడు ప్రోత్సాహం గురించి చెప్పుకుందాం
నేను ఎఫ్బిలో ఈ మాత్రం రాస్తున్నానంటే తొక్కేవాళ్ళ కన్నా అదృష్టవశాత్తూ నన్ను ప్రోత్సహించేవాళ్లు ఎక్కవ ఉండటం కారణం
చంద్రబోస్, కీరవాణి వంటి ఆస్కారులు, దీటైన సునీతలు లేకపోవడం కూడా… ఇక పాడుతా తీయగా ప్రోగ్రామ్ విషయానికి వస్తే ఈ ప్రోగ్రామ్ కి లెజెండ్రీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు న్యాయ నిర్ణేత
ఈటీవీ పాడుతా తీయగాకు ఆయన పేరు అనౌన్స్ చేయగానే నాకు ఆశ్చర్యం వేసింది
నా చిన్నప్పట్నుంచి వెండి తెర మీద గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అనే టైటిల్ చూసుకుంటూ ఆయన పాటలు వింటూ పెరిగినవాడిని
అటువంటి మహానుభావుడు ఈ ప్రోగ్రామ్ వల్ల భవిష్యత్తులో మరింత మంది గాయకులు తయారయ్యి ప్రొఫెషన్ పరంగా తనకు ఇబ్బందులు వస్తాయేమో అని కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నారంటే అందుకు ఒకే ఒక కారణం ఉంది
కాన్ఫిడెన్స్
Yes తన గాత్రం మీద తనకున్న నమ్మకం అది
అందుకే ఆయన పాడుతా తీయగా ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది గాయనీ గాయకుల ప్రతిభను వెలికితీశారు
ప్రోత్సహించారు
ఈ రోజు ఇంతమంది వర్ధమాన గాయనీ గాయకులు తమ ప్రతిభను చూపిస్తున్నారంటే అది బాలూ గారి ప్రోత్సాహమే
That is Great Balu
— by పరేష్ తుర్లపాటి
Share this Article