.
ప్చ్, అల్లు అర్జున్ నటించిన పుష్ప2 టీవీ ప్రసారానికి మరీ 12.6 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి, 1800 కోట్ల సినిమా ఏమిటి…? ఇంత పూర్ రేటింగ్ ఏమిటి అనే వార్త ఒకటి కనిపించింది…
ఎందుకయ్యా అంటే… బన్నీ సినిమా అంటేనే టీవీ రేటింగులకు దడ… ఇంతకు ముందు పుష్ప-1కు 22.5, అల వైకుంఠపురంలో 29.5, దువ్వాడ జగన్నాథం 21.7 వచ్చాయి, ఏవి తల్లీ నిరుడు కురిసిన రేటింగ్ సమూహములు అని ఆ వార్త సారాంశం…
Ads
అన్నింటికీ మించి వెంకటేష్ తాజా హిట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కు 18 రేటింగ్స్ వచ్చాయి, దానికన్నా పుష్ప-2 తీసిపోయిందా అనేది మరో విమర్శ… నిజాలు వేరు… ఓటీటీల్లో స్ట్రీమింగుకు ముందే ఓ మార్కెటింగ్ ప్లాన్‌తో వెంకటేష్ సినిమా టీవీ ప్రీమియర్ ప్రసారం చేస్తే ఖచ్చితంగా ఎక్కువే టీఆర్పీలు వస్తాయి కదా…
పుష్ప-2 ఆల్రెడీ థియేటర్లలో చూసీ చూసీ, ఓటీటీల్లో చూసీ చూసీ ఇక టీవీల్లో ఎవరు చూస్తారు..? పైగా ఓటీటీలో సినిమా ఉన్నాక, గంటల తరబడీ టీవీ ముందు కూర్చుని, ఆ విపరీతమైన యాడ్స్ ఎవడు భరిస్తాడు..? పైగా వాడు చెప్పిన టైమ్‌కే టీవీ ఎదుట కూర్చోవాలి… సో, అవన్నీ మైనస్…
అసలు పెద్ద పెద్ద తోపు సినిమాలకే 6, 7 రేటింగ్స్ రావడం లేదు, పుష్ప-2 సినిమాకు ఈమాత్రం 12.6 రావడం గ్రేటే… అదీ బ్లాక్ బస్టర్ కాబట్టి ఈమాత్రమైనా జనం చూశారు, ఓటీటీ సౌకర్యాలు లేనివాళ్లు… అసలు విషయానికి వస్తే, ప్రస్తుతం శాటిలైట్ రైట్లకు భారీ రేట్లు పెట్టేవాడు మూర్ఖుడు…
నిజానికి రెండుమూడు వారాలుగా టీవీ రేటింగ్స్ బాగా పడిపోయాయి… చివరకు టీవీ చానెళ్లను పోషించే సీరియళ్ల రేటింగులు కూడా 30, 40 శాతం పడిపోయాయి… కావచ్చు, ఐపీఎల్ ఎఫెక్ట్ కొంత ఉండవచ్చుగాక… కానీ స్థూలంగా టీవీక్షణమే పడిపోతోంది… కొన్ని ఇళ్లల్లో అసలు టీవీ ఆన్ చేయడం లేదు… ట్యాబులు, మొబైళ్లు, ల్యాప్‌టాపుల్లోనే ఓటీటీలు, వెబ్ సీరీస్ వీక్షణం…
సీరియళ్ల రేటింగ్స్ విషయానికివస్తే… ఒకప్పుడు స్టార్ హీరోల ప్రీమియర్ ప్రసారాలను కూడా బీట్ చేసేది కార్తీకదీపం… దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ క్రేజ్ అలా ఉండేది… ఎప్పుడో అయిపోవాల్సిన కథను ఈ రేటింగుల డబ్బుతో, కక్కుర్తి పడి, కథను నానా ట్విస్టులూ తప్పి, భ్రష్టుపట్టించి చివరకు ఎలాగోలా ముగించిన నిర్మాత… అర్జెంటుగా కార్తీకదీపం సెకండ్ అని స్టార్ట్ చేశాడు…
అదే దీప, అదే నిరుపమ్… కానీ కథ వేరు… అదెవరికీ పెద్దగా ఎక్కడం లేదు… స్టార్‌మా ఎన్ని వేషాలు వేసినా సరే, కొన్నాళ్లు టాప్‌లో ఉండి, ఇప్పుడు పడిపోయింది… ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ దాన్ని కొట్టేసింది… తరువాత ప్లేస్ గుండె నిండా గుడిగంటలు… జీ సీరియల్స్ అయితే 6 రేటింగ్స్ దాటడం లేదు…
పడమటి సంధ్యారాగం, చామంతి, మేఘసందేశం కాస్త బెటర్ రేటింగ్స్… ఈటీవీ గురించి చెప్పడానికేమీ లేదు… వెరసి… టీవీక్షణం బాగా పడిపోతున్న నేపథ్యంలో… గతంలోని టీఆర్పీలు ఇకపై రావడం అసాధ్యం… అదీ చెప్పదలిచింది… ఈవెన్, ఐపీఎల్ కూడా స్మార్ట్ ఫోన్లలో అధిక వీక్షణం…!!
Share this Article