.
ఇలాంటి కేసులు వింటున్నవే… ఒకరి బదులు ఇంకెవరో ఇంటర్వ్యూలలో పాల్గొనడం, టెక్ కంపెనీల హెచ్‌ఆర్ వింగ్స్‌ను బోల్తా కొట్టించడం, జాబ్స్ కొట్టేయడం…
తాజాగా ఉద్యోగులు, ఉద్యోగార్థులు, కంపెనీల హెచ్‌ఆర్ ప్రతినిధులు బాగా యాక్టివ్‌గా ఉండే లింక్డ్‌ఇన్‌లో ఇలాంటిదే ఓ కేసు బాగా డిబేట్‌లోకి వచ్చింది…
Ads
మామూలుగా ఇలాంటి ‘ఫ్రాడ్’ కేసుల్లో కంపెనీలు గనుక పసిగడితే ఉద్యోగం నుంచి తీసేస్తాయి… కానీ ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు… అదీ విశేషం… ఇలాంటి ఫ్రాడ్‌స్టర్లూ బహుపరాక్… విషయం ఏమిటంటే…
తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాపా సాయి ప్రశాంత్… తమిళ చిత్రం డ్రాగన్ చూసి ప్రేరణ పొందాడట… అఫ్‌కోర్స్, తన సర్కిళ్లలో వినిపించే ఇంటర్వ్యూ మోసాల గురించి వినీ వినీ…
ప్రశాంత్ ఓ ప్రముఖ జాబ్ పోర్టల్ ద్వారా తన దరఖాస్తు పంపించాడు… ఆ తరువాత, సంప్రదా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ అనే రిక్రూట్‌మెంట్ సంస్థ అతని క్రెడెన్షియల్స్‌ను వెరిఫై చేసింది… వర్చువల్ ఇంటర్వ్యూకు ప్రశాంత్ బదులుగా అతని స్నేహితుడు హాజరయ్యాడు… ఆ ఇంటర్వ్యూలో మంచి ప్రదర్శన వల్ల, 2025 జనవరి 20న ప్రశాంత్‌కు ఇన్ఫోసిస్ నుండి ఉద్యోగ ఆఫర్ లెటర్ లభించింది…
ప్రశాంత్ జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులే గడిచాయి.., అతని అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ బయటపడ్డాయి… స్పష్టమైన లోపాలు కనిపించాయి… ఇది ఇన్ఫోసిస్ మేనేజ్‌మెంట్‌కు అనుమానం కలిగించింది… వారు ఇంటర్వ్యూలో తీసిన స్క్రీన్‌షాట్లను పరిశీలించి, ప్రస్తుతం ఉన్న వ్యక్తి రూపంతో పోల్చి చూసినప్పుడు స్పష్టంగా మోసం బయటపడింది… కట్ చేస్తే…
దీంతో, ఇన్ఫోసిస్ వెంటనే ప్రశాంత్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. అంతేకాక, అడుగోడీ పోలీస్ స్టేషన్, బెంగళూరులో ఆయనపై ఫిర్యాదు చేసింది… ప్రస్తుతం ప్రశాంత్ పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద, అలాగే భారతీయ న్యాయ సంహిత (Sections 318, 319) ప్రకారం మోసం (Cheating) మరియు వ్యక్తి మార్పిడి (Impersonation) ఆరోపణలపై కేసు నమోదైంది…
ఈ ఘటనపై సోషల్ మీడియాలో, ప్రొఫెషనల్ నెట్‌వర్క్స్‌లో పెద్ద ఎత్తున చర్చలు జరగుతున్నాయి. ఈ వ్యవహారం ఉద్యోగ నియామకాల్లో నైతిక విలువల ప్రాధాన్యతను మరోసారి రుజువు చేసింది. కొందరు నెటిజన్లు, “తక్కువ సమయంలో విజయం సాధించాలన్న ఆశ వల్ల, యువత ఇటువంటి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడటం ప్రమాదకరం” అని అభిప్రాయపడుతున్నారు…
అవును… “తప్పుడు మార్గాల్లో విజయాన్ని పొందడం తాత్కాలికమే. నిజాయితీ, ప్రతిభ మాత్రమే దీర్ఘకాల విజయం పొందిస్తాయి…”
Share this Article