మమతా బెనర్జీ ఫాఫం… తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని నమ్ముకోకుండా…. మధ్యలో వచ్చిన ఆ ప్రశాంత్ కిషోర్‌ను నమ్ముకుని మునిగిపోబోతోందా..? ప్రశాంత్ కిషోర్ బయటికి కనిపించేది వేరు… లోలోపల బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్నాడా..? ఇప్పుడు మమతను పాతాళానికి దిగజార్చి ఇక పంజాబ్ వైపు వెళ్లిపోయాడా..? దేశం మొత్తమ్మీద బీజేపీకి మింగుడపడని పంజాబ్‌ను బీజేపీ ఈ ప్రశాంత్ కిషోర్ సాయంతోనే, శల్యసారథ్యం మీద నమ్మకంతోనే గెలవబోతోందా..? అర్బన్ నక్సల్ తరహా మేధావులంతా ఎడాపెడా సుదీర్ఘ వ్యాసాలు రాసేస్తున్నారు… మమత గెలిస్తే మోడీకి ఇక సమాధి అట… ప్రత్యామ్నాయ దేశనాయకురాలు కాబోతోందట…. అక్కడికి లెఫ్ట్, కాంగ్రెస్ ఆమెకు జేజేలు పలకడానికి, ఆమె పల్లకీ మోయడానికి సిద్ధమైనట్టు… సరే, మన డొల్ల మేధావుల సంగతి వదిలేస్తే… అసలు మమత గెలుస్తుందా..?
కాలికి కట్టు కట్టింది… మన రాజకీయాల్లో అంతే, విరిగితేనే రోజుల తరబడీ సిమెంట్ పట్టీలుండవ్… అవసరాన్ని బట్టి పట్టీలుంటయ్… అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు మమత, తాజాగా షర్మిల… అందరూ అంతే… జనమే కదా ఎడ్డి గాడిదకొడుకులు… వాళ్ల దృష్టిలో…!! ఒకప్పటి సివంగి, సీపీఎంను సమాధి చేసిన ఫైటర్… ఇప్పుడు ఓ సగటు రాజకీయ నాయకురాలిగా ఎంత దిగజారాలో అంత దిగజారింది… అంతా ప్రశాంత్ కిషోర్ మాయ…. బీజేపీ ఏమైనా శుద్ధపూసా అనడక్కండి… ఎందుకంటే..? మోడీషాల మీద అందరికీ మొదటి నుంచీ ఓ అసెస్మెంట్ ఉంది… ఎటొచ్చీ మమతే మరీ ఇంత దిగజారిపోయిందేమిటా అనేదే అందరి ఆశ్చర్యం…
సరే, విషయానికొస్తే… బెంగాల్లో మమత గెలుస్తుందా..? మోడీ గెలుస్తాడా..? దేశమంతా మోడీని వ్యతిరేకించే సీపీఎం బెంగాల్లో మాత్రం బీజేపీ గెలిచినా సరే, మమత మట్టిగొట్టుకుపోవాలని ఆశిస్తోంది… ఆ పార్టీ అంతే… మరో పది రాష్ట్రాలు చేజారినా సరే, బెంగాల్లో అధికారం కావాలని కోరుకుంటోంది బీజేపీ… తద్వారా అది దేశరాజకీయాలపై సాధించబోయే నైతిక పైచేయి అంతా ఇంతా కాదు… కేసీయార్లు, జగన్లూ, స్టాలిన్లూ గట్రా తెలుసుకోవాలని కదా బీజేపీ భావన… నిజానికి ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం, మరి ఇప్పటివరకూ జరిగిన పోలింగు దశల్లో ఎవరిది పైచేయి… దాదాపు 25 వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న సట్టా బజార్‌ను అడగాలి… అది రకరకాల సోర్సుల ద్వారా ట్రెండ్ సేకరిస్తుంది, క్రోడీకరిస్తుంది… బెట్టింగ్ రేట్లు ఫిక్స్ చేయడానికి అవే ఆధారం… మరి సట్టా బజార్ ఏమంటోంది…?
Ads
హిందూ బిజినెస్ లైన్ ఓ స్టోరీ వేసింది… ప్రస్తుతానికి ఇంట్రస్టింగు… డబ్బాలు విప్పాక రాజెవడో, పరాజితుడెవడో… కానీ ప్రస్తుత సట్టా బజార్ సేకరించిన, క్రోడీకరించిన, తమ బెట్ రేట్లు ఫిక్స్ చేసిన తీరును బట్టి ….. మమత ఓడిపోబోతోంది… అయితే అందులోనూ సందిగ్ధం ఉంది… మరీ అస్సాం, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు తరహాలో ఏకపక్షంగా అదీ చెప్పలేకపోతోంది… అందుకే కాస్త వెసులుబాటు ఉంచుకుంది… మమత, మోడీ గెలుపూఓటముల నడుమ రకరకాల రేట్లతో జూదం ఆడుతోంది… దాని వృత్తే అది కదా… స్థూలంగా అది చెప్పేది ఏమిటంటే…. మమతకు గడ్డుకాలం అని… కానీ ఫీల్డ్ సర్వే సంస్థలు చెప్పేది వేరు… చావుదప్పి కన్ను లొట్టపోయినట్టు మమత అధికారాన్ని నిలుపుకుంటుందీ అని… నిజమేమిటో తేలాలి… అయితే మరి మిగతా రాష్ట్రాలు..? ఇదీ సట్టా బజార్ అంచనా…
అసలు అస్సాంలో కాంగ్రెస్‌ను సట్టా బజార్ పరిగణనలోకే తీసుకోవడం లేదు… అంటే దాన్ని ఓ పోటీదారుగా పరిగణించడం లేదు… ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పతనానికి మరో మెట్టును నిర్మించబోతున్నట్టు లెక్క… అసలు బీజేపీ వాసనే లేని పుదుచ్చేరిలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని మరో అంచనా… అదీ అసలు విశేషం… అఫ్ కోర్స్, అక్కడ అన్నీ అమ్మకాలు, కొనుగోళ్ల దందాయే కదా… వదిలేద్దాం… ఇక కేరళ, తమిళనాడుల్లో బీజేపీకి నో చాన్స్… కేరళలో ఎల్డీఎఫ్, తమిళనాడులో డీఎంకే కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోతున్నాయట… అఫ్ కోర్స్, అందరూ ఊహిస్తున్నదే… అవునూ, ప్రశాంత్ కిషోర్ నేను సన్యాసం తీసుకుంటాను, పత్తాకు లేకుండా పారిపోతాను అది ఏదో సవాల్ చేశాడు కదా… మరి బెంగాల్ రిజల్ట్ ఏదో తేలకుండా వెళ్లి పంజాబ్‌లో ప్రభుత్వ సలహాదారుగా ఎలా చేరాడు అంటారా..? తను కూడా రాజకీయ నాయకుడే కదా…!!
Share this Article