….. నోయెల్ ‘చిల్లర కామెడీ’ అని కామెంటినందుకు ‘నాది చిల్లర కామెడీయా, కోట్ల మంది మెచ్చిన కామెడీ నాది, అది చూసే బిగ్‌బాస్ కావాలని నన్ను తీసుకొచ్చాడు, నేనొక పెద్ద ఎంటర్టెయినర్’ అంటూ వీరంగం వేసినరోజే అవినాష్ ప్రేక్షకుల చాయిస్ నుంచి ఎగిరిపోయాడు… మరీ అంత అతిని తెలుగు ప్రేక్షకుడు భరించడు… ఇక ఆరోజు నుంచీ ఆటలో కిందామీదా పడుతూనే ఉన్నాడు…
ఓరోజు ఫేక్ ఎలిమినేషన్ నుంచి బయటపడినప్పుడూ… నా గుండె ఆగిపోయింది అంటూ ఏడ్చి, శోకాలు పెట్టి… ఓసోస్, అవినాష్ దమ్ము ఇంతేనా అనే ప్రేక్షకుల పెదవి విరుపును సంపాదించుకున్నాడు… నా ఇల్లు ఏమైపోవాలి, నా ఈఎంఐలు ఏమైపోవాలి అంటూ లోపల శోకాలు… బయట తన టీం ‘మా అవినాష్ ఆ ఈటీవీ వాడికి పది లక్షలు ఉల్టా జరిమానా కట్టి వచ్చాడు, ఇక జబర్దస్త్‌లోకి చస్తే రానివ్వరు, పాపం, తన బతుకు ఇక బర్బాద్ అయిపోయినట్టే’ అంటూ బయట మరింత సింపతీ పోగుచేసే ప్రయత్నం…
Ads
పోనీ, ఆ అరియానాతో లవ్ ట్రాక్ నడిపించవయ్యా అంటూ బిగ్‌బాస్ ముందుకు నెట్టేకొద్దీ… కాస్త ముందుకూ, అయ్యో, ఇలాగైతే బయట నాకు పెళ్లి సంబంధాలు రావు అంటూ మళ్లీ వెనక్కి అన్నట్టుగా అదీ మనస్పూర్తిగా చేయలేక చేతులెత్తేశాడు… హౌస్‌లో చేసేది నటన అని ఆ ఆడపిల్లల తల్లిదండ్రులకు తెలియదా ఏం..? మాట్లాడితే చాలు, నేను తోపు ప్లేయర్‌ను అని క్లెయిమ్ చేసుకునే అవినాష్ అసలు ఈ షోకు అక్కరకు రాడని ప్రేక్షకులు తీర్మానించేసి, ఫోఫోవయ్యా అని ఎలిమినేట్ చేసిపారేశారు ఈవారం…
హతాశుడయ్యాడు అవినాష్… బిగ్‌బాస్ గేమ్ అంటే ఆ చిల్లర జబర్దస్త్ ప్రోగ్రాం కాదనే నిజం అర్థమైంది… ఏదో సమయానికి జేబులో ఓ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి, అర్జెంటుగా దాన్ని వాడేసుకుని, ఎలిమినేషన్ నుంచి తప్పించుకుని… హమ్మయ్య అని తేలికగా నిట్టూర్చాడు… కానీ తేలింది ఏమిటి..? అవినాష్ తప్పించుకున్నా సరే… ప్రేక్షకులు తనను మెచ్చడం లేదు అనే నిజం…! ఆ టోపీ లో చేయి పెట్టినప్పుడు తనలో వణుకు… సరే, ఈవారం ఎలాగోలా బయటపడ్డాడు… అంటే వచ్చేవారానికి మళ్లీ నామినేషన్లు, ఎలిమినేషన్ల బోనులోకి వెళ్లడానికి రెడీ అన్నట్టేగా… అదీ అవినాష్… మరీ ఏతులు, గొప్పలు, ఎచ్చులతో బిగ్‌బాస్ ఆట ఆడలేం బ్రో…
మనం ముందే చెప్పుకున్నట్టు… ఈసారి ఎలిమినేషన్లు లేవు… ఉండవని అనుకున్నదే కదా… అదే జరిగింది… ఏడుగురూ సేఫ్… లోపల తన్నుకోవడానికి మరీ ఏడుగురైనా లేకపోతే ఎలా..? అందుకని…!
తనని ప్రేక్షకులు తిరస్కరించారు అని అవినాష్ కూడా బాధపడ్డాడు… నిజం గ్రహించాడు… సెల్ఫ్ సింపతీ వద్దని నాగ్ ఓదార్చాడు…
అన్నట్టు… ఏ మాటకామాటే… ఒక్కొక్కరినీ ఆ జలజ అనే ఆ ఫేక్ దెయ్యం ఉన్న Confession room లోకి మళ్లీ పంపించి బిగ్ బాస్ ఆడుకున్న తీరు ఈరోజు బాగుంది…
Share this Article