.
14 ఏళ్ల ఒక వైభవ్ సెంచరీ… 17 ఏళ్ల ఆయుష్ మాత్రే 94 పరుగులు… వాళ్లే కాదు… ప్రియాంశ్, విఘ్నేష్, రషీద్… కొత్త కొత్త స్టార్స్ మెరుస్తున్నారు ఈసారి ఐపీఎల్ సీజన్‌లో…
వాళ్ల దూకుడు, షాట్స్ అబ్బురపరుస్తున్నాయి… నిజానికి ఐపీఎల్ అనగానే ఫిక్సింగులు, బెట్టింగులు మన్నూమశానం గుర్తొస్తుంటాయి… కానీ నాణేనికి మరోవైపు భిన్నం… క్రికెటర్లలో దాగున్న మొత్తం ప్రతిభను ఆవిష్కరిస్తున్నాయి మ్యాచులు…
Ads
సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు… మన గత క్రికెటర్లలాగా మడత నలగని హీరోల్లా ఆడితే కుదరదు… ఫీల్డింగులో కొందరు ప్లేయర్లు జాంటీ రోడ్స్, రాబిన్ సింగ్‌లను కూడా దాటిపోతున్నారు… మీటర్ల కొద్దీ పరుగెత్తి మరీ క్లిష్టమైన క్యాచులు, ఫీల్డింగ్…
ప్రత్యేకించి బౌండరీ లైన్ దగ్గర ఏకంగా సర్కస్ విన్యాసాలే… లైన్‌కు అటూఇటూ దూకుతూ సిక్సర్ వెళ్లే క్యాచును ఒడిసిపట్టుకుని వికెట్ పడేసే నైపుణ్యం వారెవ్వా అనిపిస్తోంది… గాలిలోకి ఎగురుతూ పట్టిన కొన్ని క్యాచులు అయితే సూపర్బ్…
నిజానికి ఐపీఎల్ అంటేనే దంచూ దంచూ… మారో యా మరో… గతంలోలాగా మంచి బాల్స్ వదిలేసి, అనువుగా వచ్చిన బాల్స్‌నే షాట్లుగా మలుస్తామంటే కుదరదు… ప్రతి బంతీ విలువైందే… ఒకటీరెండు పరుగులు కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చేసేంత పోటీ…
…. ఇలాంటి దృశ్యాలు అనేకం… సో, క్రికెట్ తాలూకు అన్ని నైపుణ్యాల్నీ ప్రదర్శించాల్సిందే… గతంలో కేవలం క్రికెట్ బుక్‌లో ఉండే షాట్లే కనిపించేవి అంతర్జాతీయ మ్యాచుల్లో… కానీ ఐపీఎల్ అలా కాదు… ప్రయోగాలు, రిస్క్… తప్పదు… గ్యాపుల్లోకి ఫోర్లు బాదడమే కాదు, వీలైనంతవరకూ ఫీల్డర్ల మీదుగా బౌండరీ లైన్ దాటించడానికే ప్రయారిటీ…
క్రీజుల్లో ఫుట్ వర్క్ అనేది ఇప్పుడు నథింగ్… క్రీజు వదిలేసి వెనక్కీ ముందుకూ బాగా ఎడంగా వెళ్లి బాదుతున్నారు… ఎత్తుగా వచ్చే బాల్స్‌ను అలాగే కీపర్ తలపై నుంచి వెనక్కి కొట్టడం ఎక్కువైంది ఈ సీజన్‌లో… బ్యాటును అలా ముందుకు బారజాపి, బాల్‌ను వెనక దిశలోకి పైకి లేపడం కూడా…
హార్డ్ హిట్టర్ల స్ట్రయిక్ రేట్ 150 నుంచి 200 దాటి ఉంటోంది… ఆరెంజ్ క్యాప్ పోటీలో ప్రస్తుతం కోహ్లీ (505), సుదర్శన్ (504) పోటీ ఇప్పటికి… తరువాత సూర్య కుమార్ యాదవ్, బట్లర్, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, నికోలస్ పూరన్ ఉన్నారు…
నిజానికి ఐపీఎల్ బ్యాటర్ల ట్రోఫీ… పిచ్చులూ అలాగే ఉంటున్నాయి అనే విమర్శ ఉంది కదా… ఆ నిర్జీవ పిచ్చుల మీద కూడా తమ సత్తా చూపిస్తున్నారు కొందరు బౌలర్లు మొన్న యుజువేంద్ర చాహల్ ఒకే ఓవర్‌లో ఓ హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీసిన మెరుపుల్ని చూశాం కదా…
స్టార్క్, హార్డిక్ పాండ్యా ఒకే మ్యాచులో అయిదేసి వికెట్లు కూడా తీశారు… ప్రస్తుతం పర్పుల్ క్యాప్ పోటీలో ప్రసిద్ధ కృష్ణ (19) హాజిల్‌వుడ్ (18) నడుమ పోటీ ఇప్పటికి… ఒకే మ్యాచులో నాలుగేసి వికెట్లు తీసినవాళ్లు కనీసం పది మంది ఉన్నారు… సో, బౌలింగ్ కూడా రాటు దేలుతోంది… వెరసి అత్యుత్తమ ప్రతిభ ఆవిష్కృతమవుతోంది..!!
Share this Article