.
మనం ఎన్ని అనుకున్నా సరే… జీవితం మన చేతుల్లో ఏమీ లేదు… ఆల్రెడీ ఏదో రాసి ఉంటుంది… అటువైపు ప్రవాహంలో మనం కొట్టుకుపోవడమే… తెలివి, చదువు, ఆస్తి, సర్కిళ్లు మన్నూమశానం ఏవీ పనికిరావు ఓ టైమ్ వస్తే…
కరోనా సమయంలో పెద్ద పెద్ద తోపులో ఎగిరిపోయారు… ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఆమె వయస్సు 82 ఏళ్లు… ఎక్కడో పుట్టి, ఎక్కడో ఏదో కెరీర్‌లో అడుగుపెట్టి, ఎటెటో తిరిగింది… అంతే, విధి ఎటు తోస్తే అటు ప్రయాణించింది… అదే మనం పదే పదే చెప్పుకునే డెస్టినీ…
Ads
.
ఆమె పేరు ఎల్.విజయలక్ష్మి… 13 ఏళ్ళకే స్కూల్ డ్రాప్ ఔట్! కానీ వివాహమయ్యాక…. భర్తతో… ఫిలిప్పైన్స్ లోని మనిలా కెళ్ళి…. మళ్ళీ చదువు ప్రారంభించి…. బెనారస్ యూనివర్సిటీలో, మద్రాస్ లో…. మెట్రిక్… బి.కాం… పర్సనల్ గా వచ్చి పరీక్షలు వ్రాసి పాస్ అయి… మళ్ళీ మనీల లో…. మాస్టర్స్ ఇన్ కామర్స్ చేసి…. అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ అకౌంటింగ్ ఇంకా….. సి.పి.ఎ….. సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటింగ్ కూడా సాధించి….
అదే యూనివర్సిటీలో….. ఫినాన్స్ డైరెక్టర్ గా 14 ఏళ్ళు పని చేయడమంటే…. గొప్ప కదా! ఎక్కడి స్కూల్ డ్రాపవుట్… గజ్జె కట్టి ప్రదర్శనలు ఇచ్చిన ఆమె చివరకు ఏ తీరం చేరింది… ఆ ఇలాంటి సక్సెస్ స్టోరీలు… ఎన్ని వినలేదు!?…. ఇదేం పెద్ద గొప్ప అని కూడా మనం అనుకోవచ్చు!
కానీ అది సాధించింది….ప్రఖ్యాత నర్తకిగా తెలుగు, ఇతర భాషల సినిమాల్లో నర్తించి ప్రేక్షకుల హృదయాలను రంజింప చేసిన ఎల్. విజయ లక్ష్మి!
చిన్న పిల్ల…. పూనాలో ఓ నృత్య ప్రదర్శన చూస్తోంది… వళ్ళంతా… కళ్ళు చేసుకుని. వైజయంతిమాల నృత్య ప్రదర్శన…. అద్భుతమైన ఆ డాన్స్ చూసి… ఇంటికొచ్చి… అచ్చు ఇంచుమించు ఆ భంగిమలతోనే….. గెంతులేస్తున్న ఆ చిన్నారిలోని నైపుణ్యాన్ని…. ఆ వయసులోనే తండ్రి కనిపెట్టి… ఓ భరత నాట్యం గురువును వెదికి పూనాలోనే నృత్యం నేర్పించాడు…
ఆమె నాట్యరీతులు గమనించి… చక్కటి డాన్సర్ అవుతుంది. మద్రాస్ లో మంచి గురువు గారి దగ్గర నేర్పించండని శ్రేయోభిలాషులు చెప్పిన మాటలతో అకౌంటెంట్ గా ఉన్న ఆయన మద్రాస్ కు ట్రాన్స్ఫర్ అడిగితే… ఊటీకి ఇచ్చారు.
మద్రాస్ లో కుటుంబాన్ని ఉంచి… ఆయన ఊటీలో వర్క్ చేసేవారు! దక్షిణ మాడ వీధి.. మైలాపూర్ లో ఉంటూ… వజుయూర్ రామయ్య పిళ్ళై గారి దగ్గర నృత్యంలో 2 ఏళ్ళలోనే ప్రావీణ్యం సంపాదించి… అరంగేట్రం ఇచ్చే స్థాయి కొచ్చింది ఆ అమ్మాయి…
కమలా లక్ష్మణ్, వి.శాంతారాం గారు అటెండ్ అయ్యారు మొదటి ప్రదర్శనకు. ప్రశంసలు…. గుర్తింపు అప్పుడే వచ్చాయి. 8వ తరగతి చదువుతున్న తనకు అప్పుడే మరుమగల్ (1953)లో మొదటి ఛాన్స్ వచ్చింది. తెలుగులో మాత్రం సిపాయి కూతురు మొదటి మూవీ.
ఎర్నాకులంలో పుట్టి…., తిరునల్వేలిలో, పూనాలో పెరిగి… మద్రాస్ కు షిఫ్ట్ అయి…. తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ & హిందీ చిత్ర సీమలలో… 1959 – 1969… ఓ దశాబ్ధం పాటు….. తన నృత్యం లేకుండా మూవీస్ ఉండేవి కావు!
ఒక్క డాన్స్ అయినా ఉండాలి. గుండమ్మ కథలో అసలు పాటే లేకుండా…. కేవలం నృత్యంతో అద్భుతంగా అలరించింది! 1969లోనే…. ఆ మెరుపు తీగ జీవితం అద్భుతమైన మలుపు తిప్పాడు ఆ సృష్టికర్త వివాహం పేరుతో…
పెద్దన్నయ్య కొలీగ్.. సుర్జీత్ కుమార్ దే దత్తా… ఫిలిప్పైన్స్ లో అగ్రికల్చరల్ సైంటిస్ట్… ఆమెను కోరి మరీ పెళ్ళాడి…. మనిలా కు తీసుకెళ్ళిపోయాడు…
మళ్ళీ చదువు కొనసాగించి…. బెనారస్ నుండి మెట్రిక్… మద్రాస్ యూనివర్సిటీ నుండి బి.కాం తెచ్చుకున్నా… డాన్స్ ప్రదర్శనలిస్తూనే ఉంది… అడపాదడపా.
మకాం… అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీకి మారాక… అక్కడే మాస్టర్స్ ఇన్ కామర్స్ & సి.పి.ఏ (సి.ఏ. తో సమానం) కూడా చేసి… అక్కడే వర్జీనియా యూనివర్సిటీ ఆఫ్ పాలిటెక్నిక్ లో బడ్జెటింగ్ ఆఫీసర్ గా & ఫినాన్స్ డైరెక్టర్ గా 14 ఏళ్ళు వర్క్ చేసి… రిటైర్ అయ్యారు శ్రీమతి. ఎల్. విజయలక్ష్మి… ఎక్కడి స్కూల్ డ్రాపవుట్, ఎక్కడి వర్జీనియా వర్శిటీ ఫినాన్స్ డైరెక్టర్… నాట్యం నుంచి అకౌంట్స్ దాకా… భలే జర్నీ…
(వాట్సప్ సేకరణ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది గానీ… ఇది ఫేస్బుక్ లో వింజమూరి అప్పారావు గారి పోస్ట్‌గా చదివినట్టు గుర్తు…)
Share this Article