.
బిగ్‌బాస్‌లో జరిగేది కాస్ట్‌లీ వ్యభిచారం అని మరోసారి నారాయణ ఏదో కూశాడు… కూత అని ఎందుకు అనుకోవడం అంటే..? బిగ్‌బాస్ షోలలో పాల్గొన్న ప్రతి అమ్మాయినీ వ్యభిచారి అనడం, ప్రతి అబ్బాయిని విటుడు అనడం దుర్మార్గం…
చివరకు జాతిని ఉద్దరించే ఓ కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకుడు ఇలా ప్రేలాపనలకు దిగడం ఆ పార్టీ దురవస్థను సూచిస్తోంది… ఓ గదిలో బంధించి, సర్వ సౌకర్యాలూ కల్పిస్తే అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇక అదే ‘పని’ అన్నట్టుగా ఆ వ్యాఖ్యలు ఏమిటసలు..?
Ads
పదే పదే అదే షో మీద ఎందుకు ఆయన కోపగిస్తున్నాడో తెలియదు గానీ… మిగతా టీవీ షోలన్నీ సొక్కమేనా నారాయణ గారండీ… జబర్దస్త్ దగ్గర నుంచి ఇప్పుడు వస్తున్న ప్రతి షోలనూ బూతే కదా… పుష్ప సినిమా గురించి మాట్లాడవేంది…? తాజా హిట్-3 తాలూకు బీభత్స హింస, నెత్తురు, బూతులు కనిపించలేదా..? ఇందులో జాతికి చెప్పే నీతి ఏముంది కామ్రేడ్..? అవెందుకు కనిపించడం లేదు మరి..?
బిగ్‌బాస్ జాతికి చెప్పే నీతి ఏమిటి అని అడుగుతున్నాడు… మరి మన సినిమాలు, మన టీవీ షోలు ఏ నీతిని బోధిస్తున్నాయి మహాశయా..? బిగ్‌బాస్ మీద పోరాడు, నీ ఇష్టం, చివరకు నీ పార్టీ పోరాటాలు ఈ స్థాయికి ‘ఎదిగినందుకు’ సంతోషం… ఆ షోలో పాల్గొన్న ఒక్క అమ్మాయి గనుక ‘నామీద వ్యభిచారి అనే ముద్ర ఎలా వేస్తవ్..?’ అని తిరగబడి వాదిస్తే అప్పుడు నీ దగ్గర ఉన్న ఆధారాలేం చూపిస్తవ్..?
అసలు ఒక షోలో పార్టిసిపెంట్స్‌ను వ్యభిచారులు అని కించపరచడాన్ని నీ పార్టీ ఎలా ఆమోదిస్తున్నది..? బిగ్‌బాస్ షో చెత్తా, చెత్తన్నరా అనేది వదిలెయ్… 40, 50 కెమెరాలు, 24 గంటల రికార్డింగు… ఇప్పుడైతే 24 గంటల ప్రసారం కూడా…
పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి జిల్లా కోర్టుల దాకా ఎక్కడికి వెళ్లినా తన పిటిషన్ తీసుకోలేదట… ఇప్పుడు హైకోర్టు బిగ్‌బాస్ బాధ్యులకు నోటీసులు ఇచ్చిందని చెబుతున్నాడు కామ్రేడు… అదొక షో, అందులో నాగార్జున జస్ట్, ఒక హోస్ట్… తను ఆ షో నిర్మాత కాదు… స్టూడియో కూడా అద్దెకు ఇచ్చి డబ్బు తీసుకుంటాడు తప్ప తనకు ఆ లాభనష్టాలతో, ప్రకటనలతో సంబంధం లేదు…
సరే, సదరు షో బాధ్యులు కోర్టుకు ఏం సమాధానం చెప్పుకుంటారనేది వదిలేస్తే… సమాజంలో ఇక వేరే సమస్య లేనట్టుగా ఈ షోను టార్గెట్ చేయడం వెనుక మర్మమేమిటనేది ఎవరికీ అంతుపట్టదు… ఓటీటీల్లో వచ్చే వల్గర్ కంటెంట్ ఎప్పుడైనా గమనించిందా ఈ పార్టీ..? హౌజ్ అరెస్టు అనే వెబ్ సీరీస్ తాజా వివాదం తెలుసా..?
ఒకడెవడో కంటెస్టెంట్లను సంభోగ పొజిషన్ల గురించి అడుగుతూ, చూపించమని అడుగుతున్న క్లిప్ ఎంత దారుణం..? సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఓటీటీ కంటెంటు మీద కేసు ఉంది… ఇలాంటి షోలలోని వల్గారిటీ మీద నెటిజనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత, చర్చ… మరి మనం ఆ చిల్లర బిగ్‌బాస్ షో దగ్గరే ఆగిపోయాం ఏమిటి కామ్రేడ్..?!
తాజా వివాదం గురించి శాంపిల్‌గా ఓ చిన్న వార్త క్లిప్పింగ్, లింక్ ఇది…
Share this Article