.
హరిహర వీరమల్లు… 13 సార్లు విడుదల వాయిదా పడటం బహుశా ఓ రికార్డు కావచ్చు… బట్, ఎట్టకేలకు షూటింగ్ అయితే పూర్తయిందట… అయితే..?
ఈ సినిమా విశేషాల్లో ముఖ్యమైంది… మొదట క్రిష్ దర్శకుడు… తరువాత తప్పించారో, తప్పుకున్నాడో తెలియదు గానీ… ఏఎం జ్యోతి కృష్ణ పేరు వినిపించింది… యాక్షన్ సీన్స్ పవన్ కల్యాణే డైరెక్ట్ చేశాడని తనే చెప్పినట్టు గుర్తు…
Ads
ఇప్పుడు త్రివిక్రమ్ పేరు వినిపిస్తోందట… తను దర్శకత్వ పర్యవేక్షణ చూస్తున్నాడని… అంటే ఆ జ్యోతి కృష్ణ కూడా ఔటేనా..? సరే, ఆ సినిమా గురించి వదిలేస్తే… అసలు క్రిష్‌కు సమస్య ఏమిటి..?
కంచె, గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం తదితర చిత్రాలతో అందరి దృష్టినీ ఆకర్షించాడు… తెలివైన ఓ తెలుగు దర్శకుడు దొరికాడు అనిపించుకున్నాడు… గౌతమీ పుత్ర శాతకర్ణి వరకూ వోకే… ఇక్కడే గాడితప్పడం స్టార్టయినట్టుంది…
తరువాత ఎన్టీయార్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు అట్టర్ ఫ్లాప్స్… దానికి సవాలక్ష కారణాలు ఉండవచ్చుగాక… కానీ క్రిష్ మసకబారసాగాడు… తరువాత కంగనా నటించే మణికర్ణిక నుంచి తప్పించబడ్డాడు… కంగనా టేకప్ చేసింది ఆ సినిమాను… తరువాత ఏదో ఓ చిన్న సినిమా… అంతే…
హరిహర వీరమల్లు నుంచి ఔట్… ఎందుకు..? కారణాలు బయటికి ఎవరికీ చెప్పరు… తెలియనివ్వరు… అంతెందుకు..? తను దర్శకత్వం వహిస్తున్న అనుష్క సినిమా ఘాతి నుంచి కూడా క్రిష్ బయటికి వచ్చినట్టు ఓ రూమర్ అయితే వినిపిస్తోంది… రెండు విరిగిపడిన ప్రతిభా కెరటాల పునఃకలయిక అనుకుంటే అదీ అయోమయంలోనే చిక్కుకుపోయినట్టుంది…
ఎందుకిలా…? ఏమిటిలా…? అసలు క్రిష్‌లోనే సమస్య ఉందా..? ఎక్కడా ఇమడలేకపోతున్నాడా…? ఇగో బాపతు ఇష్యూస్ పీడిస్తున్నాయా..? గబ్బర్ ఈజ్ బ్యాక్, కంచె తరువాత… అంటే పదేళ్లలో ఇదీ నా సినిమా అని క్రిష్ కాలరెగరేసే సినిమా లేదు… ఖచ్చితంగా క్రిష్ కెరీర్ రాను రాను సమస్యల్లోకి కూరుకుపోతున్నట్టే…
తనకున్న ప్లస్ పాయింట్… వేగంగా సినిమాను పూర్తి చేయడం… సరైన ప్లానింగ్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు… గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాను 80 రోజుల్లో… ఎన్టీయార్ బయోపిక్స్ రెండూ 79 రోజుల్లో కంప్లీట్ చేశాడు… అంతేకాదు, కొండపొలం సినిమాను కరోనా పీరియడ్‌లో నెలన్నర రోజుల్లో పూర్తి చేశాడు… తనలో మెరిట్ ఉంది, అందులో డౌట్ లేదు…
ఎటొచ్చీ ఎక్కడో బాగా తేడా కొడుతోంది… తనకే ఆత్మపరిశీలన అవసరం… లేదంటే తనే సొంతంగా సినిమాలు తీసుకోవాలేమో ఇక..!!
తాజాకలం … పొద్దున్నే ఓ వార్త చదివా ఎక్కడో… బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞతో క్రిష్ సారథ్యంలోనే తెరంగేట్రం చేయిస్తాడని… అదేమిటి..? హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో సినిమా అన్నారు… అది మటాషేనా..?
Share this Article