.
Pardha Saradhi Potluri …….. ఆపరేషన్ సింధూర్! మెరుపుదాడి! Part- 1
మొత్తం 9 టార్గెట్లు.
మొత్తం 21 దాడులు
25 నిముషాలలో పూర్తిచేశారు.
రాఫెల్ F3R, మిరేజ్ 2000, సుఖోయ్ Su-30 MKI లు కలిసి ఈ రోజు రాత్రి ( MAY 7 12.44 కి) భారత్ సరిహద్దు లో ఉంటూనే POK మరియు పాకిస్థాన్ లోని మొత్తం 9 స్థావరాల మీద AIR to Surface బాంబులని ప్రయోగించాయి!
Ads
1.బహావల్ పూర్ లో ఉన్న జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్ మీద బాంబులు వేశారు.
2.ముర్థికే ( Murdike) లో ఉన్న లష్కరే తోయిబా కాంప్ మీద బాంబులు వేశారు.
3.లైన్ అఫ్ కంట్రోల్, పూంచ్, రాజోరి లో ఉన్న గుల్ పూర్ మీద బాంబులు వేశారు. జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడడానికి సిద్ధంగా ఉన్న తీవ్రవాదుల లాంచ్ పాడ్ ఉంది అక్కడ.
4.POJK లో ని సవాయ్ లో ఉన్న LeT క్యాంపు మీద బాంబులు వేశారు.
5.బిలాల్ క్యాంపు, జైషే మొహమ్మద్ లాంచ్ పాడ్ మీద బాంబులు వేశారు.
6.కోట్లి లష్కరే తోయిబా లాంచ్ పాడ్ మీద బాంబులు వేశారు.
7.బర్నాలా, పంజాబ్, లాంచ్ పాడ్ మీద బాంబులు వేశారు.
8.సర్జల్, జైషే మొహమ్మద్ క్యాంపు మీద బాంబులు వేశారు.
9. మేహ్ మూనా, హిజబుల్ ముజాహిదిన్ కాంప్ మీద బాంబులు వేశారు.
***************
భారత్ చేసిన దాడి బయటికి పెద్దదిగా కనిపించకపోవచ్చు కానీ వ్యూహత్మాకంగా చాలా ముఖ్యమైన దాడిగా చెప్పవచ్చు! అదెలాగంటే….
మార్కజ్ సుభానల్లా, బహావల్ పూర్.
జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్. కానీ అది ఒక బిల్డింగ్ కాదు భారత వ్యతిరేక ఉగ్రవాద ఆలోచలనలకి ఒక సిద్ధాంతాన్ని, రూపునిచ్చి యువకులని ఆకర్షించే చోటు. మాసూద్ అజహర్ తన కుటుంబంతో అక్కడే ఉంటాడు.
భారత్ చేసిన దాడిలో మాసూద్ అజహర్ తృటిలో తప్పించుకోగా అతని కుటుంబ సభ్యులు 10 మంది హతమయ్యారు!
మాసూద్ అజహర్ కి ISI రక్షణ ఉంది! 2015 నుండి క్రియాశీలకంగా ఉంది.
ISI రక్షణలో ఉన్న మాసూద్ అజహర్ కి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన కమాండోలని కాపలాగా పెట్టాడు ఆసిమ్ మునీర్.
మాసూద్ అజహర్ కోసమే ఎయిర్ ఇండియా విమానం హైజాక్ చేసి కాందహార్ కి మళ్లీంచి మసూద్ అజహర్ ని కాశ్మీర్ జైలు నుండి విడుదల చేసిన తరువాతే ఎయిర్ ఇండియా విమానాన్ని విడిచిపెట్టారు.
పుల్వామా లో 40 మంది CRPF జవాన్ల మృతికి ప్లాన్ చేసింది మాసూద్ అజహర్! తరువాత బాలకొట్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్ లో కూడా తృటిలో తప్పించుకున్నాడు మాసూద్ అజహర్!
******************
సర్జల్ / టెహ్రా కలాన్, నరోవాల్
జైషే మొహమ్మద్ కి లాంచ్ బేస్. ఇక్కడినుండే సరిహద్దుల వద్ద ఉండే లాంచ్ పాడ్ లకి ఉగ్రవాదులని తరలిస్తారు.
నిజానికి ఇక్కడ ఉండే బిల్డింగ్ బయట ప్రాధమిక చికిత్సలయం ( Primary Health Center) అనే బోర్డు ఉంటుంది, కానీ బిల్డింగ్ లోపల క్లినిక్ ఉండదు. ఉగ్రవాదులకి శిక్షణ ఇస్తారు. డ్రోన్ లని ఆపరేట్ చేయడం, సరిహద్దుల దగ్గర pok వైపు ఉండే సొరంగాలలో ఉంటూ ఆదేశాలు వచ్చే వరకూ సొరంగాలలో ఎలా ఉండాలి అనే అంశాల మీద శిక్షణ ఇస్తారు.
భారత్ లోని సాంబ / జమ్మూ సెక్టర్ లోకి సొరంగాల ద్వారా ప్రవేశించి అక్కడ డబ్బులు కోసం ఇబ్బంది పడకుండా డ్రగ్స్ తీసుకెళ్లి ఎక్కడ, ఎవరికి అమ్మాలి అనే దాని మీద కూడా ఇక్కడే శిక్షణ ఇస్తారు. జస్ట్ నార్కో టెర్రర్ ఆపరేషన్ అంటారు దీనిని.
*************
మెహమూనా జోయా / సియాల్ కోట్
ఇక్కడ ఒక స్కూల్ పేరుతో బిల్డింగ్ ఉంటుంది. కానీ హిజ్ బుల్ ముజాహిదిన్ బేస్ ఇది.
కొత్తగా హిజ్ బుల్ ముజాహిదిన్ లోకి చేరే యువకులకి శిక్షణ ఇస్తాడు దీనికి ఇంచార్జ్ అయిన ఇర్ఫాన్ తండా!
కాశ్మీర్ లో హిజ్ బుల్ ముజాహిదిన్ ప్రభావం తగ్గిపోయినా సియాల్ కోట్ లోని మెహమూనాలో ఉన్న ఈ స్కూల్ బిల్డింగ్ లో మాత్రం యువకులని రిక్రూట్ చేసుకోవడం, ఆయుధాలు ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వడం మాత్రం జోరుగా జరుగుతున్నది!
*****************
మార్కజ్ అహ్లే హదిత్, బర్నాలా, POJK
లష్కరే తోయిబా బేస్ ఇది. LoC నుండి ఆయుధాలని భారత్ లోని రాజో రీ, పూంచ్, రైసీ లలోకి స్మగ్లింగ్ చేసే పాయింట్ ఇది. 150 మందికి తక్కువ కాకుండా ఉంటారు ఎప్పుడూ.
కాసీం గుజ్జర్ మరియు అనాస్ జరార్ అనే ఇద్దరు ఉగ్రవాదులు ఈ బేస్ ని నిర్వహిస్తున్నారు!
********************
మార్కజ్ అబ్బాస్, కోట్లి, POJK.
లష్కరే తోయిబా ట్రైనింగ్ గ్రౌండ్ ఇది.
కారీ జరార్ అనే ఉగ్రవాది ఈ ట్రైనింగ్ గ్రౌండ్ కి ఇంచార్జ్.
ఈ గ్రౌండ్ లో లష్కరే తోయిబా ఉగ్రవాదులకి భారత సైనికులని సరిహద్దు వద్ద ఆత్మహతి దాడులు చేసి ఎలా చంపాలో శిక్షణ ఇస్తుంటాడు!
శీతాకాలంలో ఆత్మహతి దాడి జరిగి భారత సైనికులు చనిపోయారు అంటే అది కారీ జరార్ దగ్గర శిక్షణ పొందిన లష్కర్ ఉగ్రవాదుల పనే!
కారీ జరార్ లష్కరే తోయిబాలోని అగ్ర నాయకుడు అయిన రౌఫ్ అస్ఘర్ కి సన్నిహితుడు.
*******************
మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి, PoJK.
ఇది హిజ్బుల్ ముజాహిదిన్ కి చెందిన చాలా పాత ట్రైనింగ్ కాంప్!
బోర్డర్ యాక్షన్ టీమ్స్ ( Border Action Teams- BATs) కి శిక్షణ ఇస్తారు ఇక్కడ.
ముఖ్యంగా స్నిపర్ మరియు గెరిల్లా వార్ ఫేర్ ( Sniper & Guerilla warfare) లో ఉగ్రవాదులకి శిక్షణ ఇస్తారు.
పేరుకే ఇది హిజ్బుల్ ముజాహిదిన్ టెర్రర్ కాంప్ కానీ పాకిస్థాన్ ఆర్మీ కోవర్ట్ టెర్రర్ స్ట్రైక్ ఫోర్స్ అని R&WA గుర్తించింది.
పాకిస్తాన్ ఆర్మీ కి చెందిన వారే సివిల్ దుస్తులలో ఉంటూ ఉగ్రవాదులకి శిక్షణ ఇస్తారు.
బోర్డర్ దగ్గర రాత్రిపూట పెట్రోలింగ్ చేసే జవానులని మెరుపు దాడి చేసి చంపేసి అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడడానికి మార్గం సుగమం చేస్తారు. బోర్డర్ దగ్గర కాపలా ఉన్నా కూడా ఉగ్రవాదులు ఎలా చొరబడుతున్నారు అని ప్రశ్నించే వాళ్లు తెలుసుకోవాల్సిన విషయం ఇది. పాకిస్తాన్ సైనికులే హిజ్బుల్ ముసుగులో భారత్ లోకి ప్రవేశించిన ఘటనలు ఉన్నాయి.
*******************
షవాయ్ నల్లాహ్ క్యాంప్, ముజఫరాబాద్.
లష్కరే తోయిబాకి చెందిన అనుబంధ సంస్థ అయిన బై త్ ఉల్ ముజాహిదిన్ ( Bait-ul-Mujahidin) ట్రైనింగ్ కాంప్ ఇది.
2008 ముంబై దాడులలో పాల్గొన్నది ఇక్కడ ట్రైనింగ్ అయిన ఉగ్రవాదులే! ISI నుండి దీనికి నేరుగా నిధులు అందుతాయి.
250 మంది ఉగ్రవాదులు శిక్షణ పూర్తి చేసుకొని భారత్ లోకి చొరబడడానికి సిద్ధంగా ఉన్న సమయంలో భారత్ దాడి చేసింది!
రాబోయే రోజుల్లో కాశ్మీర్ లోని కుప్వారా, సొన్ మార్గ్, గురేజ్ లలో దాడులకి పాల్పాడడానికి సిద్ధంగా ఉన్నారు!
******************
మర్కజ్ స్యే ద్నా బిలాల్, ముజాఫరాబాద్.
ఇది జైషేమొహమ్మద్ సంస్థకి చెందిన ట్రాన్సిట్ క్యాంప్!
వివిధ ఉగ్ర సంస్థల ఉగ్రవాదులు ఇక్కడి నుండే కలిసిపోయి దాడుల కోసం జట్లుగా వెళతారు!
******************
మొత్తం 70 మంది ఉగ్రవాదులు మరణించింటారని వార్త!
24 నిముషాలపాటు జరిగిన దాడి బయటికి చిన్నదిగానే కనిపించినా చాలా కీలకమైన దాడి అని చెప్పవచ్చు!
ఏప్రిల్ 22 న పహాల్గామ్ హత్యా కాండ జరిగితే May 7 న భారత్ దాడి చేసింది అంటే ఇంటెలిజెన్స్ సమాచారం కోసం వేచిచూడాల్సి వచ్చింది!
పిల్లి పిల్లలని కని గంటకి ఒక చోటుకి తరలించినట్లు పాకిస్తాన్ ISI పైన పేర్కొన్న ఉగ్ర సంస్థల నాయకులని రోజుకి ఒక్కో చోటకి తరలిస్తూ వచ్చింది!
చివరికి సర్జికల్ స్ట్రైక్ జరగదు నేరుగా పూర్తి స్థాయి యుద్ధమే జరుగుతుంది అని భావించి పైన పేర్కొన్న చోట్ల వాళ్ళని ఉంచింది అని ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిన వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది!
మాసూద్ అజహర్ ఉన్న చోటుని యాక్యూరెట్ గా తెలుసుకుని దాడి చేయడమే పాకిస్తాన్ సైన్యానికి ఆశ్చర్యం కలిగించింది!
మొత్తం 9 ప్రదేశాలలో ఇంటలిజెన్స్ సమాచారం సేకరించి ఒకేసారి అన్నిటి మీద దాడి చేయడం భారత్ కే సాధ్యం అయింది!
మోస్సాద్ చరిత్రలో 9 చోట్ల ఒకేసారి దాడి చేసిన దాఖలాలు లేవు!
ఈ దాడితో పాకిస్తాన్ కి ఒక భయంకరమైన మెసేజ్ ఇచ్చింది భారత్! 9 చోట్ల కాదు అవసరం అయితే 20 చోట్ల ఏకకాలంలో దాడి చేయగలము అని!
అయితే సర్జికల్ స్ట్రైక్ తోనే సినిమా అయిపోలేదు!
మోడీకి చెప్పారు.. ఆయన విన్నారు.. ఆయన లేపేయమన్నారు…
ఇంకా ఉంది!
Share this Article