.
Enugurthi Sathyam…… ఉత్త ముచ్చట్లు …. నేనూ…. ఓ సారి… లీగల్ రిపోర్టర్ మిత్రుడిని అడిగిన… “అన్నా… కోర్టుల్లో… సినిమాల్లో చూపించినట్టుగానే వాదోపవాదాలు జరుగుతయా…?” అని. అతడు ఏమన్నడంటే…. “అట్లేం ఉండవు. ఏవో కొన్ని కేసుల్లో తప్ప… చాలా కేసుల్లో సరదాగా… వాదనలు కామెడీగా కూడా జరుగుతాయి. మొన్నా మధ్య… కోళ్ల పందేల కేసులో…
కోడి పందేలకు జంతు సంరక్షణ చట్టం వర్తించదని లాయర్ వాదించాడు. కోడి జంతువు కాదు… పక్షి అనీ… పాయింట్ లేవనెత్తాడు. అంతేకాకుండా… కోడి పందేలు… జూదం కాదనీ… గ్రామీణ, సంప్రదాయ క్రీడా అంటూ వాదించాడు. జడ్జితో పాటు అందరూ నవ్వారు.. జడ్జి అయితే… “ఓహో… కోడి జంతువు కాదా….! మరిప్పుడెలా…?” అంటూ నిట్టూర్చాడు.” అనీ… ఇలా తన కోర్టు రిపోర్టింగ్ అనుభవం చెప్పాడు.
Ads
అంటే… కోర్టుల్లో… ఒక్కోసారి వాదనలు ఎలా ఉంటాయో తెలిపే ఉదాహరణ ఇది. సింపుల్ గా చెప్పాలంటే…. “కోడి పందేలు… జంతు సంరక్షణ చట్టం ప్రకారం నేరం. సదరు ముద్దాయి… కోడిపందేలు నిర్వహించాడు… అలాగే… అక్కడ జూదం కూడా జరిగింది….” అనీ… గ్యాంబ్లింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్లను కూడా నమోదు చేస్తూ… పోలీసులు దర్యాప్తు జరిపి…. అభియోగాలు పేర్కొంటారు.
ఇందుకు సంబంధించిన సాక్ష్యాలుగా ఫొటోలు, వీడియోలు, ప్రత్యక్ష సాక్షులను పేర్కొంటూ… చార్జిషీట్ దాఖలు చేశారని అనుకుందాం. కోర్టులో వాదనలు… ఎలా ప్రారంభం అవుతాయంటే…. ఫస్ట్ ఫస్ట్… జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేయడం కరెక్టేనా… అసలు కోడి… జంతువా..? పక్షా…? అక్కడ జరిగింది… జూదమా..? కాదా…? అని స్టార్టవుతాయి వాదనలు.
డిఫెన్స్ లాయరేమో… కోడి జంతువు కాదు…. పక్షి అనీ…, అక్కడ జరిగింది పందెం కాదు… గ్రామీణ సంప్రదాయ క్రీడ అనీ…… వాదిస్తాడు. ఇప్పుడు జడ్జికి…. కొత్త సవాళ్లు మొదలైతయి. నేరం జరిగిందా లేదా అనే చర్చ…. అసలు జరిగింది నేరమా కాదా…. అనే దగ్గర మొదలవుతుంది. లాయర్లు… అది నేరమని నిరూపించి…. నేరం జరిగింది అని కూడా నిరూపించాల్సి ఉంటుంది.
అయితే… చాలా కాలం క్రితం… ఫేస్ బుక్ లో… ఓ రీల్ చూసిన. అదీ.. Dekh Thamaashaa Dekh (2014) మూవీలోనిది. అందులోనిదే ఓ సీన్ అది. సరే… సినిమా మొత్తం చూద్దామని యూట్యూబ్ లోకి వెళ్తే దొరికింది. చూసిన. సినిమా మొత్తం… ఓ కేసు గురించి ఉంటుంది. కోర్టులో… ఓ కేసు వాదన… చాలా ఫన్నీగా సాగుతుంది. రాజకీయ నాయకుడి హోర్డింగ్ మీద పడీ… గుర్రపు బండి నడిపే అతడు చనిపోతాడు.
అతడి మృతదేహం ఎవరికి చెందుతుంది…? అనేది కేసు. అతని పేరు కిషన్. ముస్లిం మహిళను పెళ్లి చేసుకుని… హమీద్ అని పేరు మార్చుకుంటాడు. మృతుడి సోదరుడి కుటుంబం, మృతుడి భార్య కుటుంబం మధ్య విభేదాలు ఏమీ ఉండవు. ఈ అంశాన్ని…
రెండు రాజకీయ పార్టీలు తమ ఎజెండాగా తీసుకుని…. రెండు పక్షాల తరఫున కేసును నడిపిస్తాయి. ఈ క్రమంలో… అల్లర్లు కూడా జరుగుతాయి. ఇందులో మీడియా, రాజకీయాలు, పోలీస్ డిపార్ట్మెంట్… అందరి గురించి ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో… ఓ లవ్ స్టోరీ కూడా ఉంటుంది.
కోర్టులో వాదనలు… సినిమాకు హైలెట్. కోడి పందేల కేసులో… కోడి జంతువా…? పక్షా…? పందెం… జూదమా..? క్రీడనా…? అనే వాదన జరిగినట్టు…. ఈ సినిమాలో… మృతుడి భౌతికకాయాన్ని ఎవరికి అప్పగించాలి….? భార్యకా… సోదరుడికా…? అని కేసులో వాదనలు జరుగుతాయి. అది నిర్ణయించాలంటే…. మృతుడు…. కిషనా…? హమీదా….? తేలాలి. అదీ కేసు.
ఆఖరికి… మృతుడు.. మతం మారినట్టు ఆధారాలు లేకపోవడంతో…. అతడు కిషన్ అనీ… హమీద్ అనడానికి సాక్షాలు లేవనీ… కోర్టు అభిప్రాయానికి వస్తుంది. మృతుడి సోదరుడికి… మృతదేహం అప్పగిస్తూ… కోర్టు తీర్పు ఇస్తుంది.సోదరుడు, భార్య తరఫున…. రెండు కుటుంబాలు కలిసి… అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఆ రెండు రాజకీయ పార్టీల నాయకులకు…. ముఖ్యమంత్రి నుంచి… ఏదో పని మీద పిలుపు వస్తుంది. ఇద్దరూ… చెట్టాపట్టాలేసుకుని వెళ్తారు. సినిమా ముగుస్తుంది.
చాలా సీరియస్ సబ్జెక్ట్ ను… చాలా కామెడీతో డీల్ చేశాడు… డైరెక్టర్ ఫిరోజ్ అబ్బాస్ ఖాన్. ఫిరోజ్ అబ్బాస్ ఖాన్…. రంగస్థల రచయిత, దర్శకుడు. ఎక్కువగా రంగస్థలానికి పరిమితం అవడం వల్ల… సినిమాలు ఎక్కువగా తీయలేదు. ఈ సినిమా 01:39 గంటలే ఉంటుంది.
మతం కంటే మానవత్వం గొప్పదీ… మనిషి… తనకు నచ్చిన మతం ప్రకారం జీవిస్తాడు… చనిపోతే… ఏదో ఓ సంప్రదాయం ప్రకారం… మృతుడికి గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలి… రెండు కుటుంబాల మధ్య…. వివాదమే లేదు… మధ్యలోకి… రెండు రాజకీయ పార్టీలు రావడం ఎందుకు…? అనే సందేశం ఇస్తాడు… దర్శకుడు. సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలపై… మంచి సెటైరికల్ మూవీ.
ఇంకో విషయం ఏంటంటే… సినిమాకు… హేమంత్ చతుర్వేది ఫొటోగ్రఫీ హైలెట్ గా నిలిచింది. ఎడిటర్ ఎవరో తెలుసా….? మన అక్కినేని శేఖర్ ప్రసాద్. ఆయన గురించి చెప్పేదేముంది. ఎప్పుడైనా వీలయితే… సినిమా చూడండి… హాయిగా నవ్వుకుంటారు…. మంచి కాన్సెప్ట్.
ఇలాంటి సినిమా… మన తెలుగులో తీయాలంటే…. జాతిరత్నాలు డైరెక్టర్, మన జోగిపేట కుర్రాడు… కేవీ అనుదీప్ అయితే…. మస్తు డీల్ చేయగలడు.
Share this Article