.
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్నది… అంటేనే సిందూర్ 2.o లేదా సిందూర్ 3.o లేవు అని కదా… ప్రస్తుతం అమల్లో ఉన్నది సిందూర్ ఫస్ట్ ఫేజ్… కానీ కొన్ని చానెళ్లు 2.o… 3.0 అని రాసేస్తున్నాయి… అంటే డేట్లు మారగానే నంబర్ మార్చేస్తున్నాయి… మీకో దండంరా బాబూ…
మరో విషయం… ప్రస్తుతం S-400 సుదర్శన చక్రం పేరిట ఇండియాను రక్షిస్తున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టంను రష్యా నుంచి కొనుగోలు చేస్తుంటే అమెరికా బెదిరించింది… ఆంక్షలు పెడతామన్నది,.. మనకు ఈ ప్రపంచంలోనే నమ్మకమైన శ్రేయోభిలాషులు రష్యా, ఇజ్రాయిల్ మాత్రమే కదా…
Ads
భారత ప్రభుత్వం ఆ డిఫెన్స్ సిస్టం కొనుగోలుకే మొగ్గు చూపింది, అమెరికా హెచ్చరికలు జాన్తా నై అని కొట్టి పారేసింది… ఫలితం… ఈరోజు మన నగరాలకు శ్రీరామరక్ష ఆ సిస్టం… ఇజ్రాయిల్ సొంత ఎయిర్ డిఫెన్స్ 100 శాతం ఫలితాలు ఇవ్వడం లేదేమో గానీ… రాత్రి ఈ S-400 మన భారతీయ నగరాలను కాపాడింది…
దీన్ని కూడా అప్పట్లో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి… చివరకు బీజేపీ సుబ్రహ్మణ్యస్వామి కూడా… సరే, మన ఇండియన్ అపోజిషన్ అంటేనే ఓ దరిద్రం కదా… దాన్నలా వదిలేస్తే… మరో విషయం చెప్పుకోవాలి… అది ఐఎన్ఎస్ విక్రాంత్…
ఎప్పుడో తాతల్నాటి యుద్ధ నౌక… మనం కొన్నాం, సేవలు అందించింది… తరువాత మ్యూజియంగా మార్చాం… ఆ తరువాత పునర్నిర్మించాం… ఆ చరిత్ర జోలికి పోవడం లేదు ఇక్కడ… కానీ ఇప్పుడు మన నేవీలో అది తురుపు ముక్క…
నిన్న కరాచీ పోర్టును ధ్వంసం చేసింది… మరో అంశం రాఫెల్… అప్పట్లో బోఫోర్స్ మీద రాజకీయ దుమారంలాగే రాఫెల్ మీద కూడా బోలెడు ఆరోపణలు… ఆ కొనుగోళ్ల మీద విచారణలు… భారతీయ క్షుద్ర రాజకీయాలు తెలిసిందే కదా…
చివరకు ఏమైంది..? ఈరోజు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టం మాత్రమే కాదు… INS విక్రాంత్ మాత్రమే కాదు… ఈ రాఫెల్ ఫైటర్లు కూడా గేమ్ చేంజర్లు… ఈ మూడే ప్రస్తుతం ఇండియా- పాకిస్తాన్ ఘర్షణను డిసైడ్ చేస్తున్నాయి…
ఎస్, మన క్షుద్ర రాజకీయాలకు దాటేసి మన యుద్ధ నిపుణులు ఎప్పుడూ మనకు ఏది అవసరమో దాన్ని పుష్ చేస్తున్నారు… అవే ఇప్పుడు ఈ మత పైశాచిక శక్తులపై యుద్ధంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి… అదే ఇక్కడ చెప్పదలిచింది… అంతే…
Share this Article