.
సమంత తనే ఓ నిర్మాతగా మారాలనుకుంది… శుభం… డబ్బులున్నాయి… కానీ పెద్ద పెద్ద తారాగణం గాకుండా, పెద్దగా పేరున్న వాళ్లు గాకుండా కొత్త కొత్త వాళ్లను ఎంచుకుంది… శుభం…
కానీ ఆమె ఈ కథ ద్వారా ఏం చెప్పదలచుకుంది..? అసలు ఈ జానర్ ఏమిటి..? తను ఓ గెస్ట్ రోల్ చేసింది, కథ మీద దాని ప్రభావం ఉంటుందా..? ఉండదు… మరి ఏమాత్రం ఇంపాక్ట్ లేని ఆ గెస్ట్ రోల్ దేనికి..? మార్కెటింగ్ కోసం… కేవలం, దానికోసమే…
Ads
సరే, చేసింది పో… సినిమాకు కాస్త హారర్ వాసనలు… భయపెట్టవు… కాసింత కామెడీ టచ్… నవ్వించదు… థ్రిల్లర్‌గా కాసేపు అనిపిస్తుంది… ఏ థ్రిల్లూ లేదు… సోషల్ మెసేజా..? అదీ లేదు… అన్నీ కలగలిపి, మిక్సీ చేసి సినిమా వదిలారు…
పోనీ, ఆ కాస్త థిన్ లైన్ కథయినా ఆసక్తికరంగా ప్రజెంట్ చేశాడా దర్శకుడు, అదీ లేదు… సాగదీసి సాగదీసి చివరకు ప్రేక్షకుడు తలపట్టుకునే టైమలో శుభం కార్డు వేశాడు… ఏదో ఖర్చు పెట్టింది గానీ సమంత… నిర్మాణ విలువలు నాసిరకమే…
సంగీతం, సినిమాటోగ్రఫీ వంటివీ సినిమా స్థాయిలోనే ఉన్నాయి… వెరసి ఏదో తెలుగు సీరియల్ చూసినట్టు… అవును గానీ సినిమా కథే టీవీ సీరియల్… మామూలుగా సీరియళ్లు ఏళ్ల కొద్దీ నడుస్తుంటాయి కదా… ఇళ్లల్లో ముసలోళ్లకు ఏకైక వినోదం అదే… కానీ మధ్యలోనే సీరియల్ పూర్తిగాకుండా మరణిస్తే…?
ఏం చేస్తాయి పాపం, ఆత్మలు ఆ జన్మజన్మల బంధం సీరియల్ చూడటానికి ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్లను ఆ సీరియల్ టైమ్‌లో ఆవహించి సీరియల్‌ను చూసి తరిస్తుంటాయి, అడ్డుపడితే ఎవరినైనా తంతుంటాయి… కథలో సీరియల్‌కు కార్తీకదీపం అని పేరుపెట్టలేదు… శుభం…
ఇక ఇందులో మగాధిపత్యం, అల్ఫా మేల్ ధోరణి కొంత… మూడు జంటలు మూడు రకాలు… మూడు కథలు… నేపథ్యాలు వేరు… మొత్తానికి ఆ కామెడీ హారర్ సోషల్ థ్రిల్లర్ జానర్ ద్వారా సమంత ఏం చెప్పాలనుకున్నదో ఆమెకైనా అర్థమైందా అనేది పెద్ద సందేహం… ప్చ్, నిర్మాతగా తొలి ప్రయత్నమే ఓ విఫల సాహసం…
ఆ తీసేదేదో తనే ప్రధాన పాత్రగా ఓ వుమెన్ ఓరియెంటెడ్, మంచి కథతో తీస్తే ఆ ఎఫర్ట్ ఏమైనా వర్కవుట్ అయ్యేదేమో… నటిగా ఆల్రెడీ చాలా వెనకబడిపోయింది… ఆమధ్యలో వచ్చిన ఓ ఐటమ్ సాంగ్ తప్ప చాన్నాళ్లుగా తెర మీద లేదు… ఇప్పుడు నిర్మాతగా అవతారం… అదీ సో సో… అసలు సమంతకు ఏమైంది..?!
Share this Article