Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!

May 10, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …….. మోహన్ బాబు సినిమా . స్వంత బేనర్లో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో 1983 ఫిబ్రవరిలో వచ్చింది ఈ ధర్మపోరాటం సినిమా . Family sentiment + Crime + Action + Suspense . యన్టీఆర్ నా దేశం సినిమాలో లాగా విలన్లను వేనుకు కట్టి తీసుకుని వచ్చి కోర్టులో జడ్జి గారి ముందు పడేస్తాడు హీరో మోహన్ బాబు .

సినిమా నీట్ గా ఉంటుంది . మోహన్ బాబు నటన కూడ బాగుంటుంది . బహుశా ఏదైనా తమిళ సినిమాకు రీమేక్ ఏమో నాకు తెలియదు . కధా రచయితగా యం డి సుందర్ పేరు వేసారు . ఆయన మన తెలుగు కధకుడు కాదనుకుంటాను . మోహన్ బాబుకు సూటయ్యేలా ఏమయినా కొన్ని మార్పులు చేసి ఉండవచ్చు .

Ads

కల్తీ సారా కేసులో ఏక సభ్య కమీషనరుగా రిటైర్డ్ జడ్జి కొందరు దేశద్రోహులను ఐడెంటిఫై చేస్తారు . ఆ దేశద్రోహులు కక్ష కట్టి జడ్జి గారిని , ఆయన కుమార్తె , చిన్న కొడుకులను హత్య చేస్తారు . నిందితుడు తరఫున జడ్జి గారి కొడుకే కోర్టులో వాదించి అతన్ని రక్షిస్తాడు . సినిమాలో ట్విస్ట్ ఇదే . నిందితుడి ద్వారా అసలు కారకులను పట్టుకుని చట్టానికి అప్పచెపుతాడు హీరో . ఇదీ కధ టూకీగా .

జడ్జి గారిగా గుమ్మడి , ఆయన పెద్ద కొడుకుగా మోహన్ బాబు , భార్యగా పండరీబాయి , కుమార్తెగా పూర్ణిమ నటించారు . దేశ ద్రోహులుగా జగ్గయ్య , త్యాగరాజు , చలపతిరావులు నటించారు . పాపం జగ్గయ్య ! నా దేశం సినిమాలో , ఈ సినిమాలో కూడా కట్టివేయబడే విలన్లలో ఒకరుగా ఉంటారు .

మోహన్ బాబు ప్రియురాలిగా జయసుధ నటించింది . తన ప్రతిభను చూపేందుకు అవకాశం ఉన్న పాత్ర కాదు . పాత్రకు తగ్గట్లుగా చక్కగా నటించింది . ఇతర పాత్రల్లో గిరిబాబు , కన్నడ ప్రభాకర్ , భీమరాజు , సారధి , జ్యోతిలక్ష్మి , ప్రభృతులు నటించారు .

సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . విశేషం ఏమిటంటే జేసుదాస్ పాడకపోవటం . బాలసుబ్రమణ్యమే పాడారు . బాగానే సూటయింది . ఆత్రేయ కూడా బాగా వ్రాసారు . అన్ని పాటల్లోను చాలా బాగుండే పాట మోహనరాగం పొంగెను యెదలో మువ్వలనాదం మ్రోగెను లయలో . తప్పక చూడండి . చిత్రీకరణ కూడా అందంగా ఉంటుంది .

మిగిలిన పాటలు అమ్మ తోడు నీ తోడు అలవిగాని అల్లరోడు , గిరి గీచి కాస్తా గురి చూసి కొడతా , తిక్క తిక్క పిల్లా ఏం తిమ్మిరెక్కిందా డ్యూయెట్లుగా పర్లేదు . మోహన్ బాబు , జయసుధ జోడీ హిట్ జోడీయే కదా ! ఓ దైవమా ఇదే ధర్మమా ఇదే న్యాయమా విషాద గీతం లిరిక్స్ బాగుంటాయి . వెరశి పాటలన్నీ బాగుంటాయి . సాధారణంగా మోహన్ బాబు స్వంత సినిమాల్లో పాటలు బాగానే ఉంటాయి .

సత్యానంద్ డైలాగ్స్ కూడా పదునుగానే ఉంటాయి . సినిమా షూటింగ్ ఎక్కువ భాగం తిరుపతి , ఆ చుట్టుపక్కలే చేసినట్లు ఉన్నాయి . సినిమా ముగింపులో చిన్న పిల్లగా మంచు లక్ష్మి కనిపిస్తుంది . సినిమా యూట్యూబులో ఉంది .

మోహన్ బాబు , జయసుధ అభిమానులు , సినీ ప్రేమికులు చూడవచ్చు . చూడతగ్గ సినిమాయే . వంద రోజులు ఆడిన హిట్ సినిమా . వంద రోజుల సంబరాలు మద్రాసులో జరిగాయి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions