.
ఏపీకి సంబంధించిన వార్తే… ఆంధ్రప్రభ క్లిప్పింగ్… నిజమేనో కాదో తెలియదు గానీ, నిజమైతే కూటమి ప్రభుత్వ ముఖ్యులు తెలుగు జాతికి వివరణ ఇచ్చుకోవాలి ఓసారి…
వార్తలో విషయం ఏమిటంటే..? ‘‘ఇకపై ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం ఉండదు, మొత్తం ఇంగ్లిష్ మీడియమే… తెలుగు మీడియంలో బోధన ఉండదు, పరీక్షలు ఉండవు… ఇంగ్లిషుతోపాటు తెలుగు మీడియం కూడా కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు…
Ads
పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లిష్ మీడియమే దిక్కు… ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు కొంత వెసులుబాటు ఇచ్చారు గానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలి, పరీక్షలు రాయాలి, పాఠాలు చెప్పాలి…’’
…. ఎస్, ప్రపంచం ఓ గ్లోబల్ విలేజీగా మారింది… ఈ దేశంలోనే సరిపడా కొలువులు అసాధ్యం… పొట్ట చేత్తో పట్టుకుని, అవకాశాలు ఎక్కడుంటే ఆ దేశానికి ఎగిరిపోతున్నారు… మరి ఇంగ్లిష్ తప్పనిసరి కదా… అదే సమయంలో మాతృభాషను కూడా రక్షించుకోవాలంటే ఓ లాంగ్వేజీ సబ్జెక్టుగా తెలుగును బోధిస్తూ, మిగతా సబ్జెక్టులన్నీ ఇంగ్లిషులో బోధించాలని కదా చాలామంది చెబుతున్నది…
మరి గతంలో జగన్ దశలవారీగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి… మన బడి పేరిట స్కూళ్ల ఇన్‌ఫ్రా మెరుగుపరుస్తూ వెళ్తున్నప్పుడు ఇదే జనసేన, ఇదే టీడీపీ గగ్గోలు పెట్టాయి కదా… తెలుగును చంపేస్తారా అని గొంతెత్తాయి కదా… మరి మీరు చేస్తున్నదేమిటి..?
తప్పని కాదు, రియాలిటీని అర్థం చేసుకోకుండా కేవలం పొలిటికల్ ప్రయోజనాల కోసం గాయిగత్తర లేపడం… తీరా కుర్చీ ఎక్కాక మీరూ అదే బాటలో వెళ్లడం… దీన్ని రాజకీయం అంటారు గానీ రాజనీతిజ్ఞత అనరు…
అబ్బే, ఈరోజుల్లో తాత్కాలిక రాజకీయ లబ్దికి ఏవేవో మాట్లాడేయడం, తరువాత ప్లేటు ఫిరాయించడం అలవాటే కదా అంటారా..? అవును, అదీ నిజమే… అప్పుడొక మాట ఇప్పుడొక మాటకు కనీసం వివరణలు కూడా వర్తమాన రాజకీయాల్లో అవసరమే లేదు… అదీ సంగతి…
Share this Article