.
ఈమధ్య సినిమా సెలబ్రిటీల చెత్త వాగుళ్లు ఎక్కువయ్యాయి కదా… దిల్ రాజు, శ్రీముఖి, శ్రీకాంత్ అయ్యంగార్ దగ్గర నుంచి నాగవంశీ, ఎస్‌కేఎన్, త్రినాథరావు…. ఎవరు తక్కువ..? 90 వేసుకుని వేదికల మీదకు వస్తారేమో…
నాలుక మీద, మెదడు మీద అదుపు ఉండదు… ఏం మాట్లాడుతున్నామనే సోయీ ఉండదు… ఆమధ్య ఓ నిర్మాత అన్షు అంబానీ సై- ల మీద వెకిలి కూతలకు దిగాడు ఓ వేదిక మీద… తరువాత సారీ చెప్పినట్టున్నాడు…
Ads
ఏదో కూయడం, సారీ చెబుతూ ఓ వీడియో జనం మొహాన పారేయడం బాగా అలవాటైంది… రానురాను వేదిక మీదకు, మీడియా మీట్లకు వచ్చే ముందే బ్రీత్ అనలైజర్స్ పెట్టాలేమో… తాజాగా ‘సింగిల్’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా వేవో కూసిన నిర్మాత ఎస్‌కేఎన్ (పూర్తి పేరు ఏమిటో..?) నెటిజనం దుమ్ము దులిపేస్తున్నారు…
కావాలని సినిమా ప్రచారం కోసం ఇలా నెగెటివ్‌గా వార్తల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, చేయిస్తున్నారేమో కూడా తెలియదు… హీరోయిన్ కేతిక శర్మ… అప్పట్లో ఏదో ఇంటర్వ్యూలో తాను బాత్‌రూం సింగర్ అనే ప్రస్తావన వచ్చింది…
(బహుశా అప్పట్లో రొమాంటిక్ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ప్రభాస్ ఓ పాటపాడమని అడిగితే తాను బాత్‌రూం సింగర్‌ను అని చెబుతుంది ఆమె…) దాన్నే మనసులో పెట్టుకుని, మీ బాత్‌రూాంకు మాకు ఎలాగూ యాక్సెస్ ఉండదు కదా, ఇక్కడే ఓ పాట పాడండి అన్నాడు… చెత్తా వ్యాఖ్య… ఓ అమ్మాయి బాత్‌రూంకు యాక్సెస్ ఉండటం ఏమిటో ‘సదరు చీప్ టేస్ట్’ రసికుడికే తెలియాలి…
పైగా తనకు అమ్మాయిలతో కంఫర్ట్ ఎక్కువ అట… అంతకుముందు ఇదే సినిమా ప్రోమో సందర్భంగా కావచ్చు, సేమ్ కూతలు… చవకబారుతనం…
పాపం, తెలుగు సరిగ్గా రాాదు మన సినిమాల్లో నటించడానికి వచ్చే ఇతర భాష తారలకు… కావాలని మొహాల మీద ప్లాస్టిక్ నవ్వు పులుముకుంటారు… కేతిక మీద తన పిచ్చి వ్యాఖ్య సమయంలో పక్కనే ఉన్న వెన్నెల కిషోర్ కూడా నవ్వుతూ జతకలిశాడు… ఇద్దరూ ఇద్దరే…
సినిమా ప్రమోషన్ల ఇంటర్వ్యూలు సుమ దగ్గర నుంచి అందరూ ఫన్ ఓరియెంటెడ్‌గా నడిపిస్తారు… అదుగో ఆ ఫన్ పేరిట ఇలాంటి ఛండాలం ప్రదర్శిస్తేనే ప్రేక్షకులకు మండేది..!! అవునూ, ఈయనే కదా ఆమధ్య బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించి పరోక్షంగా, ఇకపై తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేయబోం అని చెప్పి, తరువాత నాలుక కర్చుకున్నాడు..!!
ఇకపై ఈ ఎస్‌కేఎన్‌ను ఇలాంటి ప్రమోషనల్ ప్రోగ్రాములకు పిలిచేవాళ్లూ జాగ్రత్త, ఎప్పుడో అడ్డగోలుగా బుక్కయిపోతారు… ఆమధ్య 30 ఇయర్స్ పృథ్వి ఏవో పిచ్చి కూతలు కూస్తే విష్వక్సేన్ తను క్షమాపణలు చెప్పుకుని, కవర్ చేయడానికి నానాతంటాలూ పడ్డ సంగతి గుర్తుంది కదా..!!
Share this Article