Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుడ్డిగా నమ్మేయవద్దు… సోషల్ మీడియాలో కొందరుంటారు… జాగ్రత్త…!!

May 16, 2025 by M S R

.

Yanamadala Murali Krishna ……….. నా ఎఫ్‌బి ఫ్రెండ్స్‌లో ఒక ‘డాక్టర్’ ఉండేవారు. అతనికి మంచి సంఖ్యలో ఫాలోవర్స్ వున్నారు. ఒక సూపర్ స్పెషలిస్ట్ గా చలామణి అవుతూంటాడు. అతని పోస్టులు అనేక అంశాల మీద ఉంటాయి.

కానీ, మెడికల్ పోస్టులలో ఏ మాత్రం పరిణతి – విషయ పరిజ్ఞానం కనిపించవు. జస్ట్, మీడియాలో డెస్క్ సబ్ ఎడిటర్స్ రాసే కంటెంట్ లాగా పైపైన ఉంటుంది (కొందరు మీడియా మిత్రులు ఆరోగ్య విషయాలలో లోతుగా పరిశీలించి చక్కని అవగాహన కల్పిస్తారు).

Ads

నెట్ లో నాలుగు ఆర్థికల్స్ చదివి, ఐటమ్ రాసిన దానికి మించిన లెవెల్ విషయము కనిపించదు. అంటే, ఏం చెప్పారో గానీ మా బాగా చెప్పారు అనే రకంగా హరికథా కాలక్షేపంలా… పనికొచ్చే విషయం – టేక్ హోమ్ మెసేజ్ ఉండదు. నాకు అతని వాలకం చూసి మోడర్న్ మెడిసిన్ లో క్వాలిఫికేషన్ ఉన్నట్టు అనిపించేది కాదు.

నాకు అతనితో పోల్చితే, ఫాలోవర్స్ తక్కువ. నాతో అభిమానంగానే ఉండేవాడు. ఇదిలా ఉండగా, 2021 ఏప్రిల్ లో నా కోవిడ్ హోమ్ కేర్ పోస్ట్ ఒక్కటి ఒకే రోజు 3000 షేర్స్ అయినవి. ఆ పోస్టు కింద ఏదో రాసాడు. నేను పట్టించుకోలేదు…

తర్వాత కోవిడ్ కి సంబంధించి, లోతుగా అధ్యయనం చేస్తూ అనేక సాధికారమైన పోస్టులు రాస్తూ వున్నాను. అతన్ని పట్టించుకోవడం లేదు, నా గౌరవం గొప్పగా పెరిగిపోతూ వున్నది. నేను ఒక బ్రేకింగ్ లాంటి పోస్టు పెట్టినప్పుడల్లా నా పేరు ప్రస్తావన లేకుండా తనకు తెలియక పోయినా… నా పోస్ట్ లో ప్రస్తావించిన విషయానికి కౌంటర్ గా, ఇంకేదో విషయం చెప్తున్నట్టు ఏదో రాసేస్తూ వుండే వాడు.

అవన్నీ అతని అజ్ఞానాన్ని పట్టి ఇచ్చేవి. అన్నీ తప్పులే – అతనికి తెలియని విషయాలే. ఒక పదం తెలియక పోయినా ఏదో ఊహించుకొని రాసేసేవాడు. వాటన్నిటికీ కారణం అసూయ. అవి చూసి, నాకు అతని క్వాలిఫికేషన్ మీద అనుమానం ఉండేది.

అతను అసలు మోడర్న్ మెడిసిన్ చదివాడా? లేకపోతే ఆయుర్వేదం, హోమియో వంటి దేశీయంలో  క్వాలిఫై అయ్యి, కార్పొరేట్ హాస్పిటల్స్ లో సంబధిత సూపర్ స్పెషాలిటీలో డ్యూటీ డాక్టర్ గా పనిచేసి, సూపర్ స్పెషలిస్ట్ గా చలామణి అవుతున్నాడా అని అనుమానం.

అలాగే, ఏమి రాసారో గాని బాగా రాసారు అన్నట్టు కార్పొరేట్ హాస్పిటల్స్ విధానాలు సరైనవి అని చెప్పడం వంటివి చేసేవాడు. చివరికి తెలిసింది, అతడు MBBS చదివాడు. ఏదో పోస్టు ద్వారా రప్పించుకొనే… మెడికల్ కౌన్సిల్ గుర్తింపు లేని సర్టిఫికెట్ సంపాదించాడు. అనగా అతను MBBS డిగ్రీ మాత్రం కలిగిన వాడు.

అతని వైద్య పరిజ్ఞానం ఏ పోస్ట్ లోనూ తెలీదు. ఏమీ తెలియకపోయినా, కేవలం మాటకారితనంతో మేధావిగా గుర్తింపు – గౌరవం పొందడం ఒకటే తెలిసిన మనిషిలా అగుపిస్తాడు.

కోవిడ్ తర్వాత గుండె పోటు మరణాలు పెరిగాయి అంటే, తనకు ఆ విషయాలు తెలియక పోయినా… అబ్బే ఏమీ కాదు అని చప్పరించెయ్యడం, దాన్ని సమర్థించుకోవడానికి… అతి తెలివితేటలతో పసలేని వాదన చెయ్యడం. ఇలాంటి అసూయగ్రస్తులను, అర్హతకి మించిన గౌరవం పొందే వారిని, తమను తాము గొప్పవాళ్లుగా ఊహించుకొనే వారిని పట్టించుకోరాదు.

మనం చిత్తశుద్ధితో ఏదైనా చేస్తున్నప్పుడు కొన్ని రాళ్లు పడడం మామూలే అనుకోవాలి…. అందుకే సోషల్ మీడియాలో ఎవరు ఏది రాసినా సరే గుడ్డిగా నమ్మేయవద్దు… కొందరు ఉంటారు… జాగ్రత్త..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రవితేజ సినిమా అయితేనేం… సూపర్ ఫ్లాప్, చివరకు టీవీల్లో కూడా…
  • రియల్ కల్‌ప్రిట్ పాకిస్థాన్ కాదు… దాని వెనుక అమెరికా ట్రంపు…
  • ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?
  • Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!
  • *రెండు జెళ్ల’తో అర్జెంటుగా కుర్రాళ్ల మనసుల్ని పిచ్చెక్కించేసింది…!!
  • ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!
  • బిగ్‌బాస్… బిగ్‌లాస్… కళ్లు నెత్తికి ఎక్కడం తప్ప వేరే ఫాయిదా లేదు..!!
  • ట్రంపు చెప్పాడని ఐఫోన్ గుడ్డిగా వినదు… అది పక్కా వ్యాపారం…
  • వాళ్ల మానాన వాళ్లు బతుకుతున్నా సరే… శ్రీముఖి వదిలేట్టు లేదు…
  • గుడ్డిగా నమ్మేయవద్దు… సోషల్ మీడియాలో కొందరుంటారు… జాగ్రత్త…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions