Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రియా హరి..! తనే నిర్మాత, తనే హీరోయిన్… ఓ కృత్రిమ ప్రేమకథ…

May 16, 2025 by M S R

.

లెవెన్… అదేలెండి, ఎలెవెన్… తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు… సహనిర్మాత నటి రియా హరి… తమిళమే… మరి సినిమా అన్నాక, కథ మెయిన్ ప్లాట్ ఎలా ఉన్నా ఓ ప్రేమకథ ఉండాలి కదా…

అందుకని ఈ సినిమాలోనూ ఓ లవ్ ట్రాక్ జొప్పించారు… నిజానికి కథకూ దానికీ లింకేమీ ఉండదు, కథలో అది ఇమడలేదు నిజానికి… ఈమాత్రం దానికి మళ్లీ వేరే ఓ హీరోయిన్ ఎందుకులే, నవీన్ చంద్ర పక్కన నేను సరిపోనా ఏం అనుకుని హీరోయిన్‌గా రియా హరి తనే చేసింది…

Ads

ఆమె ఆ పాత్రలో సూట్ కాలేదు.., పైగా కృత్రిమంగా జొప్పించబడిన ఆ ప్రేమకథలో లైఫ్ లేదు.., పైగా ఒకే డైమెన్షన్‌లో నటించే, కనిపించే హీరో నవీన్ చంద్ర… ఇవీ కథాగమనానికి అడ్డుపడుతూ చిరాకుపుట్టిస్తయ్…

నిజమే… 20 ఏళ్లుగా ఫీల్డులో ఉన్నాడు నవీన్… అన్నిరకాల పాత్రలూ వేస్తాడు… కానీ తన నటనలో ఓ మొనాటనీ ఉంటుంది… సీరియస్ ఫేస్… ఎమోషన్, కామెడీ, భయం గట్రా ఏ ఉద్వేగం తీసుకున్నా సరే, తను అంతే… కాకపోతే సీరియస్ సీన్లలో మాత్రం బాగా చేస్తాడు…

ఇందులోనూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫిట్టయ్యాడు… ఎటొచ్చీ హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ లేదు, ఫిజిక్స్ లేదు, అసలు కామర్స్, మ్యాథ్స్ కూడా లేదు… పైగా హీరో పాత్ర కేరక్టరైజేషన్‌లో ఓ దర్యాప్తు అధికారిగా గాకుండా పాత విషయాల్ని వివరించే ఓ కథకుడిలా అనిపిస్తాడు పాపం…

వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి… ఓ పోలీసాయనకు ప్రమాదం, తన స్థానంలో హీరో వస్తాడు… ట్విన్స్‌లో ఒక్కరినే హత్య చేయడం మాత్రమే ఓ కొత్త పాయింట్… కాకపోతే ఓ ఫ్లాష్ బ్యాక్, బిఫోర్ క్లైమాక్స్ ట్విస్టులు కాస్త ఆసక్తిగా ఉంటాయి తప్ప ఇక మొత్తం అనాసక్తంగా సాగుతుంది…

నవీన్ చంద్ర వెబ్ సీరీస్‌ల్లో కూడా కనిపిస్తాడు కదా… ఎక్కువగా ఇలాంటి పాత్రలే… అవును, ఈ సినిమా కూడా ఓటీటీకి సూటబుల్… థియేటర్లలో పెద్దగా క్లిక్ కాదు, అయ్యేందుకు చాన్సే లేదు… పాపం శమించుగాక..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొందరుంటారు జుకర్‌బర్గ్ రక్తబంధువులు… ఇదొక సోషల్ రుగ్మత…
  • ఓ మగ సూపర్ స్టార్ తనలోని ఆడకోణాన్ని ప్రదర్శించే భిన్న ప్రకటన..!!
  • ఎస్పీ బాలు పాడనని భీష్మించిన వేళ… జేసుదాస్ పాటలు కర్ణపేయం…
  • RIC … చైనాతో ఇండియా చేతులు కలిపేలా… అమెరికా దాష్టీకం…!!
  • వెల్‌కమ్ టు హైదరాబాద్… ఫర్ వర్క్, ఫర్ సెటిల్, ఫర్ లివ్, ఫర్ ఇన్వెస్ట్…
  • 1999 నాటి సినిమా… వందలసార్లు టీవీల్లో వేసినా అవే తోపు రేటింగ్స్…
  • మీడియా ఏదేదో రాసింది… కోట వినుత కేసులో అసలేం జరుగుతోంది…!?
  • ప్రభాస్ కొత్త ఇంట్లో కోటి రూపాయల కల్పవృక్షమట… నిజమెంత..?!
  • ఎంత ఎదిగితేనేం..? క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా దూరమైందా రష్మిక..!?
  • సర్జరీ అందం కాదు, సహజం అట… సీత పాత్ర ఎంపికకు ఇదేం అర్హతట..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions