.
#గ్యాంగర్స్… అమెజాన్… Ashok Pothraj …… ఒక ఊళ్లో ఒక సమస్య .. ఆ సమస్యను పరిష్కరించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. అలా వచ్చిన హీరోను చూసి హీరోయిన్ మనసు పారేసుకుంటుంది .. అనేవి చాలా కథల్లో కామన్ గా కనిపించే సన్నివేశాలు.
అయితే సమస్య ఏమిటి? దానిని హీరో ఎలా సాల్వ్ చేశాడు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కున్నాడు? అనే అంశాలే ఆ కథను రక్తి కట్టేలా చేస్తాయి. మరి ఈ కథ ఎంతవరకూ రక్తి కట్టించిందంటే, కొంతవరకూ అని చెప్పవచ్చు.
Ads
బేసికల్లీ సుందర్ సి. సినిమాలంటేనే పెద్ద పెద్ద కోటలు, పాడు బడిన బంగ్లాలు, ఆత్మలు, దెయ్యాలు, మాంత్రికులు, సీన్ కి సరిపోయే విధంగా సింక్ అయ్యే విధంగా దేవతల వద్ద భారీగా జనాలతో పూజలు, దాంట్లో పాటలు. ఇవి మాత్రం పక్కా ఉండేలా స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఈ సినిమా అలాంటివి ఏమీ లేవు. ఒక దేవతల పాట తప్ప.
ఈ కథలో ఓ మూడు ట్విస్టులు ఉన్నాయి. వాటిని ఆడియన్స్ గెస్ చేయలేరనే చెప్పాలి. ఆ ట్విస్టుల కారణంగా ఈ కథ బలం పెరిగింది. అవి లేకపోతే ఇది రొటీన్ స్టోరీ అయ్యుండేది. సుందర్ సి రాసుకున్న ఈ కథలోని ట్విస్టులు, రచయితగాను ఆయనకి గల అనుభవాన్ని చెబుతాయి. బలమైన విలనిజాన్ని డిజైన్ చేయడంలోను ఆయన తనదైన స్టైల్ ను ఫాలో అయ్యాడు.
ఈ సినిమా ఫస్టాఫ్ అంతా ఇంట్రెస్టింగ్ గానే నడుస్తుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ తరువాత మరింత బలం పుంజుకోవలసిన ఈ కథ .. బలహీనపడటం మొదలవుతుంది. ఫస్టాఫ్ లో తన పాత్రతో సమానంగా వడివేలు పాత్రను నడిపిస్తూ వచ్చిన ఆయన, సెకండాఫ్ ను వడివేలుకు వదిలేశాడు. గందరగోళంలో నుంచి కామెడీని బయటికి తీసే ప్రయత్నం చేశాడు. ‘అతి కామెడీ అనర్థం’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదుగా.
సుందర్ సి. దర్శకత్వం వహించిన ఈ సినిమా, యాక్షన్ కామెడీ జోనర్ కి చెందినదే. అయితే గతంలో తాను తెరకెక్కించిన హారర్ కామెడీ కథల పద్ధతిలోనే ఆయన ఈ కథను రాసుకున్నాడు. దెయ్యాలు లేవనేగానీ ఆ ఫార్మేట్ లోనే ముందుకు వెళుతుంది. సెకండాఫ్ పై ఇంకాస్త గట్టిగా కూర్చుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.
సుందర్ సి. ఆసక్తికరమైన ట్విస్టులతో ఈ కథను చాలా వరకూ రక్తికట్టిస్తూ వచ్చాడు. వడివేలు సిల్లీ కామెడీ కాస్త చిరాకు పెడుతున్నా, మెయిన్ ట్రాక్ పట్టుకునే ఆడియన్స్ తమ ప్రయాణం సాగిస్తారు. ఎప్పుడైతే విలన్ అధీనంలోని 100 కోట్లను తమ సొంతం చేసుకోవడానికి హీరో మాస్టర్ ప్లాన్ గీస్తాడో, అక్కడి నుంచే కథలో గందరగోళం మొదలవుతుంది.
అక్కడ దృష్టి పెట్టి ఉంటే బాగుండేదేమో. ఐనా క్లైమాక్స్ ట్విస్ట్ చాలా థ్రిల్ కలిగిస్తుంది. నాకైతే నచ్చింది అమేజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది…
Share this Article